మీ ప్రేమ మరియు సహాయానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

22 మార్చి, 2021

“నా వద్ద ఏమీ లేకపోయినా, నాకోసం అన్నీ చేసే స్నేహితులు మీలో ఉన్నారని నాకు తెలుసు. మీకోసం అన్నివిధాలా సహాయం చేసే స్నేహితుడిని నేను అని మీకూ తెలుసు. మనము దేవుణ్ణి ఒకరిలో ఒకరం చూసుకుంటున్నాము. ఇది చాలా చక్కటి బాంధవ్యము.”​

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ప్రియమైన దివ్యాత్మా,

గురూజీ ఆశ్రమాలలోని సన్యాసులు మరియు సేవకుల నుండి మీకు ప్రణామం మరియు ప్రేమపూర్వక శుభాకాంక్షలు! మీరు మరియు మీ ఆప్తులు — శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా బాగున్నారని మేము ఆశిస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము.

గత సంవత్సరం అంతా మనకు పరీక్షా సమయము. మరియు మన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులలో అనేకమంది జీవితాలు ఇబ్బందికి లోనయ్యాయి. ఇంకా, అనేక రంగాలలో సవాళ్లు పెరుగుతున్నప్పటికీ, ఇందులో ఆధ్యాత్మిక గుణపాఠాలు అపారమైనవి మరియు ఉద్ధరించేవి. భగవంతుడు మరియు గురువుతో మన అంతర్గత అనుసంధానము ద్వారా మాత్రమే శాశ్వతమైన శాంతి మరియు స్వస్థత లభిస్తుందని గుర్తించడం అన్నింటికంటే ముఖ్యమైన గుణపాఠాం. అంతర్ముఖలై, మన సంకల్పాన్ని పునః శక్తివంతం చేసి, గురుదేవుని ఉత్కృష్టమైన బోధనలలో లీనమై, మహాత్ముల కాంతి, ప్రేమ, మరియు రక్షణలో స్థిరపరచుకొని ప్రతికూల ప్రభావాలను అధిగమించడం మనకు నేర్పింది.

మీ సమయం, ప్రార్థనలు, సద్భావన మరియు భౌతిక సహాయంతో ముందుకొచ్చిన మీలాంటి దయగల ఆత్మల ద్వారా వ్యక్తీకరించబడిన మానవత్వం, కరుణ, మరియు సంఘీభావంపై ఈ సంవత్సరం మాకు గొప్ప ఆశను చూపింది. ఈ విపత్కర సమయాల్లో నిస్వార్థంగా అందించిన మీ ఉదార ​​మద్దతుకు మేము చాలా కృతజ్ఞులం. మీ మద్దతు మరియు దివ్య స్నేహాన్ని మేము ఎంతో ఆనందిస్తామని మరియు గౌరవిస్తాము అని దయచేసి తెలుసుకోండి.

గురూజీ దయ మరియు మీ ఉదారమైన మద్దతు మరియు అంకితభావంతో, మేము మా గురు-సోదరులు మరియు గురు-సోదరిలకు సేవ చేయడానికి మరియు మానవతా సేవను అందించడానికి గత సంవత్సరంలో అనేక కార్యములను ప్రారంభించగలిగాము మరియు పూర్తి చేయగలిగాము. మేము చాలా కాలంగా అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి మరియు మా భక్తులకు ప్రయోజనం చేకూర్చే కొత్త సేవా కార్యక్రమాలను చేపట్టడానికి మా సమయాన్ని ఉపయోగించాము.

యోగదా సత్సంగ పాఠాల కొత్త సంచిక

 • ప్రాథమిక అనుక్రమం పూర్తి చేసిన వారి కోసం మేము ఆంగ్లంలో అదనపు అనుబంధిత పాఠాలను విజయవంతంగా విడుదల చేయగలిగాము.
 • కొత్త ప్రాథమిక అనుక్రమం పాఠాలను హిందీ, బెంగాలీ, తమిళం, మరియు తెలుగులోకి అనువదించడానికి మేము దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల-అనువాదకుల బృందాలతో కలిసి పని చేస్తున్నాము.

గురుదేవుని బోధనలతో సహాయపడటం — డిజిటల్ మార్గాల ద్వారా

సామూహిక ధ్యానాలు మరియు ఇతర కార్యక్రమాల కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం (లేదా ఎస్.ఆర్.ఎఫ్. ఆన్‌లైన్ మెడిటేషన్ సెంటర్) — తమకు అవసరమైనప్పుడు అందుబాటులో వచ్చిందని అనేక మంది భక్తులు తమ ప్రగాఢమైన ప్రశంసలను తెలియజేస్తూ మాకు లేఖలు రాశారు. ఒక భక్తుడు మాకు ఇలా వ్రాశాడు, “భక్తుడు మందిరానికి వెళ్ళలేనప్పుడు, మందిరం భక్తుడి ఇంటికి వచ్చింది!”

 • హిందీలో మొట్టమొదటి ఆన్‌లైన్ సాధనా సంగం ఇటీవల వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రంలో విజయవంతంగా నిర్వహించబడింది రాబోయే వారాలు మరియు నెలల్లో ఇతర భారతీయ భాషలలో సంగమ్‌లు రానున్నాయి. మీరు కూడా ఈ ఆన్‌లైన్ ఆఫర్‌లలో పాల్గొని ప్రయోజనం పొందారని మేము ఆశిస్తున్నాము: రోజంతా జరిగే రిట్రీట్ లు, స్మారక మరియు వారపు ధ్యానాలు, సాధన సంగమములు మొదలైనవి.

సేవా కార్యకలాపాలు

 • దాతృత్వం ఇంట్లోనే ప్రారంభమవుతుంది:
  • వివిధ వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది తక్కువ ఆర్థిక స్థాయికి చెందినవారు, వీరికి ఆదాయ నష్టం, విపరీతమైన కష్టాలను కలిగిస్తుంది. మీ సహకారం వల్ల మేము, మా సిబ్బందిని కొనసాగించడం మరియు వారి జీతాలను నిరంతరాయంగా మరియు సకాలంలో చెల్లించడం సాధ్యమైంది.
 • దేశవ్యాప్తంగా ధార్మిక కార్యకలాపాలు:
  • మీ సహకారం మా ఆశ్రమాల చుట్టూ మాత్రమే కాకుండా భారతదేశంలోని అనేక నగరాల్లో ధార్మిక కార్యకలాపాలను నిర్వహించడంలో మాకు సహాయపడింది. లాక్ డౌన్ సమయంలో, జీవనోపాధిని కోల్పోయిన పేదలు మరియు రోజువారీ వేతన జీవులకు రేషన్ మరియు శానిటరీ వస్తువుల వంటి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడానికి వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాల నుండి వాలంటీర్లు సహాయం అందిచారు.
  • ప్రకృతి వైపరీత్యాల సహాయ కార్యక్రమాలలో, అస్సాం, తమిళనాడు, మరియు పశ్చిమ బెంగాల్‌లలో వరదలు మరియు తుఫాను బాధితులకు వై.ఎస్.ఎస్. వాలంటీర్లు సహాయం అందిచారు. ప్రియమైన గురుదేవుని జన్మోత్సవం సందర్భంగా, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, లెప్రసీ కాలనీలు మొదలైన వాటికి దుప్పట్లు పంపిణీ చేయడం, ఆహారం అందించడం వంటివి చేసారు.
ద్వారహట్ ఆశ్రమం సమీపంలోని గౌనాడ్, తాలి గౌనాడ్ మరియు మాదిగర్ లో దుప్పట్లు పంపిణీ చేశారు
రాంచీలోని అనాథాశ్రమానికి బహుమతులు పంపిణీ చేశారు
దక్షిణేశ్వర్‌, అరియాదహ ప్రాంతంలో పేద ప్రజలకు, వై.ఎస్.ఎస్. 400 దుప్పట్లు పంపిణీ చేసింది

వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు ధ్యాన కేంద్రాల నిర్వహణ 

మీ అచంచలమైన మద్దతు మాకు ఎటువంటి ఆటంకం లేకుండా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలను నిర్వహించేందుకు వీలు కల్పించింది. పరిస్థితులు అనుమతించిన తర్వాత మీరు మమ్మల్ని సందర్శించినప్పుడు మీ అందరి కోసం వాటిని సిద్ధంగా ఉంచడానికి సహాయపడింది.

మేము సేవకుల సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాల పెంపుదల ప్రాజెక్ట్‌పై కూడా పని చేయగలిగాము మరియు రాంచీలోని గురుసేవధామ్‌ లోని మూడు వసతిగృహాలను 27 అమర్చిన గదులుగా మార్చి గురూజీ రాంచీ ఆశ్రమంలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న సేవకుల కోసం పూర్తి చేసాము.

మీ సహాయమునకు ఎంతో కృతజ్ఞులం

మీ ఉదారమైన ఆర్థిక సహాయానికి వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో మా అందరి నుండి ప్రగాఢమైన కృతజ్ఞతలు. గురుదేవుని లక్ష్యం ముందుకు తీసుకెళ్లడం, ఆయన బోధనలను ప్రచురించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందించడం, ఆశ్రమాలను నిర్వహించడం మరియు ధార్మిక కార్యక్రమాలు చేయడంలో మీ విరాళం జాగ్రత్తగా ఉపయోగించబడుతుందని హామీ ఇచ్చుచున్నాము. మీరు మన గురుదేవుని ఆత్మ విముక్తి మరియు ఆత్మశాంతి కలుగజేసే బోధలను వ్యాప్తి చేసే ఈ పవిత్ర లక్ష్యానికి మరింత సహకారం అందించగలిగితే, దయచేసి సంవత్సరాంతపు విరాళాన్ని అందించడాన్ని పరిగణించండి, ఇది మేము రాబోయే నెలల్లో ముందుగా ప్రణాళికను చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది మీకు మరింత సౌకర్యవంతంగా ఉంటే, దయచేసి వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నెలవారీ పునరావృత విరాళాల యొక్క కొత్తగా జోడించిన సౌకర్యాన్ని పరిగణించండి: https://donateyss.org/

మీరు మీ భక్తి సమర్పణల ద్వారా గురుదేవుని యొక్క దివ్య కార్యానికి సహాయం చేసినప్పుడు, అది ప్రార్థనలు, లేదా భౌతిక సహాయం లేదా, ఆధ్యాత్మిక క్రమశిక్షణను అభ్యసించడం ద్వారా చేసినా, మీరు పంపినవి అనివార్యంగా మీకు అనేక రెట్లు తిరిగి వస్తాయని మరియు మీ జీవితంలో ఒక ఆశీర్వాదంగా వ్యక్తమవుతాయని తెలుసుకోండి.

మీరు ఎల్లప్పుడూ మహానుభావుల అనుగ్రహంతో మరియు సర్వవ్యాప్తమైన దీవెనలతో చుట్టుముట్టబడి ఉండెదరు. ఈ మార్గంలో మీ ఉత్సాహం క్షీణించకుండా ఉండి మరియు క్రియాయోగం యొక్క ఆత్మ-మేల్కొలుపు శాస్త్రం ద్వారా మీరు కోరుకునే దివ్య ప్రేమను కనుగొనెదరు.

దివ్య స్నేహంతో,

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

ఇతరులతో షేర్ చేయండి