సంక్షోభమా లేక ఆధ్యాత్మిక అవకాశమా?

25 మార్చి, 2020

స్వామి చిదానంద గిరి నుండి ఒక సందేశం

ప్రియతములారా,

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తితో, రోజులు, వారాలు గడిచిన కొద్దీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తమ జీవితాల్లో ముఖ్యమైన సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చింది, శ్రీ పరమహంస యోగానంద ఆశ్రమాల్లో పదే పదే ప్రార్థనలు, మనందరి ప్రేమ మరియు సౌహార్ధత, మనం పంచుకునే ఆధ్యాత్మిక బంధం యొక్క శక్తివంతమైన పునరుద్ఘాటనలు మిమ్మల్ని చేరకుంటాయి. అంతేకాక మీ ప్రార్థనలు మీ దివ్య స్నేహ వ్యక్తీకరణలను మేము అనుభూతి నొందాం, ఇంకా గాఢంగా ప్రభవితమయ్యాము. ఈ పరస్పర మద్దతు మరియు ఆధ్యాత్మిక బలం స్పష్టమైన ఇంకా నిర్భీతిని పునరుద్ధరించే చేతనము పరమహంసగారి అనుచరుల యొక్క ఈ ప్రపంచవ్యాప్త కుటుంబాన్ని ఎంతో మనోహరంగా నింపుతుంది.

ప్రతికూల సమయాలకున్న ఒక మంచి విషయం ఏమిటంటే, అవి తరచుగా అసాధారణమైన రీతిలో, మనలోని అత్యుత్తమమైన దానిని—మనం అనుమతించినట్లయితే బయటికి తీసుకువస్తాయి అంటారు. చరిత్రలో ఏ సమయంలోనైనా సంక్షోభం,విపత్తు లేదా ముప్పులకు ప్రజలు రెండు విధాలుగా ప్రతిస్పందించడాన్ని మనం చూడవచ్చు: వారు తమ నియంత్రణ లేని మనస్సులు మరియు శిక్షణ లేని సంకల్పం యొక్క భయాలు, పరిమితులు మరియు తుచ్ఛ స్వార్థంతో తమను తాము నిర్వచించుకోవడానికి అనుమతించారు; లేదా వారు తమ జయింపశక్యముకాని ఆత్మల యొక్క అందమైన దైవిక లక్షణాలను మరియు గుప్త శక్తిని కనుగొనడానికి మరియు వ్యక్తీకరించడానికి ఆ విపత్తు సమయాన్ని ప్రేరణగా వినియోగించారు.

మనలో ప్రతి ఒక్కరూ ప్రపంచ సంక్షోభం యొక్క ఈ (లేదా ఏదైనా) సమయాన్ని వ్యక్తులుగా, దేవునికి మరియు గురుదేవుని శిష్యులుగా మన ఎదుగుదలలో ఒక కీలకమైన క్షణంగా మార్చుకోవచ్చు. ఎవరైనా గతంలోని ఈ కష్ట సమయాలను నెమరువేసుకున్నపుడు, “అవును, అపుడు నేను ఇన్నేళ్ళ నా ఆధ్యాత్మిక అధ్యయనం మరియు స్వీయ-అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాల ఫలితాలను వెలుపలికు తీసుకురావడానికి మరియు వ్యక్తీకరించడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను అనుకునే ఆత్మలుగా మనం ఉందాం. ఆ సమయంలోనే నేను ‘ఏదో ఒక రోజు’ సాధించాలని ఆశించిన ఆధ్యాత్మిక లక్షణాల గురించి ఆలోచించడం నుండి వాస్తవంగా వాటిని జీవించడానికి దూకాను అంతర్గతంగా.”

మానవాళిని బాధి౦చే అన్ని తీవ్రమైన పరీక్షలూ, నమ్మిక మరియు ఆధ్యాత్మిక అ౦తర్దృష్టి దృష్టిలతో చూస్తే, మన భూమి యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేయడానికి అవసరమైన పాఠాలను సూచి౦చడానికే వస్తాయి. నేను ఇతర సందర్భాలలో చెప్పినట్లుగా, చరిత్రలో ఈ సమయంలో మానవాళికి ఏమి అవసరమో దాని సారాంశాన్ని శ్రీ పరమహంస యోగానంద ప్రత్యేకంగా మరియు సంక్షిప్తంగా మతరహితము మరియు విశ్వజనీన ప్రయోజనకరమైన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. లక్ష్యాలు మరియు ఆదర్శాలు రూపొందించారని నేను నమ్ముతాను. మనం అవగాహనతో ఈ అవకాశాన్ని స్వీకరించినట్లయితే, ప్రాథమికంగా ఇది బాధ నిరుత్సాహాలకి సంబంధించిన సమయం కాదు. బదులుగా, ఇది మనకు సవాలు చేయబడిన కాలం కానివ్వండి, మరి ఆ సవాలును మనంఎదుర్కొందాము—మన శక్తితో సాధ్యపడిన ప్రతిదీ చేసినప్పుడు, ఆయన విముక్తి నొసగే ఆదర్శాలను మనవిగా స్వీకరించినందుకు, క్షణ క్షణం, దిన దినం, మన గురుదేవులు మనపట్ల గర్వించేలా చేద్దాం.

గురుదేవుల వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోధనలలో, పూర్ణ సన్నద్ధుడైన దివ్య యోధుడిగా జీవిత సంగ్రామంలో మనం ప్రదర్శించాల్సిన ఆధ్యాత్మిక ఉపకరణాలుగా—బలమైన సానుకూల ఆలోచనలు మరియు వాటిపై చర్య తీసుకోవాలనే సంకల్పమే ఆయుధాలుగా, శారీరక ఆరోగ్యంపై మనస్సు మరియు ఆత్మల యొక్క శక్తివంతమైన ప్రభావం యొక్క జ్ఞానంతో, “సద్గుణంతో చెడును అధిగమి౦చడానికి, స౦తోష౦తో దుఃఖాన్ని, దయతో క్రూరత్వాన్ని, జ్ఞాన౦ ద్వారా అజ్ఞానాన్ని,” అవసరమైన సామర్థ్యాలతో ఇంకా విజేత కుండే ధైర్య విశ్వాసాలు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగా దీవించబడ్డామో. మన౦ ఆధ్యాత్మిక మార్గ౦లో ఏమి అధ్యయన౦ చేశామో క్లిష్ట పరిస్థితులు పరీక్షి౦చినట్లుగా, మన౦ ఆకళించుకొన్నవన్నీ నేర్చుకోవడ౦ ను౦డి చెయ్యడం ద్వారా పరివర్తన చె౦దనివ్వండి. ఆ ప్రక్రియలో మనకు తెలియని బలాన్ని, మరియు సరైన చర్యలు తీసుకోవడానికి ఆచరణాత్మక, అంతర్దృష్టి మార్గదర్శక అవగాహన, మరియు (అత్యంత ముఖ్యమైనది) ప్రేమించడానికి విస్తరిస్తున్న సామర్థ్యాన్ని కనుగొంటాము. మన జీవిత౦లో నిలకడగా ఉండే బాహ్య వనరులను సవాలు చేసే పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్నవారి పట్ల మనకు చిరాకు లేదా అసహన౦ కలిగి౦చేలా చేయడానికి బదులుగా మన సొ౦త భయాలను, అభద్రతలను ఎదుర్కోవడ౦ నేర్చుకు౦దా౦, వాటిని భగవంతునికి సమర్పిద్దాం. దయతో, ఉల్లాసంగా, ప్రశాంతంగా మరియు అంతర్గత స్థిరత్వంతో ధ్యానం చేసే వారి ఉదాహరణలా ఇతరులు ఉండడానికి ప్రోత్సహిస్తుంది. అలాంటి మార్గాల్లో, మనం ఎదుర్కొంటున్న సవాళ్లు మన స్వీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి మాత్రమే కాకుండా, మన చుట్టూ ఉన్నవారికి మరియు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయి.

మీలో ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక ఇతరుల జీవితాలలో ఏర్పడిన జీవన మరియు భద్రత ఆటంకాలకు వారిపట్ల మీ హృదయాలు లోతుగా స్పందిస్తున్నాయని నాకు తెలుసు. అలాగే మీలో చాలా మంది యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌లోని సన్యాసులతో కలసి రోజూ ప్రార్థనలు చేస్తున్నందుకు నేను కృతజ్ఞతతో స్ఫూర్తిని పొందాను—వైద్యం అవసరమైన వారి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర ముఖ్యమైన-సేవల కోసం కూడా. జీవితంలోని అనేక రంగాలలో సేవను అందించేవారు తమ నైపుణ్యాలు, కరుణ మరియు స్వాంతనము ద్వారా మనందరికీ సహాయం చేస్తున్నారు. మీ ఇళ్లలో లేదా ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రాలలో కార్యక్రమం ప్రకారం అనేక సమూహ ధ్యానాలలోని ఒకదానిలో మన గురుదేవుల స్వస్థత చేకూర్చే ప్రక్రియ చేస్తూ, మీ ప్రార్థనలను కొనసాగించమని మిమ్మల్ని కోరుతున్నాను.

మీ ప్రాంతానికి తప్పనిసరి చేయబడ్డ ఆరోగ్య మరియు పరిశుభ్రత మార్గదర్శకాలను పాటించడం ద్వారా మిమ్మల్ని మరియు ఇతరులను సంరక్షించుకోండి. ఇంకా “సామాజిక దూరం” నియమాలతో మీ రోజువారీ దినచర్యలో లభించిన ఆ కొంచెం అదనపు సమయాన్ని, మిమ్మల్ని అలాగే మీ సముచితమైన చర్యల ద్వారా మీరు స్పృశించగల మరియు సేవ చేయగల వారందరినీ ఉద్ధరించడానికి కృతజ్ఞతతో వినియోగించండి. బాహ్యంగా ఎడంగా ఉన్నాగాని అంతర్లీనంగా సమైక్య ఆత్మల బృందంగా, అనంతమైన శక్తి మరియు ప్రేరణ మూలం నుండి మనల్ని మనం సమృద్ధిచేసుకుందాం. భగవంతునితో మన హృదయాలను, మనస్సులను అనుసంధానించుకోవడం ద్వారా, ఆయనను మన చైతన్యానికి ధ్రువ తారగా చేసుకొని, ఈ చీకటి, క్లిష్త సమయాల్లో సురక్షిత౦గా, విజయవ౦త౦గా మన మార్గాన్ని కనుగొ౦టా౦, అదే సమయ౦లో మానవ కుటు౦బమ౦తటి ఆధ్యాత్మిక పరిణామానికి దోహదపడడానికి మన వంతు కృషి చేద్దా౦.

భగవంతుడు మరియు గురుదేవులు సదా మిమ్మల్ని ఆశీర్వదించి నడిపింతురు గాక,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో షేర్ చేయండి