శ్రీ పరమహంస యోగానందుల 125వ జన్మదినము – స్వామి చిదానంద గిరి నుండి ఒక సందేశం

5 జనవరి, 2018

జన్మోత్సవం 2018
స్వామి చిదానంద గిరి నుండి సందేశం,
అధ్యక్షుడు

ప్రియుతములారా,

మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందుల జయంతి సందర్భంగా ఈ పవిత్రమైన 125వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు. రెండు నెలల క్రితం నేను గురుదేవుల మాతృభూమిని సందర్శించినపుడు మీ అందరినీ కలిసినప్పటి ఆ ఆనందం, స్ఫూర్తి మరియు ఆశీర్వాదాలతో నా హృదయం ఇప్పటికీ నిండుకొని ఉంది. నిర్మలమైన భక్తి మరియు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రతిబింబించే మీ ప్రకాశవంతమైన ముఖవిలాసములు నా స్మృతిలో శాశ్వతంగా ముద్రించబడ్డాయి. మీ కోరిక అనే అయస్కాంతంచే ఆకర్షింపబడిన, మన పూజ్య గురుదేవుల ప్రేమ మనందరినీ ఆవరించుకొని, మన హృదయాలను ఏకం చేసింది. అంతేకాదు మనం ఎవరి నుండి వచ్చామో ఆ దైవానికి మనల్ని మరింత దగ్గర చేసింది – ఈ మాయా ప్రపంచంలో అనేక జన్మలుగా మనం కోరుకున్న ఆ పరిపూర్ణ ప్రేమ అనే కోరికను తీర్చగలవాడు ఆ భగవంతుడు ఒక్కడే.

మన ప్రియతమ గురుదేవులను మీ మార్గదర్శిగా మరియు శాశ్వత మిత్రుడుగా మీచెంతకు పంపించడం ద్వారా భగవంతుడు తనను తెలుసుకోవాలనే మీ కోరిక యొక్క చిత్తశుద్ధికి ప్రతిస్పందించాడు. మనం గురుదేవుల సహాయంపై పూర్తి విశ్వాసంతో, ఆయన అందించిన సాధనను ఆచరిస్తే, గురుదేవులు ఖచ్చితంగా ఆ పరమాత్మతో సమైక్యానికి మనకు దారి చూపుతారు. ప్రపంచమంతా క్రియాయోగ అనే పవిత్ర శాస్త్ర౦ వ్యాప్తి చేయడానికి నియమి౦చబడిన మన గురుదేవులు ద్వారా, మనకు అత్య౦త అమూల్యమైన నిధిని – ఆ పరమాత్ముని అనంత చైతన్య స్పర్శతో, ఆత్మ యొక్క నిశ్శబ్ద అభయారణ్యంలో మానవుని ఊహకు అతీతమైన ఆన౦దాన్ని అనుభవి౦చే సాధనాన్ని అనుగ్రహి౦చారు. ఆ దివ్య కానుక యొక్క గొప్పతనము – ఇంకా గురుదేవుల యొక్క బేషరతు ప్రేమ కానుకను, తిరిగి సాధించడానికి ఇది ఒక అవకాశం కానివ్వండి, ఇది మీ వెంట ఉంటుంది. అంతేకాదు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఆ ప్రేమ గురించిన అవగాహనను మీ హృదయంలో నిలుపుకోండి, మరియు ఆ ప్రేమలో భగవంతుడు మరియు గురుదేవులు మీ మానవ స్వభావంలోని లోపాలకు అతీతంగా మీ ఆత్మ యొక్క అందాన్ని మరియు సామర్థ్యాన్ని చూస్తారని తెలుసుకోండి. మీలోని ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు కూడా చూడటం నేర్చుకుంటే, మీరు దేన్నయినా అధిగమి౦చవచ్చనే ధైర్యాన్ని స౦పాది౦చుకు౦టారు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ప్రేమను గుర్తుంచుకోండి, మరియు సాంకేతిక ప్రక్రియల ద్వారా ప్రవహిస్తున్న దాని శక్తి మీ చైతన్యమును పరివర్తిస్తున్నట్లు అనుభూతి చెందండి – మీ వాస్తవిక దివ్యాత్మ యొక్క పవిత్రత మరియు ప్రకాశాన్ని దాచిపెట్టిన మాయ యొక్క ముసుగును అది తొలగిస్తుంది. మీరు అలా చేసినప్పుడు, మరియు గురుదేవుల సంకల్పంతో మీ సంకల్పాన్ని అనుసంధానించినప్పుడు, మీ అంతిమ మోక్షం సునిశ్చితమౌతుంది.

భారతదేశంలో గురుదేవుల కృతి యొక్క శతాబ్ది వార్షికోత్సవాన్ని స్మృతిచేసుకున్న గత సంవత్సరం, ఆయన ఉపదేశాల శక్తి జ్ఞాపికగా, ఇంకా భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అవి వ్యాప్తి చెందుతున్న వేగానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ వార్షికోత్సవం వ్యక్తిగతంగా లేదా మానసికంగానూ పాల్గొన్న వారి వ్యక్తిగత ప్రయత్నాలకు కూడా శక్తినిచ్చింది. ఈ జన్మోత్సవ వేడుక నుండి, మరియు గత సంవత్సరంలో జరిగిన అన్ని చక్కని కార్యక్రమాల నుండి, మీరు అనుభవించిన ఆత్మానందం, గురుదేవుల బేషరతు ప్రేమ పట్ల పెంపొందిన విశ్వాసం నుండి, మీ సాధనలో పట్టుదలతో ఉండాలనే దృఢ సంకల్పాన్ని మీతో తీసుకువెళ్ళండి. గురుదేవులు చూపిన మార్గాన్ని అనుసరి౦చడమే ఆయనకు మీ కృతజ్ఞతాపూర్వక బహుమాన౦గా ఉ౦డనివ్వ౦డి, ఆయన ఒసగే అపరిమితమైన ఆధ్యాత్మిక అనుగ్రహంను మీరు వికసించిన మనస్సుతో, హృదయపూర్వక౦గా పొ౦దవచ్చు. జై గురూ!

భగవంతుని మరియు గురుదేవుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి,

స్వామి చిదానంద గిరి

Share this on