తెలుగులో వై.ఎస్.ఎస్. పాఠాల కొత్త సంచిక విడుదల
ఆత్మ-సాక్షాత్కారానికి సంబంధించిన యోగదా సత్సంగ పాఠాలు ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉన్నాయని మరియు ఈ తెలుగు ప్రాథమిక పాఠాల శ్రేణికి నమోదు ఇప్పుడు ప్రారంభమయినదని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము.
బోధనలలో అత్యంత ప్రధానమైన యోగదా సత్సంగ పాఠాలను ప్రపంచ నాగరికత కోసం ప్రపంచానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక దైవవిధిగా తీసుకురావడానికి తాను నియుక్తులైనట్లు పరమహంస యోగానందగారు భావించారు.
డిసెంబర్ 3 నుండి, మీరు మన డివోటీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఈ పాఠాల కోసం సభ్యత్వాన్ని పొందవచ్చు. మీకు డివోటీ పోర్టల్ ఖాతా లేనట్లయితే, దయచేసి ఇప్పుడే ఖాతాను ఏర్పాటు చేసుకోండి.
ఏవైనా సందేహాల కోసం, దయచేసి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9:00 నుండి సాయంత్రం 4.30 వరకు ఫోన్ (0651) 6655 555 ద్వారా వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించండి (భారత కాలమానం ప్రకారం), లేదా ఈ-మెయిల్ చేయండి: helpdesk@yssi.org.
తెలుగులో ఆధ్యాత్మిక ప్రసంగం
డిసెంబర్ 3, 2022 న, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా వై.ఎస్.ఎస్. పాఠాలు తెలుగులో విడుదల చేయబడ్డాయి. ఈ సందర్భంగా, వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి స్మరణానంద గిరి, పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనల నుండి “ఆనందమైన, సాఫల్యవంతమైన జీవితం కోసం క్రియాయోగ ధ్యానం” అనే అంశంపై తెలుగులో స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
దయచేసి గమనించండి: ఈ కార్యక్రమం తర్వాత వీక్షించడానికి, వై.ఎస్.ఎస్. వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉన్నది.
