కోవిడ్-19 ఉపశమన కార్యాచరణ కోసం విజ్ఞప్తి

9 ఏప్రిల్, 2020

కోవిడ్-19 సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా మానవజాతి సవాలు చేయబడుతోంది. మన రోజువారీ ప్రార్థనలను ప్రపంచానికి పంపించడానికి మరియు గురుదేవుల మార్గదర్శకత్వాన్ని అనుసరించాల్సిన సమయం ఇది: “జీవితం ప్రధానంగా సేవ అయి ఉండాలి.” ఈ స్ఫూర్తితో మనకు సేవ చేసే అవకాశం ఉంది. పేదలను, ప్రస్తుత సంక్షోభం వల్ల నేరుగా ప్రభావితమైన వారిని, కష్టాల్లో ఉన్నవారిని మరియు ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేనివారి మనుగడ కోసం — ప్రధానంగా వలస కార్మికులు, రోజువారీ కూలీ కార్మికులు, దిక్కు లేనివారు, మరియు గ్రామీణ ప్రజల కొరకు చేసే మా ప్రయత్నాలలో పాలుపంచుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రకాల అవసరాలున్నాయి: ప్రాణాలను కాపాడేందుకు సంరక్షణ మరియు మందులను అందించడం, మరియు ఈ పరిమితుల కారణంగా ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసుకోవడం.

ఈ మహమ్మారిని అరికట్టడంలో తన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని భారత ప్రభుత్వం అన్ని స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఆ పిలుపుకు సమాధానంగా జరిగే పోరాటంలో గెలిచేందుకు జరిగిన దేశవ్యాప్త ప్రయత్నాల్లో వై.ఎస్.ఎస్. పాల్గొంది. పూర్తిగా స్వచ్ఛంద విరాళాల ద్వారా నడుపబడే సంస్థగా, గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా, ఒక విశాలమైన ఆత్మగా మానవాళికి సేవ చేయాలనే గురుదేవుల ఆదర్శానికి మా భక్తులు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తారని మేము విశ్వసిస్తున్నాము.

ఈ సమయంలో అత్యంత బలహీనంగా ఉన్న పేదలు మరియు విడిచిపెట్టబడిన వారు: ఆరోగ్య సంరక్షణను పొందలేని వారు లేదా లాక్‌డౌన్ కారణంగా రోజువారీ వేతనాలు పొందలేని వారిని చేరుకోవడమే మన లక్ష్యం. వృద్ధులు, అనాథలు, రోజువారీ కూలీ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరియు కుష్టు వ్యాధి ప్రాంతాలకు చెందిన రోగులను గుర్తించి, వారికి సహాయం చేయడానికి మన ఆశ్రమాలు మరియు మన ప్రధాన కేంద్రాలలో ఉన్న కొన్ని స్థానిక పరిపాలన సంస్థలతో మేము సంప్రదించి ఉన్నాము. మేము బియ్యం, పప్పు, నూనె, మొదలైన సరుకులను సేకరించి, ప్రభుత్వ-అధీకృత స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఈ ప్రజలకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అత్యవసర సామగ్రిలో మందులు, సబ్బులు, శానిటైజర్‌లు, మరియు మాస్క్‌లు, గ్లోవ్‌లు, మొదలైన రక్షణ సామాగ్రి వంటి ఇతర ముఖ్యమైన వస్తువులను కూడా మేము చేర్చాలనుకుంటున్నాము.

ఈ ఉదాత్తమైన ప్రయత్నానికి సహకరించడానికి ఆసక్తి ఉన్నవారు దయచేసి ఆన్‌లైన్‌లో విరాళం ఇవ్వవచ్చుమేము ప్రస్తుతం ఆన్‌లైన్ విరాళాలను మాత్రమే స్వీకరిస్తున్నామని దయచేసి గమనించండి.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని నిబంధనల ప్రకారం స్వచ్ఛంద సంస్థగా గుర్తించబడిందని దయచేసి గమనించండి. సొసైటీకి ఇచ్చిన విరాళాలు (PAN: AAATY0283H) పైన పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 80-G ప్రకారం ఆదాయపు పన్ను మినహాయించబడుతుంది.

మీకు విరాళం విధానానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, లేదా ఆన్‌లైన్‌లో విరాళం ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటే లేదా మన ఉపశమన కార్యకలాపానికి మరేదైనా మద్దతు ఇవ్వాలనే ఆసక్తి ఉంటే, దయచేసి helpdesk@yssi.org లేదా ఫోన్ ద్వారా రాంచీ సహాయ కేంద్రాన్ని సంప్రదించండి: +91 (651) 6655 555 (సోమవారం-శనివారం: ఉదయం 9 నుండి సాయంత్రం 4.00 వరకు).

ఈ సమయంలో వై.ఎస్.ఎస్. భక్తులందరూ సహకరించగల మరొక మార్గం ఏమిటంటే, ప్రార్థనలు కోరిన వారందరికీ మరియు మానవాళి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రతిరోజూ ప్రార్థన చేయడంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిలో చేరడం. ఈ వెబ్‌పేజీని సందర్శించడం ద్వారా మరిన్ని వివరాలను పొందవచ్చు.

మన ప్రియమైన గురుదేవుల మాటల నుండి మనం ప్రేరణ పొందెదము గాక: “ఇతరులకు ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు భౌతికంగా సేవ చేయడం ద్వారా, మీరు కోరకుండానే మీ స్వంత అవసరాలు నెరవేరుతున్నాయని మీరు కనుగొంటారు.”

వైద్య నిపుణులు మరియు ప్రభుత్వం అందించిన అన్ని మార్గదర్శకాలను శ్రద్ధగా పాటించడం ద్వారా మీరు సురక్షితంగా ఉండాలని మరియు ఇతరుల భద్రతను కూడా నిర్ధారించాలని మేము ప్రార్థిస్తున్నాము. అలా చేయడం ద్వారా, మరియు తద్ద్వారా అందరి పట్ల శ్రద్ధ వహించడం ద్వారా, మీరు భగవంతుని మరియు గొప్ప గురువులకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు.

రక్షణనిచ్చే భగవంతుని ప్రేమ యొక్క కాంతి ఎల్లప్పుడూ మీ చుట్టూ మరియు మీ ప్రియమైన వారి చుట్టూ వ్యాపించుగాక.

ఇతరులతో షేర్ చేయండి