క్రిస్మస్ సందేశం 2021

ప్రియతములారా,

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరమహంస యోగానంద గారి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆశీర్వదించబడిన ప్రభువైన యేసుక్రీస్తు జన్మను మరియు పునర్జన్మను మనం జరుపుకుంటున్నప్పుడు, ఈ సంతోషకరమైన కాలము యొక్క కాంతి మరియు ఆధ్యాత్మిక శక్తి మీకు (మిమ్మల్ని ఉత్తేజపరచి) స్ఫూర్తినిచ్చి, ఉద్ధరించుగాక.

భారతదేశం నుండి పశ్చిమ దేశాలకు క్రియాయోగ వ్యాప్తి కొరకు, అన్నింటినీ స్వీకరించే క్రీస్తు చైతన్యాన్ని (కూటస్థ చైతన్యం) మూర్తీభవించిన ప్రియమైన అవతారం (దేవుని వ్యక్తిగత అభివ్యక్తి), జీసస్ మరియు మహావతార్ బాబాజీ, నిరంతరమూ పాటుపడుతున్నారు. జీసస్ మరియు బాబాజీల ఆదేశానుసారం పరమహంస యోగానంద గారు ప్రపంచమంతా వ్యాప్తి చేసిన అద్భుతమైన బోధనలు మరియు సాధన ప్రక్రియల ద్వారా, మనలో ప్రతి ఒక్కరి హృదయమనే ఊయలను అనంతమైన క్రీస్తు జననానికి సిద్ధం చేసుకునే మార్గం అందించారు. ధ్యానంలో ఆ దివ్య చైతన్యంతో అనుసంధానం ద్వారా సరిగ్గా మనలోనే క్రీస్తు యొక్క రెండవ రాకను కనిపెట్టగలుగుతాము. ఈ పవిత్ర సమయంలో ప్రత్యేక శక్తితో దేవ లోకాల నుండి ప్రసరించే స్వర్గపు అయస్కాంతత్వం మరియు అనుగ్రహం మీ ఆత్మను, జీవితాన్ని మార్చే దేవుని ప్రేమ, సన్నిధిలోకి లోతుగా ఆకర్షించాలని నా హృదయపూర్వక ప్రార్థన. ఇదే క్రిస్మస్ యొక్క ఆధ్యాత్మిక వేడుక లోని నిజమైన అర్ధము,, అటువంటి వేడుక కోసమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరమహంసజీ అనుచరులు సంవత్సరంలోని ఈ సమయం కోసం ఎంతగానో ఎదురు చూస్తారు.

అప్పుడు, మనలో మేల్కొన్న దైవత్వం ద్వారా పునరుద్ధరించబడిన ఆ చైతన్యాన్ని క్రిస్మస్ సమయంలో అందమైన సామాజిక వేడుకలు మరియు ఉత్సవాలలోకి తీసుకువెళదాం – మన ప్రియమైనవారికి కాంతి మరియు ఆనందాన్ని ప్రసరింపజేసి, వారికి మన దయ, అవగాహన మరియు ప్రశంసలనే బహుమతులను అందజేద్దాం. మన లోపల క్రీస్తు యొక్క కాంతితో సన్నిహితంగా ఉన్నప్పుడు, మనం ఎక్కడికి వెళ్లినా సహజంగా సామరస్యాన్ని వ్యాప్తి చేస్తాము. కొత్త సంవత్సరం పొడవునా మన ధ్యానాలలో, దయతో కూడిన పనులలో మరియు ఇతరులకు చేసే సేవలో మన చైతన్యాన్ని దైవ ప్రేమతో కొత్తగా నింపేటప్పుడు ప్రతిరోజూ మన చైతన్యం విస్తరిస్తున్నట్లు మనం అనుభూతి చెందవచ్చు . తద్వారా మన సమాజంలో , దేశాలలో మరియు ప్రపంచంలో , శాంతి మరియు సద్భావనకు వ్యక్తిగత మార్గంలో మనము తోడ్పడవచ్చు.

ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు మరియు మీ ప్రియమైనవారికి ఇవి నా ఆత్మ యొక్క అభిలాషలు – నిత్య సజీవుడైన యేసు యొక్క విశ్వవ్యాప్తత మీ చైతన్యంలో పునర్జన్మించాలని , మరియు ఈ మహా మానవ కుటుంబంలోని ప్రతి వారికి , క్రీస్తు ప్రేమ మరియు ఆనందం అనే శాశ్వతమైన బహుమతి లభించాలని.

మీకు అత్యంత దీవించబడిన క్రిస్మస్ మరియు ఆధ్యాత్మిక ఆకాంక్షలు నెరవేర్చే నూతన సంవత్సరం కలుగుగాక!

స్వామి చిదానంద గిరి

Share this on

This site is registered on Toolset.com as a development site.