స్మృతిమందిరం సమర్పణ యొక్క ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుక

16 డిసెంబర్, 2020

స్మృతి మందిరం సమర్పణ యొక్క సిల్వర్ జూబిలీ వేడుకలు
Play Video

స్మృతిమందిరం సమర్పణ వీడియో

రాంచీలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమంలోని శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి స్మృతి మందిరం (స్మారక మందిరం) సమర్పణ 25వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ సంవత్సరం నిలుస్తుంది. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం 1920లో ఆశ్రమ ఆవరణలో గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి అమెరికా వెళ్ళాలనే అంతర్దర్శనం కలిగిన పవిత్ర స్థలంలో ఈ మందిరం వెలసింది. పరమహంసగారు తన ఒక యోగి ఆత్మకథలో ఈ దర్శనాన్ని వర్ణిస్తూ ఇలా వివరించారు:

“అమెరికా! ఖచ్చితంగా వీళ్ళు అమెరికన్లే!” నా అంతర్దృష్టి ముందు పాశ్చాత్య ముఖాలతో నిండిన సువిశాల దృశ్యం పయనిస్తుండగా నాకు కలిగిన భావం ఇది.

ధ్యానంలో లీనమై, నేను రాంచీ పాఠశాల పాతసామాను గదిలో కొన్ని ధూళికప్పిన పెట్టెల వెనుక కూర్చున్నాను. కుర్రవాళ్ళతో తీరికలేని ఆ ఏళ్ళలో ఒక ఏకాంత ప్రదేశం దొరకడం కష్టంగా ఉండేది!

అంతర్దర్శనం కొనసాగింది; అపార జనసమూహం ఒకటి, నా వైపు నిశితంగా వీక్షిస్తూ, తారాగణంలా చైతన్యం రంగస్థల వేదిక అంతటా సాగిపోయింది.

పరమహంసగారి అమెరికా ప్రయాణానికి, ఆ తరువాత భారతదేశ ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ స్థాపించడానికి దారితీసే ఒక శకాన్ని సృష్టించిన క్షణం అది. ఈ దర్శనం మరియు తదనంతర ఘటనల వివరాలు ఒక యోగి ఆత్మకథలో వివరించబడ్డాయి. స్మృతి మందిరం సమర్పణ కార్యక్రమంలో వై.ఎస్.ఎస్./ఎస్.అర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాత శ్రీ శ్రీ దయామాత మాట్లాడుతూ, “గురుదేవులను సత్య దూతగా పంపినందుకు మన ప్రియతమ భగవంతుడికి కృతజ్ఞతలు.” భగవంతుని పట్ల గురుదేవుల గాఢమైన ప్రేమను మరియు ఆయన నిస్వార్థ జీవనాన్ని స్మరించుకొంటూ, ఇతరుల ప్రయోజనం కోసం అశేషముగా జీవించడం అనే ఆలోచనలోనే మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద స్మృతి మందిరాన్ని అంకితం చేస్తున్నాము.”

వందేళ్ళ క్రితం పరమహంసగారు అంతర్దర్శనం పొందిన చోటు ఒక చిన్న సామాను గది. అదే క్షేత్రంలో నిర్మించిన ఒక ధ్యాన మందిరం, ఎంతో కాలం దైనందిన ధ్యానాలకు పావన ప్రదేశంగా వినియోగించబడింది. అనేక సంవత్సరాల అంకిత ప్రణాళికతో, ఈ పాలరాతి నిర్మాణం రూపొందించబడింది.

దీపావళి సందర్భంగా వందలకొద్దీ కొవ్వొత్తులతో వెలిగి పోతున్న స్మృతి మందిరం

లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా, ఈ మందిరానికి అద్భుతమైన నిర్మాణ శైలి కూడా ఉంది. ఆశ్రమం మధ్యలో ఒక ఆభరణంలా వెలిసిన, ఈ నిర్మల శ్వేత కళాఖండం దాని సహజ నిరాడంబరతను – నీలివర్ణ ఆకాశానికి ధీటుగా పాలరాయి గోపురం, ఆకుపచ్చని పచ్చిక బయళ్లతో బహు-వర్ణ పుష్పాల అల్లికలతో పరివేష్టించబడిన ఈ మందిరాన్ని చూసి ఎవరైనా పారవశ్యం చెందుతారు. దీపావళి సందర్భంగా వందలాది కొవ్వొత్తులతో మందిరం ప్రకాశించినప్పుడు ఒక ప్రత్యేకమైన వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రతి సందర్శకుడు ఈ మందిరం యొక్క సౌందర్య వైభవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మరియు స్పష్టమైన శాంతి అనుభూతిని పొందుతాడు; ఆకట్టుకునే మందిర సౌందర్యాన్ని చూడకుండా ఎవరూ నిష్క్రమించరు. పూజా వేదిక మీద ఉన్న గురుదేవుల అద్భుతమైన నిలువెత్తు చిత్రం, సంపూర్ణమైన జీవత్వంతోనూ, ప్రేమతోనూ నిండి, ప్రవేశ ద్వారం పైన “ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు” – లిఖించబడిన పదాలకు సజీవ సాక్ష్యంగా మందిర ప్రవేశం చేసే భక్తులపై నిరంతరాయంగా వర్షిస్తుంది – ఈ సందేశం ప్రేమావతారులు (ప్రేమ యొక్క అవతారం) ద్వారా వర్ణించబడిన ఆయన దివ్య జీవితానికి జ్ఞాపికగా నిలుస్తాయి, తద్ద్వారా మనం కూడా ఈ ప్రేమను మన జీవితాలలో వ్యక్తపరచవచ్చు.

వారం రోజులపాటు జరిగిన స్మృతి మందిరం యొక్క సమర్పణ సంగమ కార్యక్రమంలో మార్చి 22, 1955న పరమహంస యోగానందగారి ప్రత్యక్ష శిష్యులు, అత్యంత గౌరవనీయులైన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసి స్వామి ఆనందమోయ్ గిరి ద్వారా ఈ దిగ్గజ, పూర్తి-చలువరాయి, అష్టభుజి ఆలయం అంకితం చేయబడింది. ఇది 1995లో మార్చి 20 నుండి 26 వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 1,200 మంది భక్తులు హాజరయ్యారు.

స్మృతి మందిరంలో స్వామి ఆనందమోయ్, రాంచీ
పరమహంస యోగానందగారి స్మృతి మందిరం సమర్పణ సందర్భంగా హారతి ఇస్తున్న స్వామి ఆనందమోయ్.
స్మృతి మందిర సమర్పణలో భక్తులు, రాంచీ
సమర్పణ కార్యక్రమం తర్వాత మందిరంలోకి ప్రవేశించేందుకు బయట బారులు తీరిన భక్తులు

సమర్పణ రోజున శ్రీ దయామాతగారు ఇలా అన్నారు, “మన ప్రియతమ గురుదేవులను, మరియు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ఆయనకు కలిగిన అంతర్దర్శనం ద్వారా ప్రారంభమైన ప్రపంచవ్యాప్త లక్ష్యాన్ని గౌరవిస్తూ రాంచీలో ఒక సముచిత స్మారకాన్ని నిర్మించాలన్నదే మా ఆకాంక్ష. ఆ కోరిక ఈ రోజు నెరవేరింది. ఈ రోజు మనం ఆ మహోన్నత గురుదేవులు, భగవంతుని మరియు మానవజాతి యొక్క గొప్ప ప్రేమికుడు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారిని గౌరవించుకుంటున్నాము….ఈ అందమైన పాలరాతి మందిరం గురుదేవులు ఈ భూమిపై నివసించి, నడయాడారన్నదానికి ఒక ప్రత్యక్ష జ్ఞాపికగా వినియోగపడుతుంది, తద్ద్వారా మానవజాతి జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవచ్చు; మరియు మనం కూడా భగవంతుణ్ణి ప్రేమించగలము, భగవంతుడితో అనుసంధానం పొందడానికి, ఆయన నిత్య నవీన ప్రేమ, ఆనందం గురించిన చేతనతో జీవించగలము. ఒంటరిగా ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చుని, భగవంతుడితో మరియు గురుదేవులతో సంసర్గము పొందే భక్తులకు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఈ స్మృతి మందిరాన్ని మేము అంకితం చేస్తున్నాము.”

పునీతమైన ప్రదేశాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది, ఆ చోటులో వసించి మరియు ధ్యానం చేసిన సాధుపుంగవుల యొక్క స్పందనలు రాబోయే యుగాలకోసం అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. “మీరు గొప్ప ఆధ్యాత్మికమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మీరు ఉత్తేజపూరిత స్పందనలను పొందుతారు, అవి మిమ్మల్ని మంచిగా మారుస్తాయని, గురుదేవులు అన్నారు. గొప్ప సాధుపుంగవులు నివసించిన క్షేత్రాల యొక్క తీర్థయాత్రల విలువ అదే.” ఎన్నో ఏళ్ళుగా లెక్కలేనంతమంది భక్తులు ఈ పవిత్ర ప్రాంగణలో గురుదేవునితో ఒక అద్భుత సంసర్గము పొందిన దివ్యానుభూతిని ధృవీకరించారు. ఒక వ్యక్తి యొక్క గ్రహణశీలత మేరకు, ప్రతి ఆత్మ కోరుకునే ఓదార్పు, మార్గదర్శకత్వం మరియు ప్రేమను స్మృతి మందిరం అందిస్తుంది.

1995లో మొదటిసారిగా స్మృతి మందిరాన్ని సందర్శించిన కొంతమంది భక్తుల అనుభూతులను ఇక్కడ ఇస్తున్నాం:

“ఎన్నో ఏళ్ళుగా మాకు ఎ౦తో సుపరిచితమైన ఆశ్రమ౦లోకి ప్రవేశి౦చినప్పుడు, ఆ అ౦దమైన పాలరాతి స్మారకమందిరం చూసి మేము ఎ౦తో పులకి౦చిపోయాము. స్మృతి మందిరం ఒక అందమైన రూపకల్పన. పావన మందిరంలో ఉన్న మన గురుదేవుని అందమైన సజీవ చిత్రం జీవంతో తొణికిసలాడుతూ, పవిత్ర మందిరంలోకి ప్రవేశించే భక్తులపై ఆయన ప్రేమపూర్వక వీక్షణములు నిరంతర ఆశీస్సులను కురిపిస్తాయి.”

పారా-ఆభరణం-1-300x10

“నేను ఎలా ధ్యానం చేస్తున్నానో గురుదేవులు నా ముందు కూర్చుని గమనిస్తున్నట్లు అనిపించింది.”

పారా-ఆభరణం-1-300x10

“గతంలో మేము రాంచీని చూశాము, కానీ ఈసారి అది భిన్నంగా ఉంది. చుట్టూ స్తంభాలతో, మధ్యలో అన్ని వైపులా జలతారు పరదాలతో ఒక అందమైన పాలరాయి నిర్మాణం ఉంది; ఒక పెద్ద గోపురం, మొదటిసారి చూసినప్పుడు గొప్ప ఉదాత్తమైన చిత్రంలా అనిపిస్తుంది. మరియు లోపల ఒక పెద్ద వర్ణచిత్రం ఉంది – గురుదేవులు మనల్ని పలుకరించాలనే కోరికతో లోపలి నుండి వస్తున్నారు. ఇంకా ఆ మందిరంలో స్పందనలు! నేనేమి చెప్పగలను! గురుదేవులే స్వయంగా వచ్చి అక్కడ స్థిరపడినట్లుగా ఉన్నారు.”

కొన్నేళ్లుగా రాంచీ ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తుల నుండి కొన్ని తలపులు:

“నేను ఆశ్రమ మైదానంలోకి అడుగు పెట్టిన మరుక్షణం, నేను ఎల్లప్పుడూ ఇక్కడికి చెందిన వాడినని నాకు అనిపిస్తుంది. నేను స్మృతి మందిరంలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, పాశ్చాత్య ప్రపంచాన్ని ధీటుగా ఎదుర్కొని, ఈ బోధనలను ప్రపంచానికి, మరియు నాకు అందించడానికి నా గురుదేవులు తన మాతృభూమి యొక్క సౌకర్యాన్ని విడిచిపెట్టినందుకు నాలో ఒక కృతజ్ఞతా భావాన్ని అది నింపుతుంది.”

పారా-ఆభరణం-1-300x10

“అభివృద్ధి చెందే తన బాలుర పాఠశాలతోనే గురుదేవులు తృప్తి చెంది ఉంటే, ఆ సామాను గదిలో ఆయనకు ఆ అంతర్దర్శనం లేకపోతే, వేలాది మంది భక్తులు అనుభవిస్తున్న క్రియాయోగ ప్రయోజనాలను, ఈ రోజు మనం చూసేవాళ్ళం కాదు.”

పారా-ఆభరణం-1-300x10

“నేను స్మృతి మందిరంలోకి ప్రవేశించిన ప్రతిసారి, నా కలతలు మరియు ఆందోళనలు అన్నీ నా ఉనికి నుండి నిష్క్రమిస్తాయి.”

పారా-ఆభరణం-1-300x10

“ఒక సంస్థ యొక్క ఈ గొప్ప స్మారక చిహ్నాన్ని ప్రార౦భి౦చడానికి ఎ౦తటి వినమ్రమైన ప్రాంగణం ఇది”

ఇతరులతో షేర్ చేయండి