తెలుగులో వై.యస్.ఎస్. సన్యాసుల నేతృత్వంలో జరిగే ఈ ఆన్‌లైన్ సాధనా సంగమంకు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈ ఆన్‌లైన్ సాధనా సంగమం భక్తుల ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మాత్రమే కాకుండా, గురుదేవుల బోధనలు మరియు ధ్యాన పద్ధతులపై వారి అవగాహన మరియు అభ్యాసాన్ని మెరుగుపరచడానికి కూడా ఒక అవకాశాన్ని అందిస్తుంది.

ఈ వారాంతపు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పూర్తిగా పాల్గొని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది తోటి భక్తులతో సామూహిక ధ్యానాలలో, స్ఫూర్తిదాయకమైన సత్సంగాలు మరియు కీర్తనలలో పాల్గొనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. YSS ధ్యాన పద్ధతులపై సమీక్ష తరగతులు YSS / SRF పాఠాల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి; కానీ సామూహిక ధ్యానాలు మరియు సత్సంగాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ప్రతి ధ్యానం తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ నిర్వహించబడుతుంది అయితే తరగతులు మరియు సత్సంగాలు తెలుగులో మాత్రమే ఉంటాయి.

కార్యక్రమం షెడ్యూల్

ఉదయం 6:10 నుండి 9:30 వరకు (IST)

స్వాగత సందేశం, శక్తిపూరణ వ్యాయామాలు తరువాత దీర్ఘ ధ్యానం మరియు కీర్తన

ఆన్‌లైన్ ధ్యానాలు అందరికీ అందుబాటులో ఉంటాయి.

సాధనా సంగమంలో పాల్గొనే వారందరికీ ఒక వై.యస్.ఎస్. సన్యాసి శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతారు

తరువాత ధ్యానం, శక్తిపూరణ వ్యాయామాల రికార్డ్ చేయబడిన వీడియోను అనుసరించడం ద్వారా కలిసి చేసే అభ్యాసంతో ప్రారంభమవుతుంది. దీని తరువాత వై.యస్.ఎస్. సన్యాసి నేతృత్వంలో ధ్యానం జరుగుతుంది. (గమనిక: శక్తిపూరణవ్యాయామాల తీరు యొక్క సూచన వీడియోలో అందించబడలేదు. దయచేసి వాటిని YSS / SRF పాఠాల నుండి నేర్చుకోండి.)

ధ్యాన సమావేశం ప్రారంభ ప్రార్థన మరియు పరిచయ వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. తరువాత స్ఫూర్తిదాయకమైన పఠనం, గీతాలాపన మరియు నిశ్శబ్ద ధ్యానం. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలు మారవచ్చు. కాని, సాధారణంగా 45 నిమిషాల నిడివి ఉంటాయి. పరమహంస యోగానందగారి యొక్క స్వస్థత ప్రక్రియ మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది. ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన మరియు స్వస్థత ప్రక్రియ తెలుగులో ఉంటాయి. అయితే, పఠనం మరియు గీతాలాపన తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటాయి.

ఈ కార్యక్రమం యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు చేయవద్దని మేము కోరుతున్నాము.

ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు (IST)

హాంగ్-సా ప్రక్రియ యొక్క సమీక్ష

పురాతనమైన మరియు శక్తివంతమైన ఈ హాంగ్-సా ప్రక్రియ మనస్సు యొక్క గుప్త ఏకాగ్రతా శక్తులను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. క్రమబద్ధమైన సాధన ద్వారా బాహ్య పరధ్యానం నుండి ఆలోచన మరియు శక్తిని ఉపసంహరించుకోవడం ఒకరు నేర్చుకుంటారు. తద్వారా వారు సాధించాల్సిన ఏదైనా లక్ష్యం లేదా పరిష్కరించాల్సిన సమస్యపై దృష్టి కేంద్రీకరించవచ్చు. లేదా విజయవంతమైన అభ్యాసం ఫలితంగా కలిగిన ఈ కేంద్రీకరించిన దృష్టిని అంతర్గతంగా ఉన్న దైవిక చైతన్యాన్ని గ్రహించడం కొరకు మళ్ళించవచ్చు.

YSS / SRF పాఠాలు విద్యార్థులు ఈ ధ్యాన ప్రక్రియ సమీక్ష తరగతికి మరియు పరమహంస యోగానందగారు బోధించిన క్రియాయోగ మార్గం యొక్క ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటైన ఈ ప్రక్రియ దశల వారీ సూచనలను స్వీకరించుటకు ఆహ్వానితులు.

ఈ తరగతి వై.యస్.ఎస్. / ఎస్ఆర్ఎఫ్ లెసన్స్ విద్యార్థులకు మాత్రమే. మీకు వై.యస్.ఎస్. / ఎస్ఆర్ఎఫ్ లెసన్స్ విద్యార్థి కావడానికి ఆసక్తి ఉంటే మరియు భారతదేశం, నేపాల్, శ్రీలంక, భూటాన్ లేదా మాల్దీవులులలో నివసిస్తుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర దేశాలలో నివసించేవారు, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ తరగతి యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు చేయవద్దని మేము కోరుతున్నాము.

మధ్యాహ్నం 1:30 నుండి 2:15 వరకు (IST)

ఒక యోగి ఆత్మకథ-సామూహిక అధ్యయనం మరియు ధ్యానం

శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ కు 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ప్రత్యేక సామూహిక అధ్యయనం మరియు ధ్యాన కార్యక్రమాన్ని అందిస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండే ఈ కార్యక్రమం ఒక ఆరంభ ప్రార్థన, భక్తిగీతం తరువాత నిశ్శబ్ద ధ్యాన సమయాలకు మధ్య మధ్య గురుదేవుల ఒక యోగి ఆత్మ కథ ఆడియో నుండి ఎంపిక చేసిన భాగాలు వినిపిస్తూ, చివరిగా ముగింపు ప్రార్థనతో పూర్తవుతుంది. ప్రశంశలందుకొన్న ఈ ఆధ్యాత్మిక గ్రంథరాజం నుండి గురుదేవుల వాక్యాలను విని, నిశ్శబ్దంగా మననం చేసుకొనే అవకాశాన్ని ఈ ప్రత్యేక కార్యక్రమం భక్తులకు కలిగిస్తుంది. ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీషు అధ్యయన గదులు అందుబాటులో ఉన్నాయి.

మధ్యాహ్నం 3:15 నుండి 4:00 వరకు (IST)

కీర్తన సెషన్

మా మునుపటి రిట్రీట్ల లో ఒక వై.యస్.ఎస్. సన్యాసి నేతృత్వంలో జరిగిన భక్తి గీతాలాపనలో చేరండి.

Paramahansa Yoganandaji says: “Sankirtans or musical gatherings are an effective form of yoga or spiritual discipline, necessitating intense concentration, absorption in the seed thought and sound. Because man himself is an expression of the Creative Word, sound exercises on him a potent and immediate effect. Great religious music of East and West bestows joy on man because it causes a temporary vibratory awakening of one of his occult spinal centres. In those blissful moments a dim memory comes to him of his divine origin.”

We ask that no recordings or screenshots of this class be made.

సాయంత్రం 5:00 నుండి 7:00 వరకు (IST)

శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానం

ఆన్‌లైన్ ధ్యానాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక రికార్డ్ చేసిన వీడియోను అనుసరించడం ద్వారా కలిసి చేయబడే శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసంతో మనం ప్రారంభిస్తాము. దీని తరువాత వై.యస్.ఎస్. సన్యాసి నేతృత్వంలో ధ్యానం జరుగుతుంది. (గమనిక: శక్తిపూరణ వ్యాయామాలు చేసే సూచనలు వీడియోలో అందించబడలేదు. దయచేసి వాటిని YSS / SRF పాఠాల నుండి నేర్చుకోండి.)

ధ్యాన సమావేశం ప్రారంభ ప్రార్థన మరియు పరిచయ వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. తరువాత స్ఫూర్తిదాయకమైన పఠనం, గీతాలాపన మరియు నిశ్శబ్ద ధ్యానం. నిశ్శబ్ద ధ్యానం యొక్క సమయాలు మారవచ్చు కాని సాధారణంగా 45 నిమిషాల నిడివి ఉంటాయి. పరమహంస యోగానంద గారి యొక్క స్వస్థత ప్రక్రియ మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది. ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన మరియు స్వస్థత ప్రక్రియ తెలుగులో ఉంటాయి. అయితే పఠనం మరియు గీతాలాపన తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటాయి.

ఈ తరగతి యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు చేయవద్దని మేము కోరుతున్నాము.

రాత్రి 8:00 నుండి 9:00 వరకు (IST)

స్ఫూర్తిదాయకమైన ప్రసంగం

YSS సన్యాసి ఆధ్యాత్మిక ఉపన్యాసానికి మాతో కలవండి. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది.
విషయం: “హానికరమైన మానసిక స్థితులను సరైన దృక్పథంతో జయించడం”
మీ అందరినీ ఈ ఉపన్యాసానికి బంధుమిత్ర సమేతంగా ఆహ్వానిస్తున్నాము.

ఉదయం 6:10 నుండి 9:30 వరకు (IST)

శక్తిపూరణ వ్యాయామాలతో కూడిన ధీర్ఘ ధ్యానం

ఆన్‌లైన్ ధ్యానాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. శక్తి పూరణ వ్యాయామాలు, రికార్డు చేసిన వీడియోలతో ప్రారంభించి, YSS సన్యాసి నిర్వహించే ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. (గమనిక: శక్తిపూరణ వ్యాయామాల తీరు యొక్క సూచన వీడియోలో అందించబడలేదు. దయచేసి వాటిని YSS/SRF పాఠాల నుండి నేర్చుకోండి.)

ధ్యాన కార్యక్రమం ఒక ప్రార్థన, స్వాగత వచనంతో ప్రారంభమవుతుంది. తరువాత స్ఫూర్తిపూర్వక పఠనం, గానం, నిశ్శబ్ద ధ్యానం జరుగుతాయి. నిశ్శబ్ద ధ్యాన కార్యక్రమం మామూలుగా 45 నిముషాలు ఉంటుంది కానీ మారవచ్చు. పరమహంస యోగానందగారి స్వస్థత ప్రక్రియ మరియు ముగింపు ప్రార్థనతో ధ్యానం ముగుస్తుంది. ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన మరియు స్వస్థత ప్రక్రియ హిందీలో ఉంటాయి, అయితే పఠనం మరియు గీతాలాపన హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటాయి.
ఈ కార్యక్రమం యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు తీసుకోవద్దని మేము కోరుతున్నాము.

ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు (IST)

శక్తిపూరణ వ్యాయామాల సమీక్ష

మనస్సును, శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్వశక్తితో పునరుజ్జీవింప చేసుకోవడం, ఉద్రిక్తత తొలగించుకోవడం, మరియు ధ్యాన సమయంలో ఉన్నత జాగృత స్థితులను చేరుకోడానికి సులభంగా శక్తిని అంతరంగంలోనికి మళ్ళించుకోడానికి అనువుగా శరీరాన్నిఎలా పరిశుద్ధిగా, బలంగా చేయాలో నేర్చుకోండి.

YSS / SRF పాఠాలు విద్యార్థులు ఈ శక్తిపూరణ వ్యాయామాల సమీక్షా తరగతికి మరియు పరమహంస యోగానంద గారు బోధించిన క్రియాయోగ మార్గం యొక్క ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటైన ఈ ప్రక్రియ దశల వారీ సూచనలను స్వీకరించుటకు ఆహ్వానితులు.

ఈ తరగతి వై.యస్.ఎస్. / ఎస్ఆర్ఎఫ్ లెసన్స్ విద్యార్థులకు మాత్రమే. మీకు వై.యస్.ఎస్. / ఎస్ఆర్ఎఫ్ లెసన్స్ విద్యార్థి కావడానికి ఆసక్తి ఉంటే మరియు భారతదేశం, నేపాల్, శ్రీలంక, భూటాన్ లేదా మాల్దీవులులలో నివసిస్తుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర దేశాలలో నివసించేవారు, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కార్యక్రమం యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు చేయవద్దని మేము కోరుతున్నాము.

మధ్యాహ్నం 3:00 నుండి 4:00 వరకు (IST)

ఓం ప్రక్రియ సమీక్ష

హాంగ్-సా ప్రక్రియ ద్వారా విద్యార్థి శరీరాన్ని సడలింపు చేసి, మనసును కేంద్రీకరించడం నేర్చుకున్న తరువాత, ఈ ఉన్నతమైన ఓం ధ్యాన ప్రక్రియ చైతన్యాన్ని శారీరక, మానసిక పరిమితులు దాటి, తనలోనున్న అనంతమైన అవ్యక్త శక్తిని ఆనందకరముగా తెలుసుకునేటట్లు చేస్తుంది.

YSS / SRF పాఠ విద్యార్థులు ఈ ధ్యాన ప్రక్రియ సమీక్ష తరగతికి మరియు పరమహంస యోగానందగారు బోధించిన క్రియాయోగ మార్గం యొక్క ముఖ్యమైన పద్ధతుల్లో ఒకటైన ఈ ప్రక్రియ దశల వారీ సూచనలను స్వీకరించుటకు ఆహ్వానితులు.

ఈ తరగతి వై.యస్.ఎస్. / ఎస్ఆర్ఎఫ్ లెసన్స్ విద్యార్థులకు మాత్రమే. మీకు వై.యస్.ఎస్. / ఎస్ఆర్ఎఫ్ లెసన్స్ విద్యార్థి కావడానికి ఆసక్తి ఉంటే మరియు భారతదేశం, నేపాల్, శ్రీలంక, భూటాన్ లేదా మాల్దీవులులలో నివసిస్తుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. ఇతర దేశాలలో నివసించేవారు, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కార్యక్రమం యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు చేయవద్దని మేము కోరుతున్నాము.

సాయంత్రం 5:00 నుండి 7:45 వరకు (IST)

శక్తిపూరణ వ్యాయామాలు, ధ్యానము, మరియు ముగింపు సత్సంగము

ఆన్‌లైన్ ధ్యానాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. రికార్డు చేసిన వీడియోలతో కూడిన శక్తిపూరణ వ్యాయామాలతో ప్రారంభించిన తరువాత, YSS సన్యాసి నిర్వహించే ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. (గమనిక: శక్తిపూరణ వ్యాయామాల తీరు యొక్క సూచన వీడియోలో అందించబడలేదు. దయచేసి వాటిని YSS/SRF పాఠాల నుండి నేర్చుకోండి.)

ధ్యాన కార్యక్రమం ఒక ప్రార్థనతో ప్రారంభమవుతుంది. తరువాత స్ఫూర్తిపూర్వక పఠనం, గానం, నిశ్శబ్ద ధ్యానం జరుగుతాయి. నిశ్శబ్ద ధ్యాన కార్యక్రమం మామూలుగా 45 నిముషాలు ఉంటుంది, కానీ మారవచ్చు. ముగింపు సత్సంగము (సుమారు 30 నిముషాలు), మరియు పరమహంస యోగానందగారి స్వస్థత ప్రక్రియ, ముగింపు ప్రార్థనతో కార్యక్రమం ముగుస్తుంది. ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన మరియు సత్సంగము తెలుగులో ఉంటాయి, అయితే పఠనం మరియు గీతాలాపన తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటాయి.

ఈ కార్యక్రమం యొక్క రికార్డింగ్‌లు లేదా స్క్రీన్‌ షాట్‌లు చేయవద్దని మేము కోరుతున్నాము.

ధ్యానము గది

ప్రపంచపు నలుమూలలకూ చెందిన భక్తులతో కలిసి నిశ్శబ్ద ధ్యానంలో పాల్గొనండి

ధ్యానము గదిలోకి ఎలా ప్రవేశించాలి

జూమ్ ద్వారా ఇతర భక్తులతో కలిసి నిశ్శబ్దంగా ధ్యానం చేయండి. ఇది నిశ్శబ్దంగా ఉండే ధ్యానమైనా, జూమ్ లో మీ వీడియో ఆన్ చేసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఆ విధంగా మీరు ఇతరులకు కనిపించగలరు. మీరు ధ్యానము చేసుకొనే గదిలోకి ప్రవేశించినప్పుడు, మీ సౌండ్ ఆటోమేటిక్ గా మ్యూట్ చెయ్యబడుతుంది అని దయచేసి గమనించగలరు.

జూమ్ ఎలా డౌన్లోడ్ చేసుకొని వాడాలో తెలుసుకోడానికి మా ఎలా పాల్గొనాలి? పేజీ కి వెళ్ళండి.

ధ్యానము గది తెరిచి ఉండు సమయాలు

ధ్యానము గది ఈ సమయాలలో తెరిచి ఉంటుంది (ఆన్ని సమయాలు IST లో):

శనివారం, మార్చి 27

ఉదయం 9:30 – 11:15
మధ్యాహ్నం 12:30 – 1:15
మధ్యాహ్నం 2:15 – 3:00
మధ్యాహ్నం 4:00 – 4:45
సాయంత్రం 7:00 – 7:45

ఆదివారం, మార్చి 28
ఉదయం 9:30 – 10:45
మధ్యాహ్నం 12:30 – 2:45
మధ్యాహ్నం 4:00 – 4:45

ఆన్-లైన్ వై.ఎస్.ఎస్. ధ్యాన పద్ధతుల పాఠాలకు ప్రవేశం

యోగదా సత్సంగ పాఠాలు నేర్చుకోండి!

ఆన్ లైన్ సాధనా సంగమం అందరికీ అందుబాటులో ఉంది. అయితే, వై.ఎస్.ఎస్. పద్ధతుల గూర్చిన ఆన్ లైన్ పాఠాలు: శక్తిపూరణ అభ్యాసాలు, హాంగ్-సౌ ఏకాగ్రత పద్ధతి, మరియు ఓం ధ్యాన పధ్ధతి – కేవలం యోగదా సత్సంగ పాఠాల విద్యార్థులకే లభ్యం. (సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ విద్యార్థులు కూడా ఆహ్వానితులే.)

మీరు విద్యార్థి కానిచో, పరమహంస యోగానంద గారు బోధించిన క్రియాయోగ విజ్ఞానానికి ముఖ్యమైన ఈ శక్తి వంతమైన పధ్ధతులు YSS పాఠాలలో పాల్గొనడం ద్వారా నేర్చుకోడానికి YSS పాఠాలకు ఇప్పుడే అప్లై చేయమని ఆహ్వానిస్తున్నాము.

సాంకేతిక సహాయం

సహాయం కావాలా?

వై.ఎస్.ఎస్. భక్తులు మాకు (0651) 6655 55 కి కి ఫోన్ చేయవచ్చు లేదా ఇక్కడ మీ ప్రశ్నలు సబ్మిట్ చెయ్యవచ్చు.

ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు సాంకేతిక సహాయం కొరకు ప్రశ్నలు ఎస్.ఆర్.ఎఫ్ ఆన్ లైన్ ధ్యాన కేంద్రానికి సబ్మిట్ చెయ్యవచ్చు లేదా +1 (760) 417-6080 కి ఫోన్ చెయ్యవచ్చు. (గమనిక: ISD ఫోన్ ఛార్జీలు పడవచ్చు.)