అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద జూన్ 17న భారతదేశం అంతటా విడుదలైంది

14 జూన్, 2016

క్రియాయోగా ధ్యానంపై తన సమగ్ర బోధనలతో లక్షలాది మంది జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసి మరియు పశ్చిమ దేశాలలో యోగ పితామహుడిగా విస్తృతంగా గుర్తింపు పొందిన పరమహంస యోగానందగారి గురించిన ఘనమైన డాక్యుమెంటరీ, అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద, చిత్రం జూన్ 17న ఇండియా థియేట్రికల్ ప్రీమియర్ వార్తను మీతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము.

అవేక్ సినిమా గురించి:

అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద, పరమహంస యోగానందగారి గురించిన అసాధారణ జీవిత చరిత్ర. ఈయన 1920లలో యోగా మరియు ధ్యానాన్ని పశ్చిమ దేశాలకు తీసుకువచ్చారు. అంతేగాక ఆధ్యాత్మిక క్లాసిక్‌ అయిన ఒక యోగి ఆత్మకథను కూడా రచించారు – ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రతులు అమ్మబడింది మరియు ఈనాటి అన్వేషకులు, తత్వవేత్తలు మరియు యోగా ఔత్సాహికుల కోసం ఇది ప్రయాణంలో ఒక చేతి పుస్తకం. (స్పష్టంగా, స్టీవ్ జాబ్స్ తన ఐప్యాడ్‌లో కలిగి ఉన్న ఏకైక పుస్తకం ఇది.)

పావోలా డి ఫ్లోరియో, లిసా లీమాన్ మరియు పీటర్ రాడర్ (కౌంటర్ పాయింట్ ఫిల్మ్స్, లాస్ ఏంజిలిస్, కాలిఫోర్నియా)ల అవార్డు-విజేత చిత్రనిర్మాత బృందం ద్వారా మూడు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల భాగస్వామ్యంతో రూపొందించబడింది, ఈ డాక్యుమెంటరీ తూర్పు మరియు పడమర దేశాలలో ఆధునిక మరియు పురాతన యోగా ప్రపంచాన్ని పరిశీలిస్తుంది. మరియు నేడు లక్షలాది మంది తమ ధ్యాసను ఎందుకు అంతర్లీనం గావించారో అన్వేషిస్తుంది, స్వీయ-సాక్షాత్కారం కోసం భౌతిక ప్రపంచం యొక్క పరిమితులను ప్రతిఘటిస్తుంది.

“పునః-సృష్టి మరియు మనోహరమైన నిజమైన ఫుటేజీల అతుకుల మిక్స్‌ని ఉపయోగించి, ఈ చాలా సమానమైన డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఒక సాధువు జీవితంలో అన్ని వైపులకు తీసుకువెళుతుంది, గర్భంలో ఆయన మొదటి భావనల నుండి 1952లో లాస్ ఏంజిలిస్ లోని బిల్ట్‌మోర్ హోటల్‌లో పెద్ద సంఖ్యలోని జన సమూహమునకు ఒక పద్యం చదివిన ఆ క్షణం వరకు, ఆయన తన శరీరాన్ని తేలికగా విడిచిపెట్టారు….ఆ సంఘటనల మధ్య ఆయన పాశ్చాత్య ప్రపంచాన్ని మార్చారు.” – మౌయి ఫిల్మ్ ఫెస్టివల్ వెబ్‌సైట్ నుండి

మరింత సమాచారం కోసం:  AWAKE theYogananda Movie.com

అవార్డులు

“ఆధునిక ఆత్మను అంతర్ముఖం చేసేందుకు… సరిపోతుంది.”— ది న్యూయార్క్ టైమ్స్

“ఉత్కoఠoగా, స్పూర్తిదాయకంగా… ఇతిహాసం… చిత్ర నిర్మాతలు మనల్ని భావావేశపూరితంగా కట్టిపడేస్తారు.” — యోగా జర్నల్

“ప్రారంభం నుండి ముగింపు వరకు నిమగ్నము చేస్తూ సమాచారపూరితంగా ఉన్నది” — ది విలేజ్ వాయిస్

“అవేక్ అనేది ఒక సంపూర్ణ నిధి మరియు దానిని వీక్షించడమే కాదు, అనుభవించాలి.”— ది మూవీ నెట్‌వర్క్

“స్వప్నమయం, మనోహరం…
దర్శకులు పావోలా డి ఫ్లోరియో మరియు లిసా లీమాన్ వాతావరణద్వనులలో ప్రవీణులు”

“ఇతిహాసం మరియు కాలాతీతం”

“జ్ఞానోదయం! మనోహరం! అగాధం! ఇది మీ హృదయం, మనస్సు మరియు ఆత్మను వృద్ధిపొందిస్తుంది”

“… చాలా ప్రత్యేకమైన వ్యక్తి గురించి మంత్రముగ్ధులను చేసే చిత్రం”

అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద (హిందీ ఉపశీర్షికలు)

జూన్ 13 నుంచి టిక్కెట్లు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు

Share this on