యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాల ఉద్దేశం ఏమిటంటే దేవునితో అనుసంధానం పొందడం. తండ్రి పేరు మీద భక్తులు సమూహముగా ఏర్పడినప్పుడు, అది ఆయనకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీకు తెలియదు.
— శ్రీ పరమహంస యోగానంద
31 జనవరి 2021వ తేదీన వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరిగారు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ఆన్‌లైన్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి, వై.ఎస్.ఎస్. భక్తులకు మరియు స్నేహితులకు సామూహిక ధ్యానం ద్వారా అనుభవించే ఆశీస్సులను, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర వ్యక్తులతో పంచుకొనే అవకాశాన్ని, సహవాసాన్ని అది కలుగజేస్తోంది.
వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించే ఆన్‌లైన్ ధ్యానం కోసం మంగళవారం సాయంత్రం మాతో చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం, రికార్డు చేయబడిన శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం యొక్క వీడియోతో ప్రారంభమవుతుంది, ఆ తరువాత వై.ఎస్.ఎస్. సన్యాసి మార్గనిర్దేశం చేసే ధ్యానం ఉంటుంది.
ప్రారంభ ప్రార్థన, పఠనం మరియు విశ్వగీతం పాడడంతో ధ్యాన కార్యక్రమం ప్రారంభమవుతుంది, తరువాత నియమిత భాగాలుగా మార్గదర్శక ధ్యానం మరియు పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ మరియు ముగింపు ప్రార్థనతో ముగుస్తుంది.
ధ్యాన సమయం వివరాలు
ప్రతి నెల మొదటి, మూడవ మరియు ఐదవ (ఉన్నట్లయితే) మంగళవారం
ఇంగ్లీష్
సాయంత్రం 6.10 నుండి 7.30 వరకు
ప్రతి నెల రెండవ మరియు నాల్గవ మంగళవారం
హిందీ
సాయంత్రం 6.10 నుండి 7.30 వరకు
ఈ ధ్యాన కార్యక్రమాలలో చేరడానికి, క్రింద ఇచ్చిన జూమ్ లింక్ లేదా యు ట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయండి
దయచేసి గమనించండి: ప్రత్యక్ష ప్రసారం జరిగిన 24 గంటల వరకు, అనగా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు (భారత కాలమాన ప్రకారం), రికార్డు చేయబడిన ఈ ధ్యాన కార్యక్రమాలు యు ట్యూబ్ లో అందుబాటులో ఉంటాయి.

మీరు వీటిని చదవడానికి ఇష్టపడవచ్చు: