
ప్రియతమ,
ఈ సంవత్సరం మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులతో కలిసి భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమిని జరుపుకోవడంలో, దివ్య ప్రేమ యొక్క ఈ దివ్య అవతారునితో మన మనస్సులు మరియు హృదయాలను అనుసంధానించుకోవటానికి ఇది మనకు ఒక అందమైన అవకాశం. ఈ పవిత్ర సమయంలో ఆయన పట్ల మనకున్న భక్తి, మనమందరం తిరిగి పొందాలని దేవుడు కోరుకుంటున్న శాంతి మరియు ఆనందం యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యం కోసం మన కోరిక పునర్నవీకరించుగాక. అనంతుడైన భగవంతుడు కృష్ణుని రూపంలో వ్యక్తమై తన శిష్యుడైన అర్జునుడిని ఆధ్యాత్మిక మరియు బాహ్య విజయానికి మార్గనిర్దేశం చేసినట్లే, మన రోజువారీ కురుక్షేత్ర యుద్ధంలో కూడా – మనం మన ఆత్మ యొక్క లోతులలో దాగి ఉన్న సామర్థ్యాలు మరియు దివ్య గుణాల యొక్క దివ్య-చైతన్య వ్యక్తీకరణను సాధించే వరకూ ఆయన మనకు మార్గదర్శనం చేస్తారని భగవద్గీత మనకు అభయమిస్తోంది.
ధర్మాన్ని పునరుద్ధరించే పాత్రలో, భగవాన్ కృష్ణ అర్జునుడి రథాన్ని నడిపించాడు; కానీ మాయ యొక్క అడ్డంకులను జయించడంలో ధైర్యవంతుడైన దివ్య యోధునిగా తన వంతు బాధ్యతను కూడా నెరవేర్చమని అర్జునుడిని కోరాడు. భగవంతుడు మనల్ని కూడా – మన సహజమైన దివ్యత్వం మరియు ఆనందాన్ని మరుగుపరిచే పరిమిత ఆలోచనలు, కోరికలు మరియు ప్రవర్తనలను మన చైతన్యం నుండి బహిష్కరించడానికి మన సంకల్ప శక్తిని, చొరవను మరియు ఆత్మ-ప్రేరేపిత వివక్షతనూ ఉపయోగించమని కోరుతాడు. గీతలో శ్రీ కృష్ణుని అసమానమైన మరియు ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది; అలా ప్రతి విజయంతో, మనం శక్తివంతులమవుతాం అలాగే మరింత ఆత్మ స్వేచ్ఛను మరియు ఆనందాన్న పొందుతాము.
మాయ అనేది ఒక మొండి శత్రువు ఎందుకంటే అనేక జీవితకాలల పాటు మనల్ని మనం మర్త్యమైన శరీరం మరియు మనస్సులుగా గుర్తెరిగున్నాం. దైనందిన జీవిత నాటకంలోనూ, వాటి నిరంతర ప్రతి స్పందనలోనూ మనం నిమగ్నమై ఉన్నంత కాలం – ఈనాటి ఆధునిక ప్రపంచపు తప్పనిసరి ఒత్తిళ్లు, నిరంతర ఇంద్రియ ప్రేరేపణలు, మరియు శాంతికి విఘాతం కలిగించే సమాచార పెనుభారం లాంటి విస్తృత బాహ్య పరిస్థితులకు మన శక్తి మరియు శ్రద్ధ బందీలవుతాయి. భగవాన్ కృష్ణుని విజయ బాటే మనకూ అవసరం: లోతైన యోగా ధ్యాన శాస్త్రాన్ని క్రమం తప్పకుండా అభ్యసించడం, దివ్య ఉనికి నిరంతరంగా ఎదురుచూసే చోటకు చైతన్యాన్ని అంతర్ముఖం చేయడం. మన గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద ఇలా అన్నారు: “ఇంద్రియాల నిరంతర నివేదనలు మరియు చంచల ఆలోచనా కబుర్ల నుండి విముక్తి పొంది, యోగి తన సమగ్ర స్వభావాన్ని క్రమంగా పరిశుద్ధి చేసే ఆనందకరమైన అంతర్గత ప్రశాంతత యొక్క అద్భుతమైన సంపూర్ణ నిశ్శబ్దంలో మునిగిపోతాడు.” ఆ భగవంతుని-శాంతి యొక్క స్పర్శ కూడా మనల్ని ఆధ్యాత్మికం చేస్తుంది మరియు మనకు ఎదురయ్యే ఏ పరిస్థితుల్లోనైనా అవకాశాల గురించి మన అవగాహనను పెంచుతుంది. రోజువారీ పరిస్థితులను మరింత సమదృష్టితో మనం అంచనా వేయవచ్చు ఇంకా అహం మరియు భావోద్వేగ ప్రేరణలతో కాక ప్రశాంత వివేచన మరియు ఆత్మ అంతర్ దృష్టి ద్వారా మార్గనిర్దేశం చేయవచ్చు. కేవలం అనివార్యమైన నైతికత ఆధారంగా కాకుండా, మనపైన మనకుండే గాఢమైన సానుభూతితో మనం ఇతరుల పట్ల మరింత అవగాహన మరియు కరుణను వ్యక్తపరచగలుగుతాము.
భగవాన్ శ్రీ కృష్ణ మరియు మన గురుదేవుల ఆశీర్వాదాల ద్వారా – మరియు ధ్యానం యొక్క పరివర్తన శక్తి, సరైన కార్యాచరణ ఇంకా భగవంతుని పట్ల నిరంతరం పెంపొందే భక్తితో – మీరు కూడా భగవంతుని చైతన్యం వల్ల వచ్చే మహిమాన్వితమైన స్వాభావిక లక్షణము: శక్తి మరియు తేజము, సర్వ సౌహార్ధం, మరియు శాశ్వత అంతర్గత ఆనందం అభివృద్ధి చేసుకొందురుగాక.
జై శ్రీ కృష్ణ! జై గురు!
స్వామి చిదానంద గిరి