ఫణి తుఫానుపై స్వామి చిదానంద గిరి సందేశం

ప్రియతమ,

మే 2019

ఫణి తుఫాను సృష్టించిన విధ్వంసం వల్ల – పూరీ మరియు పరిసర ప్రాంతాలతో సహా – ఒరిస్సాలోని భాదితులందరి కోసం నా హృదయం పరితప్తమయ్యింది, అలాగే నాతోపాటు, గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి ఆశ్రమ సన్యాసులు మరియు సన్యాసినులు అందరూ కూడా భాదితులందరి కోసం గాఢంగా ప్రార్థిస్తున్నాము.

మీకు తెలుసు, పూరీతో గురుదేవులకుప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఎందుకంటే ఆయన అక్కడే ఎక్కువ సమయం వారి గురుదేవులైన స్వామి శ్రీ యుక్తేశ్వర్‌గారి నుండి శిక్షణ పొందుతూ గడిపారు. ఖచ్చితంగా బాధలో ఉన్న వారందరికీ మరియు ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణలో సహాయం చేసే వారికి తమ సర్వజ్న చైతన్యంలో ఈ ఇరువురు గొప్ప అవతారులు వారి ఆశీర్వాదాలను పంపుతుంటారు. యోగదా సత్సంగ సొసైటీ సహాయక చర్యల్లో చైతన్యవంతంగా పాల్గొంటున్నందుకు మరియు పూరీ మరియు చుట్టుపక్కల ప్రాంతంలోని ఆపదలో ఉన్న వారందరి కోసం వై‌.ఎస్‌.ఎస్. మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. సభ్యులు కూడా ప్రార్థిస్తున్నందుకు వారు ఎంతో సంతోషిస్తారు. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పందించే ఆత్మలు తమగురుంచి ఆలోచిస్తున్నారని మరియు భగవంతుని సహాయానికి ప్రార్థిస్తున్నారని, ఇటువంటి ఒక కష్టసమయంలోనున్న వారు తెలుసుకోవడంవల్ల వారి బాధలు ఉపశమిస్తాయి. ఇలా బాధపడుతున్నవారికి శక్తిని, కోలుకుంటున్న సమయంలో వారికి విశ్వాసం మరియు దైర్యం అనుగ్రహించమని;ఇంకా ముఖ్యంగా ఆయన సర్వ-స్వస్థత, ఓదార్పు, ప్రేమ అభయంలో వారిని అక్కున చేర్చుకోమని మేము భగవంతుణ్ణి అర్ధిస్తాము.

మన బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఈ మాయా ప్రపంచంలో జీవితంలో అన్ని తుఫానుల నుండి దైవమే మనకు సురక్షితమైన ఆశ్రయం అని గురూదేవులు మనకు ఉపదేశించారు. విశ్వాసం మరియు భక్తితో మనం ఆయన వైపు తిరిగినప్పుడు, మనం చీకటి నుండి వెలుతురు వైపుకి మరలుతున్నాము, అపుడు మన సంకల్పాన్ని ఉత్తేజపరచి, విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చిన ఆ విశ్వశక్తితో దాన్ని అనుసంధానిస్తాము. మనలో ప్రతి ఒక్కరినీ భగవంతుడు తన రూపంలో సృష్టించాడు అంతేకాక మన ఆత్మకు తన సృజనాత్మక శక్తితోపాటు ఆయన సమస్త లక్షణాలను ప్రసాదించాడు. మనలో ప్రతి ఒక్కరూ విజయవంతమైన ఆధ్యాత్మిక విజేతగా ఉండగలడనే సత్యాన్ని మనం గుర్తుంచుకుంటే – మాయ మన మార్గంలో ఎలాంటి అడ్డంకులు పెట్టినా, ఏదీ మనల్ని భయపెట్టదు. మనం దేవుణ్ణి ద్రుఢమైన ఆసరాగా,ఆయన యొక్క దివ్య వరాలను ఉపయోగించినప్పుడు, ఆ అనంతుని శక్తి వల్ల మన ప్రయత్నాలు బలోపేతమవుతాయి. అలాగే వారి బాధల పట్ల సానుభూతితో ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడు, మన రోజువారీ స్వీయ సంరక్షణ పరిమిత పరిధిలను దాటి మహాత్ములు జీవించే విశ్వజనీయమైన ప్రేమ మరియు కరుణ యొక్క విశాల చైతన్యంలోకి ఉద్దరింపబడుతుంది. అలా చేయడం ద్వారా దేవుని ప్రేమ మనలో ప్రవహించేలా మన స్వంత హృదయాలను విశాలపరచి, ప్రపంచంలో గొప్ప కరుణ మరియు సోదర భావానికి పునాది వేస్తుంది.

అందరి సమైక్య ప్రార్థనలు మరియు నిరంతర సేవా కార్యక్రమాల వల్ల ఉత్ప్రేరేపించబడిన ఒక నిత్య దివ్య ఉనికి యొక్క ద్రుఢమైన శక్తి తమ జీవితాలను పునర్నిర్మించుకునే వారందరికీ రాబోయే రోజుల్లో లేదా మాసాల్లో ప్రోత్సాహం మరియు సహాయంగా ఉండుగాక.

మీ అందరినీ దేవుడు మరియు గురుదేవులు ఆశీర్వదించుగాక,
స్వామి చిదానంద గిరి

Share this on

This site is registered on Toolset.com as a development site.