శ్రీ శ్రీ మృణాళినీమాతగారి నుండి క్రిస్మస్ సందేశం

9 డిసెంబరు, 2016

క్రిస్మస్ 2016

క్రిస్మస్ యొక్క పవిత్ర కాలంలో, సమస్త సృష్టిని విస్తరించిన అనంతమైన ఏసు క్రీస్తు యొక్క మహిమాన్వితమైన ప్రేమ మరియు ఆనందంతో ప్రపంచమంతా మరింత సుస్పష్టంగా ఆశీర్వదించబడుతుంది. ఇది మీ జీవితాన్ని నూతన ఆశతో మరియు దేవుని ఔదార్యం మరియు ప్రేమ యొక్క శక్తిపై విశ్వాసంతో ప్రకాశింపజేయాలని నేను ప్రార్థిస్తున్నాను. నిత్య గ్రాహ్యక హృదయాలపై ఇది తన ఉత్తేజితమైన, సామరస్య ప్రభావాన్ని చూపుతుంది. విశ్వవ్యాప్తమైన క్రీస్తు చైతన్యం [కూటస్థ చైతన్యం] సంపూర్ణంగా వ్యక్తీకరించబడిన ఏసు క్రీస్తు జన్మదినాన్ని మనం సంతోషపూర్వకంగా జరుపుకుంటాము, మనం కూడా భగవంతుని వెలుగు నుండి పుట్టాం, ఈ ప్రపంచంలో పరమాత్ముని అనంత చైతన్యం మరియు సంపూర్ణ ప్రేమని ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామనే ఉద్దీపన మనలో మేల్కొలుపుగాక.

తన పిల్లలను తిరిగి తన వైపుకు నడిపించడానికి దేవుడు పంపిన గొప్ప వ్యక్తులందరి జీవితాలలోఆ దివ్య చైతన్యం యొక్క అనంతశక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు వారు ఆయన సౌమ్యత, కరుణ మరియు ప్రతి ఆత్మ పట్ల అమితమైన ప్రేమతో కూడిన సంరక్షణను కూడా వ్యక్తం చేస్తారు. ఏసు తన శక్తిని ఇతరులపై తన ఆధిపత్యం చూపేందుకు కాకుండా సహాయం చేయడానికే ఉపయోగించారు; సేవ స్వీకరించడానికి బదులు ఐహిక లేదా ఆధ్యాత్మిక అవసరాలలో ఉన్నవారికి నమ్రతతో సేవను అందించారు. ఆయన జీవితం యొక్క విశ్వవ్యాప్త సందేశం దేవుడు అంటే ప్రేమ అనీ, అలాగే క్రీస్తు చైతన్యం యొక్క పరిపూర్ణ స్వభావం కూడా ప్రేమే. వాస్తవానికి మనలో ఒకనిగా ఆయన పుట్టుక మానవాళంతటికీ ఒక దివ్యమైన బహుమతి – ఇది నమ్రత, నిస్వార్థత మరియు అపరిమిత ప్రేమ యొక్క బాటను మనకు చూపుతుంది, ఇంకా మన ఆత్మల అద్భుత దివ్య సామర్థ్యం యొక్క అనంత సాఫల్యానికి దారితీస్తుంది. ఇటువంటి క్రీస్తు లక్షణాలను పెంపొందించుకోవడం, తద్వారా మన మనస్సులు మరియు హృదయ పరిధులను విస్తరింపజేయడమే, మనం ఆయనకు తిరిగి ఇవ్వగల బహుమతి; తద్వారా గాఢమైన ఆధ్యాత్మిక స్థితిలో ఆయన జన్మదిన వేడుకలో పాల్గొందాం. “క్రీస్తు కోమలత్వం అనే ఊయలలో జన్మించాడు. ద్వేషం యొక్క విధ్వంసక శక్తి కంటే ప్రేమ యొక్క కారుణ్య శక్తి గొప్పది”, అని గురదేవులు మనకు గుర్తు చేశారు. మీరు ఇతరులకు ఏది చెప్పినా లేదా చేసినా అది ప్రేమతో చేయండి. ఎవరికీ హాని చేయవద్దు. ఎవరినీ విమర్శించకండి. ఎవరినీ ద్వేషించకండి, అందరినీ ప్రేమించండి; అందరిలోనూ క్రీస్తును చూడండి. మీరు పొందిన ఆశీస్సులు, అందరూ పొందాలని కోరుకోండి.” మొదటి క్రిస్మస్ సందర్భంగా ప్రకటించిన దివ్య వాగ్దానం: ఈ సూత్రాలను పాటించే ప్రతీ ఆత్మకు అతని లేదా ఆమె జీవితంలోని శాంతి మరియు సౌభాత్రత్వం పొంది దాన్ని సర్వమానవాలళితో భాగస్వామ్యం చేయడం తెలుసుకుంటారు.

ఏసు జీవించిన అపారమైన క్రీస్తు-ప్రేమను సంపూర్ణంగా అనుభవించాలంటే,దాన్ని ఆయనను నింపిన ప్రేమ అనే బావి నుండి దాన్ని మనం ఆస్వాదించాలి. ఈ క్రిస్మస్ లో మీ ఉనికికి మూలమైన ఆ పరమాత్ముని నుండి నిరంతర ప్రవాహపు దివ్య ప్రేమ మరియు ఆనందం పొందడానికి గాఢమైన దైవిక నిశ్చలతతో ధ్యానం మరియు అంతర్గత అవగాహనకు మీ సమయాన్ని వెచ్చించండి. ఈ స్వస్థత ధారలు వేర్పాటుదనపు అడ్డంకులను ప్రక్షాళనం చేయడంతో, అనంతమైన క్రీస్తును మీ విస్తరిస్తున్న చేతనలోకి స్వీకరించడానికి మీరు చోటు కల్పిస్తారు. ఈ క్రిస్మస్ మీ హృదయంలోకి ఆ దివ్య ప్రకాశం యొక్క కరుణ మరియు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి అంతేకాదు మీ ఆనందాన్ని అనంత పరమాత్మలో భాగమైన ఇతరులతో పంచుకోవాలనే కోరికతో సుసంపన్నమవుదురుగాక.

మీకు మరియు మీ ప్రియతములకు దేవుని ప్రకాశము మరియు ప్రేమతో నిండిన క్రిస్మస్ శుభాకాంక్షలు.

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఇతరులతో షేర్ చేయండి