మహావతార్ బాబాజీ

మహావతార్ బాబాజీ

మహావతార్ బాబాజీగారి జననము మరియు జీవితము గురించి మనకు చరిత్రలో ఎటువంటి వ్యాఖ్యలు లేవు. ఈ అమరులైన అవతార పురుషులు ఎన్నో సంవత్సరాలు భారతదేశంలోని హిమాలయ పర్వతాలలోని ఏకాంత పర్వత ప్రదేశాలలో నివసిస్తూ, అతి అరుదుగా, కృపాపాత్రులైన చాలా కొంతమంది భక్తులకు దర్శనం ఇచ్చేవారని పరమహంస యోగానందగారు తన ఒక యోగి ఆత్మకథలో తెలిపారు.

మహావతార్ బాబాజీగారే అంధయుగాల్లో మరుగున పడిపోయిన శాస్త్రీయమైన క్రియాయోగ ప్రక్రియను ఈ యుగంలో పునరుద్ధరించారు. తన శిష్యులైన లాహిరీ మహాశయులకు క్రియాయోగమును ప్రసాదిoచేప్పుడు బాబాజీ ఇలా అన్నారు, “ఈ పంధొమ్మిదో శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ళ కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తర పతంజలీకీ, క్రీస్తుకూ, సెయింట్ జాన్ కూ, సెయింట్ పాల్ కూ తదితర శిష్యులకూ తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే.”

1920వ సంవత్సరంలో పరమహంస యోగానందులు అమెరికా వేళ్ళే కొంత సమయం ముందు, మహావతార్ బాబాజీ యోగానందులవారి కలకత్తా ఇంటికి వచ్చారు, అక్కడ ఆ యువ సన్యాసి, తాను చేపట్టబోయే కార్యానికి ఆ భగవంతుని దివ్య హామీ కొరకై దీర్ఘంగా ప్రార్థిస్తున్నారు. అప్పుడు బాబాజీ ఇలా అన్నారు, “నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు, భయపడకు, నీకు రక్ష ఉంటుంది. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే.”

మహావతార్ బాబాజీ గురించి ఇంకా చదవండి: బాబాజీ, ఆధునిక భారతావణి యోగి క్రీస్తు

మహావతార్ బాబాజీ నుండి ఒక దీవెన

Share this on

This site is registered on Toolset.com as a development site.