స్వామి చిదానంద గిరి గారి నుండి నూతన సంవత్సర సందేశం

31 డిసెంబర్, 2018

నూతన సంవత్సరం 2019

“నూతన సంవత్సర ఆరంభంలో నా పరిమితులనే మూసిన ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. వాటి ద్వారా, ఉదాత్తమైన నా జీవన స్వప్నాలు ఫలించే విశాల క్షేత్రాల్లోకి నేను వెడతాను.”

మనము కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణములో, గురుదేవ పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మేము మీకు మరియు మన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ మరియు స్నేహితులందరికీ ప్రేమపూర్వక భావనలు పంపుతున్నాము, క్రిస్మస్ సందర్భంగా మరియు సంవత్సరం పొడవునా మీ దివ్య స్నేహాన్ని వ్యక్తపరిచినందుకు హృదయపూర్వక అభినందనలు. మా నూతన సంవత్సర ధ్యానాలలో, రాబోయే సంవత్సరంలో మీ హృదయానికి దగ్గరగా ఉన్న యోగ్యమైన లక్ష్యాలను నెరవేర్చడానికి భగవంతుడు మీకు సహాయం చేయమని కోరుతూ మేము ప్రత్యేక ప్రార్థనలను చేస్తున్నాము.

పైన ఇవ్వబడిన మన గురువు యొక్క అద్భుతమైన దివ్యసంకల్పాన్ని మీ అంతర్గతంలోకి తీసుకొని వెళ్ళండి మరియు ఆయన మాటల ద్వారా ప్రవహించే దివ్య శక్తిని మీరు ఏకాగ్రతతో గ్రహించడం ద్వారా మీ కొత్త ఆరంభానికి సహాయపడుతుంది. ఇది మీ సంకల్పానికి శక్తినిచ్చి, భగవంతుని సహాయంతో మీరు అన్ని అడ్డంకులను అధిగమించగలమన్న మీ ఆత్మ యొక్క విశ్వాసాన్ని ముందుకు తీసుకొని వచ్చేలా చేస్తుంది. ఈ మధ్య జరిగిన క్రిస్మస్ ధ్యానాలలో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తిగా మారడానికి మీలో ఉన్న అపరిమితమైన సామర్థ్యాన్ని మీరు కొత్తగా అనుభవించారని నేను ఆశిస్తున్నాను. ఆ స్ఫూర్తితో పని చేయడానికి — మీరు పెంపొందించుకున్న కలలు మరియు ఆధ్యాత్మిక సామర్థ్యాలను సాకార వాస్తవాలుగా మారాలనే మీ సంకల్పాన్ని కొత్త శక్తితో నింపడానికి ఇది ఒక శుభ సమయం.

ధ్యానం లేదా గాఢమైన ప్రార్థనలో చేసిన నూతన సంవత్సర దృఢనిశ్చయాలలో, ఖచ్చితమైన శక్తి ఉంది, ఎందుకంటే అవి అధిచేతన మనస్సు నుండి వచ్చే భగవత్ సహాయంతో ఉత్తేజపరచబడతాయి. పరమహంసగారు — మీరు ప్రత్యేకంగా పెంపొందించుకోవాలనుకునే ఒకటి లేదా కొన్ని విలువైన లక్ష్యాలు లేదా ఆత్మ లక్షణాలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు — ప్రశాంతత మరియు సమచిత్తము, లేదా ఇతరుల పట్ల దయ మరియు అవగాహన వంటివి. రాబోయే నెలల్లో మీ ధ్యాన సమయంలో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పద్ధతుల అభ్యాసం ద్వారా ఉత్పన్నమైన ప్రశాంతమైన గ్రహణశక్తిలో మీ అంతర్ దృష్టి మరియు భావన ముందు ఆ సాధనను నిలపండి; మరియు మీరు సాధించాలనుకుంటున్నది మీ ఉనికిలో భాగమైనంతవరకూ, సరళమైన, సూటైన దివ్యసంకల్పాన్ని పునరావృతం చేయండి. మీరు ఏమి కావాలనుకుంటున్నారో చిన్న విధాలలో కూడా మీరు వ్యక్తం చేసినప్పుడల్లా ఆ లక్షణము మరింత స్పష్టంగా సాకారం చేసుకుంటుంది. మరియు మీరు ప్రతిబంధకమైన ఆలోచనలను ఎంత ఎక్కువగా వదిలేస్తూ, స్వీయ అనుమానలను ప్రశాంత విశ్వాసంతో వాటిని భర్తీ చేస్తే, మీరు అంత తొందరగా పురోగతి సాధించగలరు. మీ అలవాట్లు, మీ సహచరులు, మరియు బాహ్య వాతావరణం లేదా నిజమైన మీరు అనగా మీ ఆత్మ, ఏది మీ జీవిత గమనాన్ని నిర్ణయిస్తుందో తెలుసుకొని, ఆ ఎరుకతో జీవించడం సాధన చేయండి. ప్రతి రోజు, ప్రతి క్షణం, మీరు ఏమి ఆలోచిస్తారో మరియు ఏమి చేయాలో నిర్ణయించే శక్తి మీకు ఉందని గుర్తుంచుకోండి. మీ ఆత్మ యొక్క వివక్ష మరియు స్వేచ్ఛా సంకల్ప శక్తి ద్వారా మీ ఆలోచనలు మరియు చర్యలను ఎంచుకోండి; అప్పుడు మీ స్వేచ్ఛా ప్రయాణానికి ఏదీ అడ్డురాదు.

ఈ కొత్త సంవత్సరంలో చేయవలసిన ఉత్తమమైన తీర్మానం ఏమిటంటే, మీ హృదయాన్ని మరియు మనస్సును దైవం మీద మరింత స్థిరంగా లీనమయ్యేలా చేయడం. దేవుని సహాయంతో మీరు ఏదైనా చేయగలరు. ఆ అంతర్గత దైవసంసర్గ కాంతిలో, అవాంఛిత అలవాటు ప్రక్రియలు కరిగిపోతాయి; మరియు దేవుని ప్రేమ యొక్క పరివర్తన స్పర్శ ద్వారా, మీపై మాయ ప్రభావం చివరకు విచ్ఛిన్నమవుతుంది. మీరు మీ ఆలోచనలకు, చర్యలకు మరియు మీ విధికి పాలకులు అవుతారు. గురూజీ మనతో ఇలా అన్నారు, “స్వయాన్ని జయించడమంటే నిజంగా విజయం సాధించడమే — మీ పరిమితమైన చైతన్యాన్ని జయించి మీ ఆధ్యాత్మిక శక్తులను అపరిమితఅంగా విస్తరించడం. మీరు మీ మార్గంలో వెళ్ళాలనుకున్నంత దూరం వెళ్ళవచ్చు, అన్ని పరిమితులను దాటి, అత్యున్నతమైన విజయవంతమైన అస్తిత్వమును గడపవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో మీ ప్రయత్నాలు మిమ్మల్ని ఆ అత్యున్నత విజయానికి మరింత చేరువ చేయుగాక.

మీకు మరియు మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు,
స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి