
"రూప, గుణాల్లో, తిరుగులేని ఆకర్షణలో, నడతలో, దివ్యప్రేమకు ప్రతిరూపంగా, అందరికీ ఆనందాన్ని పంచే, చిన్ని కృష్ణుడు జనులందరికీ ప్రీతిపాత్రుడు...."
— శ్రీ పరమహంస యోగానంద, "గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత" నుండి
ప్రియుతములారా,
భగవాన్ శ్రీకృష్ణుని జయంతిని ఆనందంగా జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు, దివ్యమైన ఈ ఉత్కృష్ట అవతారానికి మన ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞతలు అందించడానికి అన్ని దిక్కుల నుండి లెక్కలేనన్ని ఆత్మలు ఏకమవుతున్నాయి.
ఈ జన్మాష్టమి దినాన, శ్రీ కృష్ణుని విశిష్ట కృప, ఆశీర్వాదాలు మరియు దివ్య జ్ఞాన మార్గనిర్దేశనంతో చేయు యుక్తమైన చర్యల సమతుల్య జీవితానికి ఆయన ఉదాహరణను ప్రతిబింబించేలా మనల్ని ప్రేరేపిస్తాయి. భగవద్గీతలో పొందుపరిచబడిన ఆయన విశ్వజనీన బోధనలను గ్రహించడం ద్వారా, మనం ప్రయాణించు కాలంలో సూటిగా, లోతుగా ప్రస్తావించిన ఆత్మ యొక్క అమరత్వ లక్షణాలైన — మనఃస్థైర్యము, విశ్వాసం, నిర్భయత్వంను – మనలో మేల్కొలుపుదాం — మనకొచ్చే కష్టాలు మనల్ని అణచివేయడానికి ఉద్దేశించినవి కావని, శౌర్యవంతము మరియు అజేయమగు మన దివ్య స్వభావాన్ని వెలికి తీయడానికి ఉద్దేశించినవని గుర్తుంచుకుందాం. భగవంతుణ్ణి, ఆయన అవతారాలను ప్రతిరోజూ ధ్యానం చేయడం ద్వారా తీవ్రమైన కష్టాల మధ్య కూడా ధైర్యం, సమదృష్టి మరియు సృజనాత్మక అంతర్దృష్టి వంటి ఎడతెగని వనరులను పొందుతూ అన్ని విధాలుగా అధిగమించుటలో వారి సహాయంపై విశ్వాసం ఉంచుదాం.
మన ప్రతి ఒక్కరిలోని అర్జున-భక్తుడికి భగవాన్ కృష్ణ చెప్పే సందేశం ఇదే. మనస్సు, బుద్ధి, ఆత్మలను పరమాత్మతో ఏకం చేయడం ద్వారా, గీతలో కీర్తించబడిన క్రియాయోగం యొక్క పవిత్ర శాస్త్రాన్ని వినియోగించడం ద్వారా, మన అంతరంగిక కురుక్షేత్రపు యుద్ధాలలో శాంతియుతంగా మరియు తెలివిగా విజయం సాధించడానికి మనం మరింత మెరుగ్గా సన్నద్ధులమవుతాము. ప్రేమ-మార్గనిర్దేశనం మరియు ప్రశాంతమైన యుక్తమగు చర్య ద్వారా, మన కుటుంబ వాతావరణంలో మరియు మన సమాజంలో శాంతిని సృష్టిస్తూ, భగవంతుని బిడ్డలుగా ప్రతి ఆత్మ పట్ల గౌరవంతో సామరస్యంతో ప్రతిస్పందిస్తాం.
శ్రీకృష్ణుడు మరియు సమస్త మహానీయులందరిలాగే మన సహజసిద్ధమైన ఆత్మ గుణాలను వ్యక్తపరచడం ద్వారా, ఆయన వెలుగును, ప్రేమను ప్రసరింపజేస్తూ, భగవంతుని చైతన్యంలో జీవించి, సేవించే శక్తి ఈ పథంలోకి వచ్చిన మనందరికీ లభిస్తుంది. సర్వ మానవాళికి “దివ్య ప్రేమ మూర్తిగా, అందరికీ ఆనందాన్ని ఇచ్చే” ప్రియమైన కృష్ణుడి అడుగుజాడల్లో పరమాత్మతో తాదాత్మ్యమై కలిసి వినయపూర్వకంగా నడుద్దాం. దైవికంగా ఉండాలనే మన సమ్మతి ద్వారా, నిదానంగా మరియు నిస్సందేహముగా మెరుగైన ప్రపంచాన్ని అభివృద్ధి చేసే శక్తులను మనం పెంచుతాం.
భగవాన్ శ్రీ కృష్ణుని ఉపదేశం మరియు ఆశీర్వాదాలు మీకు నిరంతర మార్గదర్శకత్వం చేయుగాక,
స్వామి చిదానంద గిరి