త్వరలో ప్రారంభం కానున్న వై.ఎస్.ఎస్. సేవక్ లీగ్

28 జనవరి, 2021

స్వామి చిదానంద గిరి గారి నుండి ఒక సందేశం

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబాన్ ల యొక్క నూతన సమితి

నూరు సంవత్సరాల క్రితం, 1920లో, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు వారిపై నియుక్తమైన దివ్య లక్ష్యమైన భారతదేశపు ప్రాచీన క్రియాయోగ విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి తమ ప్రియమైన భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్‌కు బయలుదేరి వెళ్ళారు. ముప్పై సంవత్సరాలకు పైగా, 1952లో తమ మహాసమాధి వరకు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో, నిర్విరామంగా మరియు ఆనందంగా స్వచ్ఛమైన దివ్య ప్రేమతో శ్రమించారు.

పరమహంసగారి ఈ అంతర్జాతీయ కార్యక్రమం యొక్క శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని, వారి ప్రపంచవ్యాప్త లక్ష్య అభివృద్ధిలో మరొక ప్రధాన మైలురాయిని పరిచయం చేయడం ఒక ప్రత్యేక ఆనందం. 2020 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచ స్నాతకోత్సవ ముగింపులో నేను వివరించినట్లుగా, ఒక ప్రణాళిక పరంగా గాఢమైన నిబద్ధతను ప్రతిజ్ఞా రూపంగా చేయాలనుకునే వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. క్రియాబన్ శిష్యుల ప్రపంచ సమితిని రూపొందించడం. ఇందులో భాగంగా 1) ఆధ్యాత్మిక ఆదర్శాల (సాధన) చుట్టూ తమ దైనందిన జీవితాలను నిర్మించుకోవడం కోసం, మరియు 2) వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థకు సేవ చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి వారి సమయాన్ని మరియు వనరులను ఉచితంగా ఇవ్వడం. యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాలో దీనిని వై.ఎస్.ఎస్. సేవక్ లీగ్ అని పిలుస్తారు; మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్‌లో దీనిని ఎస్.ఆర్.ఎఫ్. వాలంటరీ లీగ్ ఆఫ్ లే డిసైపుల్స్ అని పిలుస్తారు.

మన గురువుగారు వారి జీవితపు చివరి సంవత్సరాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. యొక్క క్రియాబాన్ భక్తులు గురువుగారి కార్యాచరణ పెరుగుదల మరియు పురోగతిలో చురుకుగా పాల్గొనగలిగేటందుకు వీలుగా ఒక సరియైన పద్ధతిని ఏర్పాటు చేయడం కోసం చాలా సమయాన్ని వెచ్చించారు. ఇప్పుడు ఆయన కల ఫలించబోతోంది.

శ్రీ పరమహంస యోగానందగారి చివరి చిరునవ్వు

“మీ వంతు పని చేయండి. మీ మాటలు మరియు మీ చేతల యొక్క ఉదాహరణల ద్వారా, మీ భక్తి ద్వారా సెల్ఫ్-రియలైజేషన్ [యోగదా సత్సంగ] యొక్క కార్యాలని వ్యాప్తి చేయండి. నాకు ఈ పని భారమౌతుంది అని కాదు – సహాయం కోరే వారందరికీ సహాయం చేయాలని నేను ఆత్రుతగా ఉన్నాను; మరియు ఈ బోధనలను మీ ఆధ్యాత్మిక ప్రకంపనల ద్వారా ఇతరులకు వ్యాప్తి చేయడం మీ కర్తవ్యం, తద్ద్వారా వారు కూడా ఈ సత్యాన్ని పొందగలరు.”

కాలపట్టి తాజా సమాచారం: 2021 సేవక్ లీగ్ ప్రారంభం

జనవరి 31, 2021న వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించాలనేది మా ప్రస్తుత ప్రణాళిక. ఈ వేసవి నాటికి వై.ఎస్.ఎస్. సేవక్ లీగ్ కి సంబంధించి పూర్తి వెబ్‌సైట్‌ను కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము మరియు ఆ సమయంలో చేరడానికి దరఖాస్తులను స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చేరిన వారికి శిష్యరికం, సాధన (ఆధ్యాత్మిక అభ్యాసం), మరియు గురు-సేవ (గురువుకు సేవ), మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. మార్గం గురించి మేము స్ఫూర్తిదాయకమైన కరదీపికను కూడా ప్రచురిస్తాము.

ఈలోగా, ఈ నూతన కార్యక్రమం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన చరిత్రలో కొన్నింటిని మీతో పంచుకోవడానికి, నేను సేవక సమితి యొక్క నూతన బ్లాగ్ ద్వారా పరిచయం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాను (దీనిలో ఇదే మొదటి పోస్ట్).

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సేవక కార్యక్రమ అభివృద్ధిపై మరింత సమాచారం

మేము గత రెండున్నర సంవత్సరాల నుంచి పరమహంస యోగానందగారి ప్రపంచవ్యాప్త కార్యక్రమాలలో, సన్యాసులకు సేవ చేయడంలో వై.ఎస్.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. భక్తుల కోసం మేము కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించాము అని మీలో చాలా మందికి తెలిసిన విషయమే. మన గురువుగారి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో సహాయపడటానికి మన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంలోని విస్తారమైన ప్రతిభను మరింత విస్తృతంగా ఉపయోగించడం ఈ లక్ష్యాలలో ఒకటి. నా దర్శకత్వంలో, చిరకాల గృహస్థ శిష్యులతో కూడిన ఒక చిన్న సమూహం కలిసి, చివరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరమహంసగారి భక్తుల వర్చువల్ కమ్యూనిటీ అయిన యోగానంద సేవను ఏర్పాటు చేసారు. సన్న్యాసాశ్రమంలో లేనటువంటి గురువుగారి అనుచరుల కోసం కొత్త సేవా అవకాశాలను అన్వేషించడానికి మరియు అభివృద్ధి చేయడానికి వారు అనేక “ప్రయోగాత్మక కార్యక్రమాలను” చేపట్టారు. “యోగానంద సేవ” ద్వారా అనేక ముఖ్యమైన ప్రాజెక్ట్‌లకు విజయవంతంగా నిధులు సమకూర్చబడ్డాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించబడి మరియు నిర్వహించబడుతున్నాయి, వీటిలో:

  • సెల్ఫ్-రియాలైజేషన్ ఫెలోషిప్ ఆన్‌లైన్ మెడిటేషన్ కేంద్రం — డజన్ల కొద్దీ సమూహ ధ్యానాలు మరియు ఆధ్యాత్మిక అధ్యయనాలు వారానికొకసారి బహుళ భాషలలో, మరియు వివిధ సమయ మండలాల్లో భక్తులు అలాగే సన్యాసుల నేతృత్వంలో నిర్వహించబడ్డాయి. వీటికి 80 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది మంది హాజరయ్యారు. (యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇదే విధమైన ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం కూడా ఇటీవలే అభివృద్ధి చేయబడి, జనవరి 31, 2021న ప్రారంభించబడింది.)
ఆన్‌లైన్ ధ్యాన యోగా కేంద్రం
ఆన్‌లైన్ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు
  • కాన్వొకేషన్ మరియు పాఠాల సభ్యత్వం వంటి ఎస్.ఆర్.ఎఫ్. ఆన్‌లైన్ కార్యక్రమాలకు, ఒక్కొక్కరిగా భక్తులకు సాంకేతిక సహాయాన్ని అందించడానికి అంతర్జాతీయ హెల్ప్ డెస్క్ స్థాపించబడింది.
  • స్వచ్ఛందంగా సేవలందించాలనుకునే భక్తుల యొక్క లభ్యత మరియు నైపుణ్యాల గురించిన సమాచారంతో సహా డేటాబేస్‌ను నిర్వహించడానికి ఆన్‌లైన్ వాలంటీర్ పోర్టల్ తయారుచేయబడింది. దీనిద్వారా భక్తులు మన గురువుగారి లక్ష్యానికి వారి సేవలను అందించడానికి ఉత్తమమైన మార్గాన్ని కనుగొనవచ్చు.
  • అనేక ఇతర ప్రాజెక్ట్‌ల కోసం ప్రాథమిక ప్రణాళిక కూడా తయారు చేయబడుతుంది.

అనేక విధాలుగా, “యోగానంద సేవ” అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అంకితభావంతో ఉన్న భక్తుల సేవలను మరింత మెరుగ్గా సమన్వయం చేయడానికి డిజిటల్ నెట్‌వర్కింగ్ యొక్క కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడానికి (అత్యంత విజయవంతమైన!) ప్రారంభ దశ ప్రయోగం. తత్ఫలితంగా, గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి సేవా కార్యక్రమాలలో స్ఫూర్తిదాయకమైన పెరుగుదలను మేము చూశాము.

వారు ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. కార్యకలాపాలకు మద్దతివ్వడానికి యోగానంద సేవను చేపట్టాలని నేను కోరిన వివిధ ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 2020లో ఊహించని మహమ్మారి వల్ల లాక్ డౌన్ సమయంలో ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్‌లో సమృద్ధిగా అందించగలిగిన స్ఫూర్తిదాయకమైన విషయాలకి మరియు కార్యక్రమాలకి ఈ ప్రాజెక్ట్‌లు చాలా దోహదపడ్డాయి. కాబట్టి ఇది ఇంతకంటే సమయానుకూలంగా ఉండేది కాదు. ఈ ప్రారంభ “ప్రయోగాత్మక కార్యక్రమాల” ద్వారా పొందిన అనుభవం మేము తదుపరి దశకు వెళ్ళి అధికారికంగా వై.ఎస్.ఎస్. సేవక్ లీగ్ ని ప్రారంభించినప్పుడు విలువైనది అవుతుంది.

సేవక్ లీగ్ పట్ల పరమహంస యోగానందగారి దూరదృష్టి

గురువుగారి కార్యాలు పేరుగుతున్నకొద్దీ, భక్త సేవకుల విస్తారిత పాత్ర యొక్క ప్రాముఖ్యత ప్రధానాంశంగా మారుతుందని నా నమ్మకం. ఈ విషయమై గురుదేవుల యొక్క ఆలోచనను, మరియు చివరి సంవత్సరాలలో వారి ప్రథమ శిష్యులకి ఇచ్చినటువంటి లిఖితపూర్వక నిర్దేశాలను, నేను చాలా లోతుగా పరిశీలించాను.

వై.ఎస్.ఎస్.కు ఒక సుదీర్ఘ సంప్రదాయం ఉంది, అది అంకితభావంతో, ప్రేమతో కూడిన సేవ ద్వారా పరమహంసగారి సంస్థ ఎదుగుదలకు సహకరించే భక్తులు. అలాంటి ఇద్దరు భక్తులు శ్రీ సచ్చినందన్ సేన్ (కుడి వైపు) మరియు శ్రీమతి రేణుకా సేన్ (ఎడమ వైపు), తర్వాత బ్రహ్మచారిణి మీరాబాయిగా పిలువబడ్డారు. వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో నివసించడానికి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ దయామాతగారిని (మధ్యలో) ఆహ్వానించారు, వారు యోగదా సత్సంగ సంగీత కళా భారతిని (సంగీత పాఠశాల) కనుగొనడంలో సహాయం చేసారు. ఈ ఫోటో 1961లో రాంచీలో తీయబడింది.

ఈ ప్రణాళికలను అమలు చేయడానికి మా గౌరవనీయులైన శ్రీ శ్రీ దయామాతగారు మరియు ఇతర మొదటి తరం శిష్యులు చేసిన కృషిని నేను సమీక్షించినప్పుడు, వెంటనే స్పష్టమైంది ఏమిటంటే, మన వద్ద పెంపొందించబడిన గురు-సేవ యొక్క స్ఫూర్తిని, మనం దశాబ్దాలుగా ఆశ్రమాలు మరియు కేంద్రాలు, మరియు యోగానంద సేవతో మా ఇటీవలి పనిలో మేము చురుకుగా ప్రయోగాలు చేస్తున్న డిజిటల్ కమ్యూనికేషన్ మరియు వాలంటీర్ కోఆర్డినేషన్ పద్ధతులతో కలపడానికి సమయం ఆసన్నమైంది అని. ఇది రాబోయే సంవత్సరాలలో వారి ఆధ్యాత్మిక జీవితంలో మరియు భగవంతుని పట్ల మరియు గురువు పట్ల (వారి సాధన) భక్తిలో భాగంగా — మన గురువుగారు, సమాజం కోసం ఊహించిన ఎదుగుదలలో అవసరమైన మరియు చాలా అర్థవంతమైన పాత్రను పోషించే నిజమైన ప్రపంచ సేవకుల సమితి ఏర్పడటానికి సాధ్యపడుతుంది.

గత కొన్ని నెలలుగా, ఈ నూతన ప్రపంచ ఉపక్రమానికి సహాయకారిగా ఉండాడానికి అవసరమైన సంస్థాగత పునాదులను అభివృద్ధి చేయడానికి నేను కలిసి పనిచేస్తున్న సీనియర్ ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తుల సమూహంలో గురుదేవుల యొక్క లక్ష్య దృష్టి పట్ల స్పష్టమైన అవగాహన స్ఫటికీకరించబడింది. ఈ ముఖ్యమైన పని ఎంతో వేగంగా సాగుతోంది, మరియు 2021లో కల్లా సభ్యత్వం కోసం కొత్త వై.ఎస్.ఎస్. సేవక్ లీగ్ మరియు ఎడ్.ఆర్.ఎఫ్. వాలంటరీ లీగ్‌లను తెరవడానికి మేము సిద్ధంగా ఉంటామని ఆసక్తిగా ఆశిస్తున్నాము.

రాబోయే ప్రపంచ నాగరికతకు సార్వత్రిక ఆధ్యాత్మికతను తీసుకురావాలనే గురువు గారి లక్ష్యానికి ప్రేమపూర్వకమైన సేవలో, మన గురువు యొక్క రెండవ శత సంవత్సరాల అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రారంభించడం ఎంతో పవిత్రమైన మార్గం! ఈ స్పూర్తిదాయకమైన ఉపక్రమం యొక్క అభివృద్ధి గురించి త్వరలో మీతోటి మరింత పంచుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను.

జై గురు!

—స్వామి చిదానంద గిరి

1963లో గురువుగారి హాలీవుడ్ దేవాలయంలో ఎస్.ఆర్.ఎఫ్. యొక్క లౌకిక శిష్య బృందంతో మాట్లాడుతూ, శ్రీ దయామాతగారు ఇలా అన్నారు:

“మనమందరం మన స్వంత మార్గంలో భగవంతుడిని సేవిస్తున్నాము – మేము ఒక విధంగా ఆశ్రమంలో ఉన్నాము, మరియు మీరు ప్రపంచంలో ముఖ్యమైన సమానమైన మార్గంలో ఉన్నారు. మీలాంటి సందేశకులు లేకుండా దేవుని సందేశం ప్రపంచానికి చేరదు. మీరు ఇతర వ్యక్తులతో పరిచయం ఉన్నవారు. మరియు ప్రధానంగా మీ ఉదాహరణ ద్వారా మరియు గురువుగారి బోధనలను అర్థం చేసుకోవడం ద్వారా మానవాళికి సేవ చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది.”

శ్రీ దయామాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంఘమాత

ఇతరులతో షేర్ చేయండి