స్వామి ఆనందమోయ్ (1922-2016) గారి జ్ఞాపకార్థం

6 సెప్టెంబరు, 2016

పరమహంస యోగానందగారి ప్రత్యక్ష శిష్యులు మరియు 65 సంవత్సరాలకు పైగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసియైన మన గౌరవనీయులు స్వామి ఆనందమోయ్, సెప్టెంబర్ 6, 2016 మంగళవారం సాయంత్రం లాస్ ఏంజిలిస్ లోని మౌంట్ వాషింగ్టన్‌ ఎస్‌.ఆర్‌.ఎఫ్. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా పరమపదించారు.

ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క అత్యంత ప్రియమైన మరియు గాఢంగా గౌరవించబడ్డ ఉపదేశకునిగా, స్వామి ఆనందమోయ్ తన నిస్వార్థ జీవితంలో పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు మరియు ఆధ్యాత్మిక జీవితం గురించి లోతైన అవగాహన ద్వారా, వేలాది మందికి స్ఫూర్తినిచ్చారు మరియు ఉద్ధరించారు. ఆయన చాలా సంవత్సరాలపాటు, దైవాన్వేషణ మార్గంలో ఉన్నవారిని ప్రోత్సహిస్తూ సహాయం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని ఆత్మల ఆధ్యాత్మిక జీవితాలలో శాశ్వత వారసత్వాన్ని మిగిల్చారు.

స్మారక సేవా ప్రణాళికలు

వై‌.ఎస్‌.ఎస్. ఆశ్రమాలు మరియు కేంద్రాల్లో ఒక బహిరంగ స్మారక సేవ నిర్వహించబడింది:

ఆదివారం, సెప్టెంబర్ 25,2016

యోగదా సత్సంగ మఠము, దక్షిణేశ్వర్: ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00

యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ: ఉదయం 10.00 – ఉదయం 11.30

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, నోయిడా: ఉదయం 10.00 – మధ్యాహ్నం 12.00

వై‌.ఎస్‌.ఎస్. కేంద్రాలు

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, బెంగళూరు: ఉదయం 10.00 – మధ్యాహ్నం 12.15

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, చండీగఢ్: ఉదయం 10.00 – మధ్యాహ్నం 12.00

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, ఢిల్లీ: ఉదయం 10.00 – ఉదయం 11.30

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, లక్నో: ఉదయం 9.00 – మధ్యాహ్నం 1.00 తదనంతరం వీడియో ప్రదర్శన ఉంటుంది.

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, ముంబై: ఉదయం 12.30 – మధ్యాహ్నం 2.00

యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, రాజమండ్రి: ఉదయం 11.00 – మధ్యాహ్నం 12.00

మీరు స్మారక సేవకు హాజరయినా, కాకపోయినా, సోదరుడు ఆనందమోయ్ గారు దివ్య స్వేచ్ఛ మరియు సంతోషం యొక్క ఆశీర్వదించబడిన రాజ్యములోకి మారుతున్న సమయంలో, ఆయన స్ఫూర్తిదాయకమైన మరియు ఆదర్శప్రాయమైన జీవితంపై ఆనందిస్తున్నపుడు, మన ప్రేమ మరియు కృతజ్ఞతలను ఆయనకు పంపిస్తున్నపుడు, మా అందరితో ఆత్మీయంగా చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఒక సంక్షిప్త జీవిత చరిత్ర

నవంబరు 1, 1922న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో హెన్రీ షాఫెల్‌బెర్గర్‌లో జన్మించిన స్వామి ఆనందమోయ్ తన యుక్తవయస్సులో తూర్పు తత్వశాస్త్రానికి పరిచయం చేయబడ్డాడు మరియు వెంటనే ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తన స్వంత అన్వేషణను ప్రారంభించారు. కాని ఎలా, తనకు మార్గనిర్దేశం చేయడానికి ఒక అధ్యాత్మిక జ్ఞానం పొందిన గురువును ఎలా కనుగొనాలనే విషయం ఆయనకు విస్మయంగా ఉండేది. “నేను నా పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను మా నాన్నగారి వ్యాపారంలో రెండు సంవత్సరాలపాటు విసుగ్గా పనిచేశాను” అని ఆయన గుర్తుచేసుకున్నారు. “అప్పటికి, నేను హిందూ తత్వశాస్త్రంపై నా ఆసక్తిని వదులుకున్నాను, ఎందుకంటే నాకు గురువు దొరకడం అసాధ్యం అనిపించింది. నేను కళలకు సంబంధించిన వృత్తిని ప్రారంభించాను మరియు మూడు సంవత్సరాల తర్వాత నేను ప్రసిద్ధ భవనశిల్పి ఫ్రాంక్ లాయిడ్ రైట్‌తో కలిసి చదువుకోవడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళడానికి ఆహ్వానించబడ్డాను.” ఆయన 1948లో యు.ఎస్. చేరుకున్నాడు మరియు వెంటనే పరమహంస యోగానందగారు రచించిన ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని కనుగొన్నాడు. “నేను ఆత్రంగా పుస్తకం చదివాను,” అని ఆయన అన్నారు.” నాకు కావలసినది నేను కనుగొన్నానని నా హృదయంలో నాకు తెలుసు, మరియు పరమహంస యోగానందగారి బోధనలను అధ్యయనం చేసి భగవంతుడిని కనుగొనాలని నేను నిర్ణయించుకున్నాను.”

కొన్ని నెలల తర్వాత, గొప్ప గురువును చూడాలనే ఆశతో స్వామి ఆనందమోయ్, లాస్ ఏంజిలిస్ కు పయనమయ్యారు. ఎస్‌.ఆర్‌.ఎఫ్. హాలీవుడ్ మందిరంలో పరమహంసగారు అందించిన ఆదివారంనాటి సేవ ముగింపు సందర్భంగా వారితో మొదటి పరిచయం కలిగింది. “ఇది మరపురాని అనుభవం,” అని ఆయన అన్నారు. “సేవ పూర్తయిన తర్వాత, గురుదేవులు ఒక కుర్చీపై కూర్చున్నారు మరియు అక్కడకు వచ్చిన చాలా మంది ఆయనను అభినందించడానికి వెళ్ళారు. చివరగా నేను ఆయన ముందు నిలబడినప్పుడు, ఆయన నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు మరియు నేను ఆ లోతైన, మృదువైన ప్రకాశవంతమైన, కళ్ళలోకి చూశాను. మాటలేమీ మాట్లాడలేదు. కానీ ఆయన చేతి నుండి మరియు కళ్ళ నుండి నాకు వర్ణించలేని ఆనందం ప్రవహించింది.”

1949లో సెల్ఫ్-రియలిజేషన్ ఫెలోషిప్ ఆశ్రమంలో సన్యాసిగా స్వామి ఆనందమోయ్ ప్రవేశించారు మరియు ఈ గొప్ప గురువులు పరపదించిన 1952 ప్రారంభం వరకు, పరమహంసగారి వ్యక్తిగత శిక్షణను పొందే విశేషమైన అవకాశాన్ని పొందారు. ఆయన 1957 నవంబర్ లో సన్యాసుల ఆఖరి సన్యాస ప్రమాణాలను స్వీకరించారు — ఆనందమోయ్ (“దివ్యానందంతో వ్యాప్తి చెందడం”) అనే పేరును స్వీకరించారు — మరియు ఏప్రిల్ 1958లో ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఉపదేశకులుగా నియమితులయ్యారు, ఈ రెండు వేడుకలను శ్రీ శ్రీ దయామాతగారు నిర్వహించారు.

సన్యాస శిష్యుడిగా తన జీవితపు సుదీర్ఘ కాలంలో, తన గురుదేవుల కార్యాన్ని అనేక మరియు విభిన్న మార్గాల్లో సేవలందించడానికి ఆయన పిలువబడ్డారు. 1950లో ప్రారంభానికి ముందు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ లేక్ ష్రైన్‌లో తోట పని, హాలీవుడ్ మందిరం మరియు ఆశ్రమ కేంద్రం మైదానంలో ఇండియా హాల్ మరియు లోటస్ టవర్ నిర్మాణంలో సహాయం చేయడం మరియు హాలీవుడ్‌లోని ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఫలహారశాలలో వంట మనిషిగా పని చేయడం వంటి పనులకు నియమించబడ్డారు. 1950లలో ఉపదేశకులుగా తన బాధ్యతలను ప్రారంభించారు మరియు అనేక సంవత్సరాలుగా ఎస్‌.ఆర్‌.ఎఫ్. హాలీవుడ్, ఎన్సినీటస్, ఫీనిక్స్, లేక్ ష్రైన్‌, పసదేనా మరియు ఫుల్లర్టన్ మందిరాలలో ఉపదేశకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అదనంగా, అనేకసార్లు భారతదేశంలో పర్యటించి క్రియాయోగ దీక్షా వేడుకలు నిర్వహించారు మరియు దేశమంతటా పెద్దఎత్తున ప్రేక్షకులతో సంభాషించారు. తద్ద్వారా పరమహంసగారి యోగదా సత్సంగ సొసైటీకి సేవ చేశారు. అనేక సంవత్సరాల పాటు వివిధ ఎస్‌.ఆర్‌.ఎఫ్. ఆశ్రమ కేంద్రాలకు కూడా ముఖ్య బాధ్యతలు నిర్వహించారు.

చాలా సంవత్సరాలపాటు సెల్ఫ్-రియలిజేషన్ ఫెలోషిప్ మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోర్డు డైరెక్టర్లలో స్వామి ఆనందమోయ్ సభ్యులుగా ఉన్నారు. ఎస్‌.ఆర్‌.ఎఫ్. సన్యాసుల ఆధ్యాత్మిక మార్గదర్శక బాధ్యతలను కూడా శ్రీ దయామాత ఆయనకు అప్పగించారు మరియు దశాబ్దాలపాటు ఈ హోదాలో ప్రియమైన సలహాదారుగా మరియు మార్గదర్శకులుగా ఆయన పనిచేశారు.

ఒక బోధకునిగా మరియు జనసామాన్యానికి వక్తగా ఆయన నియమింపబడుతున్నారని స్వామి ఆనందమోయ్ గారికి పరమహంసగారు తెలియజేశారు, ఈ ఉపదేశకుని పాత్ర కారణంగానే ఆయన చిరకాలం గుర్తుండిపోతారని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్, యూరప్ మరియు భారతదేశానికి జరిపిన విస్తృత పర్యటనల కాలంలో, స్వామి ఆనందమోయ్ ఎస్‌.ఆర్‌.ఎఫ్. యొక్క అత్యంత ప్రియమైన మరియు గౌరవనీయులైన ఉపదేశకులలో ఒకరిగా గుర్తింపు పొందారు, పరమహంస యోగానందగారి బోధనలను స్పష్టంగా వ్యక్తీకరించడం ద్వారా, గురుదేవులతో ఉన్న వ్యక్తిగత అనుభవాల స్మృతులను, మరియు తన వివేకంతో మరియు దయతో కూడిన వ్యక్తిగత బోధన ద్వారా ఎస్‌.ఆర్‌.ఎఫ్. సభ్యులు మరియు సభ్యులు కాని వారిని కూడా ఒకే రకంగా ప్రేరేపించారు.

ప్రియమైన సన్యాసికి ప్రేమపూర్వక ప్రణామాలు

స్వామి ఆనందమోయ్‌ గారికి మన ప్రేమపూర్వక నమస్కారాలను పంపినప్పుడు, తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన భగవంతుడు మరియు గురుదేవులతో ఆయన ఇప్పుడు ఐక్యమయ్యారనే ఆలోచనలో మనం ఓదార్పు పొందవచ్చు. ఆయన ప్రోత్సాహకరమైన, అంతర్దృష్టిగల మార్గదర్శకత్వం మరియు ఆయన మనోహరమైన రమ్యతను భద్రపరచిన అనేక ఆడియో మరియు వీడియో రికార్డింగ్‌లకు కూడా మనం కృతజ్ఞులమై ఉండవచ్చు. ఎస్‌.ఆర్‌.ఎఫ్. వెబ్‌సైట్ మరియు ఎస్‌.ఆర్‌.ఎఫ్. యు ట్యూబ్ చానల్లో స్వామి ఆనందమోయ్‌తో ఈ ప్రత్యేక క్షణాలలో కొన్నింటిని అనుభవించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

వై‌.ఎస్‌.ఎస్. ఆన్‌లైన్ పుస్తక కోశంలో స్వామి ఆనందమోయ్ గారి ఆడియో మరియు వీడియో రికార్డింగ్‌లు కూడా ఉన్నాయి.

ఇతరులతో షేర్ చేయండి