ప్రతిజ్ఞ (ధృవీకరణ) సూచనలు

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి శాస్త్రీయ స్వస్థత ప్రతిజ్ఞ (ధృవీకరణల) పుస్తకము నుండి
ప్రతిజ్ఞల (ధృవీకరణల) యొక్క శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం

మానవుడు యొక్క మాటే మానవుడిలోని ఆత్మ. నిజాయితీ, నిశ్చయత, విశ్వాసం మరియు అంతర్ దృష్టితో నిండిన పదాలు అత్యంత పేలుడు ప్రకంపనలు కలిగిన బాంబుల వంటివి, ఇవి ఉపయోగించినప్పుడు, కష్టాల బండలను పగలగొట్టి, కావలసిన మార్పుని తీసుకు వస్తాయి.

నిరాశ లేదా ఆనందం, చిరాకు లేదా ప్రశాంతత గురించి చేసే ప్రతి ఆలోచన మెదడు కణాలలో సూక్ష్మమైన గాడిని చేస్తుంది మరియు అనారోగ్యము లేదా ఆరోగ్యము వైపు ధోరణులను బలపరుస్తుంది.

అనారోగ్యము లేదా ఆరోగ్యం యొక్క అవ చేతన ఆలోచన-అలవాటు మనిషి మీద బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మొండి పట్టుదలగల మానసిక లేదా శారీరక వ్యాధులు ఎల్లప్పుడూ అవచేతనలో లోతైన మూలాన్ని కలిగి ఉంటాయి. దాగి ఉన్న మూలాలను బయటకు తీయడం ద్వారా అనారోగ్యం నయమవుతుంది. అందుకే చేతన మనస్సు యొక్క అన్ని ప్రతిజ్ఞలు (ధృవీకరణలు) అవచేతనలోకి చొచ్చుకుపోయేటంత ఆకట్టుకునేలా ఉండాలి, ఇది స్వయంచాలకంగా చేతన మనస్సును ప్రభావితం చేస్తుంది.

బలమైన చేతన ప్రతిజ్ఞలు (ధృవీకరణలు) మనస్సు మరియు శరీరంపై అవచేతన మాధ్యమం ద్వారా ప్రభావం చూపుతాయి. ఇంకా బలమైన ప్రతిజ్ఞలు (ధృవీకరణలు) అవచేతనానికి మాత్రమే కాకుండా అద్భుత శక్తుల నిలయమైన అధిచేతన మనసుని కూడా చేరుతాయి.

సత్య ప్రకటనలను ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛగా, వివేకంతో మరియు భక్తితో ఆచరించాలి. ఒకరి ధ్యాస పక్కకి మళ్ళనీయ కూడదు. చంచలమైన ఏకాగ్రతను మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, తప్పించుకునే పిల్లవాడిలా, మరియు ఇచ్చిన పనిని నిర్వర్తించే వరకు మనసుకు పదేపదే ఓపికగా శిక్షణ ఇవ్వాలి.

సహనంతో, శ్రద్ధతో, మరియు వివేకముతో చేసే పునశ్చరణలు అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక మానసిక లేదా శారీరక బాధలను నయం చేయడానికి ప్రతిజ్ఞలు (ధృవీకరణలు) తరచుగా, లోతుగా మరియు నిరంతరంమార్పులేని (లేదా విరుద్ధమైన పరిస్థితులను పూర్తిగా విస్మరిస్తూ) ఒకరి గాఢమైన అంతర్ దృష్టి నిశ్చయంలో భాగమయ్యే వరకు పునశ్చరణలు చేయాలి.

ఓ దేదీప్యమానమైన కాంతి! నా హృదయాన్ని మేలుకొలుపు, నా ఆత్మను జాగృతం చేయి, నా చీకటిని పారద్రోలు, నిశ్శబ్దం యొక్క ముసుగును చింపివేయు, మరియు నా దేవాలయాన్ని నీ మహిమతో నింపు.

మీ ప్రతిజ్ఞలు (ధృవీకరణలు) ఎంచుకోండి మరియు మొత్తం పునశ్చరణ చేయండి, మొదట బిగ్గరగా, తర్వాత మృదువుగా మరియు మరింత నెమ్మదిగా, ఎప్పటి వరకు అంటే మీ స్వరం గుసగుసలాడే వరకు. ఆ తరువాత మీరు నాలుక లేదా పెదవులను కదల్చకుండా, మానసికంగా లోతైన, నిరంతర ఏకాగ్రత పొందారని మీకు అనిపించే వరకు మానసికంగా పునశ్చరణ చేయండి, ఇది అపస్మారక స్థితి కాదు, కానీ నిరంతరాయమైన ఆలోచన యొక్క గాఢమైన కొనసాగింపు.

మీరు మీ మానసిక ప్రతిజ్ఞలు (ధృవీకరణలు) కొనసాగిస్తూ, ఇంకా లోతుగా వెళితే, మీకు ఆనందం మరియు శాంతి పెరుగుతున్న అనుభూతి కలుగుతుంది. లోతైన ఏకాగ్రత స్థితిలో, మీ ప్రతిజ్ఞ అవచేతన ప్రవాహంతో విలీనం అవుతుంది, తరువాత అలవాటు అనే సూత్రం ద్వారా మీ ప్రతిజ్ఞ శక్తితో బలోపేతమై మీ చేతన మనస్సును ప్రభావితం చేయడానికి తిరిగి వస్తుంది.

మీరు నిరంతరం పెరుగుతున్న శాంతిని అనుభవిస్తున్న సమయంలో, మీ ప్రతిజ్ఞ (ధృవీకరణ) అధిచేతన రాజ్యంలోనికి లోతుగా వెళుతుంది, అలా వెళ్ళిన ప్రతిజ్ఞ అపరిమిత శక్తితో మీ చేతన మనస్సును ప్రభావితం చేయడానికి మరియు మీ కోరికలను నెరవేర్చడానికి తర్వాత తిరిగి వస్తుంది. మీరు సందేహ పడకుండా ఉంటే ఈ శాస్త్రీయ విశ్వాసం యొక్క అద్భుతాన్ని చూస్తారు.

ప్రతిజ్ఞలను ఎలా సాధన చేయాలి

మరింత చదవడానికి

Scientific Healing Affirmations – శ్రీ శ్రీ పరమహంస యోగానంద

Share this on

This site is registered on Toolset.com as a development site.