భగవాన్ శ్రీకృష్ణుడు

భగవాన్ కృష్ణ

శ్రీకృష్ణుడు క్రీస్తు కంటే అనేక శతాబ్దాల పూర్వము జీవించారు. వీరిని భారతదేశంలో అవతారా పురుషుడుగా భావిస్తారు, పూజిస్తారు. వీరి జీవిత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు అనేక ఇతిహాసాలు, పురాణాలలో ఉన్నాయి.

శ్రీకృష్ణుని ఉదాత్త బోధనలు భగవద్గీతలో నిక్షిప్తమయి ఉన్నాయి. పరమహంస యోగానంద స్వామి భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రెండు పుటల గ్రంథముగా వ్రాశారు. దానిలో యోగానంద స్వామి భగవద్గీత గురించి ఇలా వ్రాశారు:

“అది ఉపనిషత్తుల సారము, భారతదేశంలో అత్యంత ఆదరణీయ గ్రంథము, హిందువులకు బైబిల్ వంటిది, గొప్ప పవిత్ర గ్రంథము, ఆధ్యాత్మిక సర్వోత్తమ ప్రమాణాలకు మూల గ్రంథముగా జగద్గురువులందరు భావించిన గ్రంధము….

“నాలుగు వేదాలు, 108 ఉపనిషత్తులు, షట్ శాస్త్రాల సారముగానూ, సంపూర్ణ ఆధ్యాత్మిక మార్గదర్శనిగాను భగవద్గీత కొనియాడబడుచున్నది. గీతలో విశ్వ నిర్మాణము యొక్క పరిపూర్ణ జ్ఞానము ఇమిడి ఉంది. సరళమైన మృదుమధురమైన సంస్కృత పదజాలం సర్వోత్కృష్ట భావాలు నిండి ఉన్నాయి. చతుర్విధ భక్తుల (ఆర్తోజిజ్ఞాసురర్ధార్దిజ్ఞాని) అవసరాలు, చతర్విధ ఆధ్యాత్మిక మార్గాలు (కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలు) – ఇలా అన్నీ రకాల జీవన విధానాలను గురించి వివరిస్తుంది భగవద్గీత. ఎవరయిన భగవంతుణ్ణి

చేరేందుకు ప్రయత్నిస్తూ ఉంటే, వారి ప్రయాణ మార్గంలో భగవద్గీత కాంతిని వెదజల్లుతుంది….

“తూర్పు దేశాలలో యోగశాస్త్రాన్ని బోధించిన వారిలో కృష్ణుడు అగ్రగణ్యుడయినట్లే, పటమట దేశాలలో భగవదనుసంధానమును బోధించిన వారిలో క్రీస్తు అగ్రగణ్యుడుగా భగవంతునిచే ఎన్నుకొనబడినాడు. భగవద్గీత IV:29,V:27–28 శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జుననకు ఒక సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక యోగశాస్త్రాన్ని బోధించాడు. కాలగతిలో భౌతిక యుగాల ప్రభావం వలన ఆ శాస్త్రము మరుగున పడిపోయింది. లుప్తమయిన ఈ యోగాన్ని (క్రియాయోగాన్ని) ఆధునిక మానవ జాతి శాంతి సామరస్యాల ఉద్ధరణ కొరకు, మహావతార బాబాజీగారు ఈ సనాతన యోగాన్ని పునరుద్ధరించి, భారతదేశంలోని యోగదా సత్సంగ సంస్థ/ఆత్మ సాక్షాత్కార సత్సంగములోని గురువులకు బోధించారు.”

Share this on

This site is registered on Toolset.com as a development site.