శుక్రవారం, డిసెంబర్ 17, 2010న, గ్లెన్‌డేల్‌లోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్-పార్క్‌లోని క్రిప్ట్‌లో మన ప్రియమైన శ్రీ దయామాతగారి భౌతికకాయాని సమాధి చేసారు.
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. డైరెక్టర్ల బోర్డు సభ్యులు మరియు ఇతర సీనియర్ సన్యాసులు మరియు సన్యాసినులు ఈ సందర్భంగా క్రిప్ట్‌లో క్లుప్తమైన, కానీ పవిత్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దయామాతగారి క్రిప్ట్ మన గురుదేవులు పరమహంస యోగానందగారి క్రిప్ట్ కు చాలా దగ్గరగా ఉంది. సందర్శకులు ఎస్.ఆర్.ఎఫ్. విజిటర్స్ డైరెక్టరీలోని 28-29 పేజీలలోని దిశలు మరియు రేఖాచిత్రానికి ఉన్న సూచనల ద్వారా దానిని గుర్తించవచ్చు.
దీన్ని కనుగొనడానికి ఇక్కడ దిశా సూచనలు ఉన్నాయి:
పరమహంస యోగానందగారి క్రిప్ట్‌కు వెళుతున్నట్లుగా కొనసాగండి: హోలీ టెర్రేస్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, కోవినెంట్ యొక్క కారిడార్‌లో నడవండి. రెండవ హాలు, ద కారిడార్ ఆఫ్ రెవరెన్స్, వద్ద కుడివైపు తిరగండి. దాని చివర సెయింట్ జార్జ్ విగ్రహం ఉంది. హాలులో జాగ్ని అనుసరించండి, మొదట ఎడమవైపు, తర్వాత కుడివైపు. మడోన్నా కారిడార్‌లో కొనసాగండి, గోల్డెన్ స్లంబర్ శాంచరి దాటి అక్కడే పరమహంసగారి క్రిప్ట్ ఉంది. హాల్ చివరి వరకు వెళ్ళండి. శ్రీ దయామాతగారి క్రిప్ట్ ఎడమ వైపున ఉంది (పరమహంస యోగానందగారి క్రిప్ట్ ఉన్న హాలులో అదే వైపు) – బయటికి వెళ్ళే ద్వారం ముందు. ఇది దిగువ నుండి నాల్గవ క్రిప్ట్, మరియు దానికి గుర్తుగా తాజా పూల బొకేలు ఉన్నాయి.

(దయచేసి గమనించండి: భక్తులను కొన్నిసార్లు ఫారెస్ట్ లాన్ సిబ్బంది మరొక ప్రవేశద్వారం ద్వారా సమాధి మందిరంలోకి ప్రవేశించమని నిర్దేశిస్తారు; ఈ సందర్భంలో దయచేసి వారి సూచనలను అనుసరించండి.)
హాలు చివర ఉన్న బెంచీపై, దయామాతగారి క్రిప్ట్‌కు ఎదురుగా, ఒక అనామక దాత మన గురుదేవుల నుండి కొటేషన్‌ను ప్రేమగా బెంచీపై ఉంచారు, అది గమనించడానికి భక్తులు ఆసక్తి చూపగలరు.
జై గురు, జై మా!