వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే దీర్ఘ ధ్యాన కార్యక్రమాలు

(ప్రతి నెల మొదటి ఆదివారం)

ఉదయం 6.10 నుండి

– 9.30 వరకు

(భారతీయ కాలమానం)

ఈ కార్యక్రమం గురించి

నవీకరణ: ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ సమ్మేళనం సందర్భంగా వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ కార్యక్రమాలు నిలిపివేయబడతాయి

ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ సమ్మేళన కార్యక్రమం ఆగస్టు 14 నుండి 20 (ఆదివారం నుండి శనివారం) వరకు వారం రోజుల పాటు ఆన్‌లైన్ లో జరుగుతుంది.

జన్మాష్టమి స్మారకోత్సవ ధ్యానం (ఆగస్టు 19, శుక్రవారం, భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6.30 నుండి ఉదయం 8 వరకు) మినహా, వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఆగస్టు 15 సోమవారం నుండి ఆగస్టు 20 శనివారం వరకు నిలిపివేయబడతాయి. ఆగస్టు 21 ఆదివారం సాయంత్రం జరిగే ధ్యానంతో పునఃప్రారంభమవుతాయి.

ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం, సన్యాసులు ఇంగ్లీషులో మూడు గంటల పాటు నిర్వహించే దీర్ఘ ధ్యానాలలో చేరమని, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం, రికార్డు చేయబడిన శక్తిపూరణ వ్యాయామాలతో, తరువాత వై.ఎస్.ఎస్. సన్యాసి మార్గనిర్దేశ ధ్యానంతో మొదలవుతుంది.

ప్రారంభ ప్రార్థనతో ధ్యాన కార్యక్రమం మొదలవుతుంది, తరువాత స్ఫూర్తిదాయక పఠనం, తరువాత నియమిత కాలం పాటు కీర్తనలు మరియు నిశ్శబ్ద ధ్యానం ఉంటాయి. నిశ్శబ్ద ధ్యాన సమయంలో మార్పులు ఉండవచ్చు, కాని సాధారణంగా 45 నిమిషాల పాటు ఉంటుంది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ అభ్యాసంతో మరియు ముగింపు ప్రార్థనతో ధ్యాన కార్యక్రమం ముగుస్తుంది.

కార్యక్రమం వివరాలు (ఏప్రిల్ 1, 2022 నుండి)

ప్రతి నెల మొదటి ఆదివారం

ఇంగ్లీష్

ఉదయం 6.10 నుండి 9.30 వరకు

ఆన్‌లైన్ ధ్యాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. ధ్యాన కార్యక్రమంలో చేరడానికి, క్రింద ఇచ్చిన జూమ్ లింక్ లేదా యు ట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి.

దయచేసి గమనించండి: అదే రోజు (ఆదివారం) రాత్రి 10 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం), రికార్డు చేయబడిన ఈ ధ్యాన కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

Share this on