పరమహంస యోగానందగారి ద్వారా ధ్యానం మరియు క్రియాయోగం

పరమహంస యోగానందగారి క్రియాయోగం

ధ్యానం అంటే ఏమిటి?

ధ్యానం అనేది ఆత్మను అనంతమైన పరమాత్మ లేదా భగవంతునితో తిరిగి కలిపే శాస్త్రము. క్రమంగా మరియు గాఢంగా ధ్యానం చేయడం ద్వారా, మీ ఆత్మను మీరు మేల్కొల్పుతారు — మీ అంతరంగంలో ఉన్న అమరమైన, ఆనందకరమైన దివ్య చైతన్యము. ధ్యానయోగం అనేది మన ఆత్మ యొక్క అనంతమైన సామర్థ్యాన్ని తెరవడానికి ప్రతి పర్యాయము — నిరూపితమైన మార్గం. ఇది అస్పష్టమైన మానసిక ఆలోచనా ప్రక్రియ లేదా తాత్విక విచారణ కాదు. ఇది జీవిత పరధ్యానాల నుండి దృష్టిని విముక్తి చేయడానికి ప్రత్యక్ష సాధనం, ఇది మన నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా చేసే అల్లకల్లోలమైన మరియు చంచలమైన ఆలోచనలను నిశ్చలంగా ఉంచుతుంది – మన నిజమైన అద్భుతమైన దైవత్వం. ధ్యానం యొక్క క్రమశిక్షణ ద్వారా, ఆంతర్గత ఏకాగ్రతను సాధించడం మనం నేర్చుకుంటాము, స్థిరమైన శాంతి మరియు ఆనంద కేంద్రాన్ని కనుగొంటాము.

మీరు ధ్యానంలో క్రమంగా పురోగమిస్తున్నప్పుడు, ఆత్మ నుండి వచ్చే, నిరంతరం పెరుగుతున్న అంతర్గత శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. అత్యంత ఘనమైన స్థితిలో, మీ ఆత్మ దేవునితో తన సంపూర్ణ ఏకత్వాన్ని తెలుసుకొంటుంది. పరమానందము, అధిచైతన్యము, ఆనందకరమైన దివ్యానుసంధానము — ఇదే ధ్యానము యొక్క లక్ష్యము, దీనినే సమాధి అంటారు.

క్రియాయోగ శాస్త్రంలో భాగంగా శక్తివంతమైన ధ్యాన పద్ధతులను పరమహంస యోగానందగారు బోధించారు. ఈ ప్రక్రియలు యోగదా సత్సంగ పాఠాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ధ్యానం యొక్క అత్యున్నత ప్రక్రియలను నేర్చుకుని మరియు దాని నుండి ప్రయోజనం పొందాలనుకునే వారెవరైనా, ఈ పాఠాలు అమూల్యమైన సాధనమని మరియు జీవితకాల ఆదరువు అని తెలుసుకుంటారు.

యోగదా సత్సంగ పాఠాల కోసం మీరు ఇంకా నమోదు చేసుకోనట్లయితే, ధ్యానం ఎలా చేయాలి అనే దానిపై కొన్ని ప్రాథమిక సూచనలను ఈ పేజీలలో మీరు తెలుసుకుంటారు, ధ్యానం ద్వారా కలిగే శాంతి మరియు దైవిక చైతన్యమును అనుభవించడం ప్రారంభించడానికి, వీటిని వెంటనే ఉపయోగించవచ్చు.

ధ్యానం యొక్క ప్రయోజనాలు

ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. క్రమమైన సాధన ద్వారా, ఒకరి శరీరం, మనస్సు మరియు ఆంతరిక చైతన్యంలో సూక్ష్మమైన పరివర్తనలు కలుగుతాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని వెంటనే అనుభవంలోకి వస్తాయి; మరికొన్ని క్రమంగా వెల్లడవుతాయి మరియు స్పష్టంగా కనిపించడానికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు.

ఈ ఫలితాలు హృదయపూర్వకమైన ప్రయత్నంతో మరియు జీవితపు అత్యున్నత లక్ష్యాన్ని సాధించే వరకు, సంకల్పాన్ని సంఘటితం చేయడం ద్వారా కలుగుతాయి — నిత్య నవీన ఆనందం మరియు ఆత్మసాక్షాత్కారం ద్వారా భగవంతునితో ఐక్యత.

పరమహంస యోగానందగారి రచనల నుండి:

"మీరు ధ్యానం చేయడం తప్ప మిగిలినవన్నీ చేయగలిగినప్పటికీ, ఆలోచనలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మరియు మీ మనస్సు భగవంతుని శాంతికి అనుశ్రుతిలో ఉన్నప్పుడు వచ్చే ఆనందానికి సమానమైన ఆనందాన్ని మీరు ఎప్పటికీ కనుగొనలేరు."

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
యోగదా సత్సంగ పాఠాలు

చెరువులో లిల్లీస్

ధ్యానం అనేది ఆత్మను అనంతమైన పరమాత్మ లేదా భగవంతునితో తిరిగి కలిపే శాస్త్రము. క్రమంగా మరియు గాఢంగా ధ్యానం చేయడం ద్వారా, మీ ఆత్మను మీరు మేల్కొల్పుతారు – మీ అంతరంగంలో ఉన్న అమరమైన, ఆనందకరమైన దివ్య చైతన్యము. ధ్యానయోగం అనేది మన ఆత్మ యొక్క అనంతమైన సామర్థ్యాన్ని తెరవడానికి ప్రతి పర్యాయము-నిరూపితమైన మార్గం. ఇది అస్పష్టమైన మానసిక ఆలోచనా ప్రక్రియ లేదా తాత్విక విచారణ కాదు. ఇది జీవిత పరధ్యానాల నుండి దృష్టిని విముక్తి చేయడానికి ప్రత్యక్ష సాధనం, ఇది మన నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా చేసే అల్లకల్లోలమైన మరియు చంచలమైన ఆలోచనలను నిశ్చలంగా ఉంచుతుంది – మన నిజమైన అద్భుతమైన దైవత్వం. ధ్యానం యొక్క క్రమశిక్షణ ద్వారా, ఆంతర్గత ఏకాగ్రతను సాధించడం మనం నేర్చుకుంటాము, స్థిరమైన శాంతి మరియు ఆనంద కేంద్రాన్ని కనుగొంటాము.

మీరు ధ్యానంలో క్రమంగా పురోగమిస్తున్నప్పుడు, ఆత్మ నుండి వచ్చే, నిరంతరం పెరుగుతున్న అంతర్గత శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. అత్యంత ఘనమైన స్థితిలో, మీ ఆత్మ దేవునితో తన సంపూర్ణ ఏకత్వాన్ని తెలుసుకొంటుంది. పరమానందము, అధిచైతన్యము, ఆనందకరమైన దివ్యానుసంధానము – ఇదే ధ్యానము యొక్క లక్ష్యము, దీనినే సమాధి అంటారు.

క్రియాయోగ శాస్త్రంలో భాగంగా శక్తివంతమైన ధ్యాన పద్ధతులను పరమహంస యోగానందగారు బోధించారు. ఈ ప్రక్రియలు యోగదా సత్సంగ పాఠాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. ధ్యానం యొక్క అత్యున్నత ప్రక్రియలను నేర్చుకుని మరియు దాని నుండి ప్రయోజనం పొందాలనుకునే వారెవరైనా, ఈ పాఠాలు అమూల్యమైన సాధనమని మరియు జీవితకాల ఆదరువు అని తెలుసుకుంటారు.

యోగదా సత్సంగ పాఠాల కోసం మీరు ఇంకా నమోదు చేసుకోనట్లయితే, ధ్యానం ఎలా చేయాలి అనే దానిపై కొన్ని ప్రాథమిక సూచనలను ఈ పేజీలలో మీరు తెలుసుకుంటారు, ధ్యానం ద్వారా కలిగే శాంతి మరియు దైవిక చైతన్యమును అనుభవించడం ప్రారంభించడానికి, వీటిని వెంటనే ఉపయోగించవచ్చు.

lillies on pond, Natureధ్యానం అనేది భగవంతుని సాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రం. ఇది ప్రపంచంలో అత్యంత ఆచరణాత్మకమైన శాస్త్రం. చాలా మంది ప్రజలు దీని విలువను అర్థం చేసుకుంటే మరియు దీని ప్రయోజనకరమైన ప్రభావాలను అనుభవించినట్లయితే ధ్యానం చేయాలని కోరుకుంటారు. భగవంతుని ఎరుకను స్పృహతో సాధించడం మరియు ఆయనతో ఆత్మ యొక్క శాశ్వతమైన ఏకత్వాన్ని పొందడమే ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం. సృష్టికర్త యొక్క సర్వవ్యాపకత్వం మరియు సర్వశక్తిమత్వానికి, పరిమిత మానవ సామర్థ్యాలను ఉపయోగించడం కంటే ఎక్కువ ప్రయోజనం మరియు ప్రయోజనకరమైన విజయం ఏముంటుంది? దైవ-సాక్షాత్కారం, ధ్యానం చేసేవారికి దేవుని శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి మరియు జ్ఞానం యొక్క దీవెనలను ప్రసాదిస్తుంది.

ధ్యానం ఏకాగ్రతను దాని అత్యున్నత రూపంలో ఉపయోగిస్తుంది. ఏకాగ్రత అనేది దృష్టిని పరధ్యానం నుండి విముక్తి చేయడం మరియు ఆసక్తి ఉన్న ఏదైనా ఆలోచనపై దృష్టి పెట్టడం. ధ్యానం అనేది ఏకాగ్రత యొక్క ప్రత్యేక రూపం, ఇందులో అవిశ్రాంతత నుండి శ్రద్ధ విముక్తి పొంది భగవంతునిపై కేంద్రీకరించబడుతుంది. కాబట్టి, ధ్యానం భగవంతుడిని తెలుసుకోవటానికి ఉపయోగించే ఏకాగ్రత…

దేవుని ఉనికికి మొదటి రుజువు అనిర్వచనీయమైన శాంతి. ఇది మానవులు ఊహించలేని ఆనందంగా పరిణామం చెందుతుంది. మీరు సత్యం మరియు జీవితం యొక్క మూలాన్ని తాకినప్పుడు, ప్రకృతి అంతా మీకు ప్రతిస్పందిస్తుంది.

“లోపల భగవంతుడిని కనుగొన్నప్పుడు, మీరు ఆయనను బయట, వ్యక్తులందరిలోను మరియు అన్ని పరిస్థితులలోను కనుగొంటారు.”

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద,
మెటాఫిజికల్ మెడిటేషన్స్

ఇతరులతో షేర్ చేయండి