కర్మ యోగం మరియు క్రియా యోగం: ఆధ్యాత్మిక విజయం కోసం బాహ్య మరియు అంతర్గత చర్యల యొక్క శక్తిని ఉపయోగించడం

పరమహంస యోగానందగారి జ్ఞాన-వారసత్వము నుండి ఎంపిక చేయబడ్డవి

యోగా అనేది సరైన చర్య యొక్క కళ

యోగా అనేది భగవంతుని చైతన్యంతో ప్రతిదీ చేసే కళ. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, మీరు పని చేస్తున్నప్పుడు కూడా, మీ ఆలోచనలు నిరంతరం ఆయనలో లంగరు వేయబడి ఉండలి.

లోతైన ధ్యానంలో దేవునితో ప్రతిరోజూ సంభాషించండి మరియు ఆయన ప్రేమ మరియు మార్గనిర్దేశాన్ని మీ కర్తవ్య కార్యకలాపాలన్నింటిలో తీసుకువెళ్లడం, శాశ్వత శాంతి మరియు సంతోషానికి దారితీసే మార్గం.

భగవంతుని సంతోషపెట్టడానికే మీరు చేస్తున్నారనే స్పృహతో మీరు పని చేస్తే, ఆ చర్య మిమ్మల్ని ఆయనతో ఐక్యం చేస్తుంది. కావున మీరు ధ్యానంలో మాత్రమే భగవంతుని కనుగొనగలరని ఊహించవద్దు. భగవద్గీత బోధిస్తున్నట్లుగా ధ్యానం మరియు సరైన కార్యాచరణ రెండూ అవసరం. ఈ లోకంలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా భగవంతుని తలచుకుంటే మానసికంగా ఆయనతో ఐక్యం అవుతారు.

భగవంతునిలో ఐక్యముగా ఉండి, పనిచేయడం ఈ ప్రపంచంలో మనము ప్రావీణ్యం పొందవలసిన గొప్ప కళ. దైవ చైతన్యముతో అన్ని కార్యాలను కొనసాగించడమే పరమ యోగం.

కర్మ యోగ: ఆధ్యాత్మిక చర్య యొక్క మార్గం…

నిస్వార్థ కార్యాచరణ ద్వారా ఆత్మను భగవంతునితో ఏకం చేసే మార్గం కర్మ యోగ మార్గం.

ధ్యానం మరియు మీరు చేసే ప్రతి పని భగవంతుని కోసమే అనే ఆలోచనతో పని చేయడం ఈ రెండు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం—అదే కర్మ యోగం. ధ్యానంలో ఉన్నప్పుడు మీరు భగవంతుని శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, మీరు ఇకపై శరీరంతో ముడిపడి ఉండరు మరియు మీరు ఆయన కోసం పని చేయాలనే ఉత్సాహంతో నిండిపోతారు. మీరు దేవుని ప్రేమికులుగా మరియు సోమరిగా ఉండలేరు. భగవంతుడిని ధ్యానిస్తూ మరియు ప్రేమించే వ్యక్తి ఎల్లప్పుడూ ఆయన కోసం మరియు ఇతరుల కోసం చురుకుగా ఉంటాడు.

… లాభం కోసం స్వార్థపూరిత అనుబంధం లేకుండా
మీ కార్యకలాపాలు మీకు మరియు మీ ప్రియమైనవారి కోసం భౌతిక ప్రయోజనాల కోసం డబ్బు సంపాదించడం లేదా స్వార్థపూరితమైన ఏదైనా కార్యాచరణపై మాత్రమే కేంద్రీకరించినప్పుడు, మీరు దేవుని నుండి దూరంగా వెళ్తరూ. ఈ విధంగా చాలా మంది వ్యక్తులు వారి వస్తు ఆకర్షణల మీద మరియు మరింత ఎక్కువ భౌతిక సముపార్జనల కోసం వారి కోరికలమీద వారి శక్తిని వినియోగము చేస్తారు. కానీ మీ చురుకైన శక్తి దేవునిని వెతకడానికి ఉపయోగించబడిన వెంటనే, మీరు ఆయన వైపుకు వెళతారు.

…కానీ మనస్సాక్షితో మరియు ఉత్సాహంతో
తన విధులను అజాగ్రత్తగా లేదా నిర్లక్ష్యంగా చేసేవాడు లేదా ఉత్సాహం లేకుండా ధ్యానం చేసేవాడు భగవంతుడిని సంతోషపెట్టలేడు లేదా ముక్తిని పొందలేడు. ఏదైనా చర్య — భౌతికము, మానసికము లేదా ఆధ్యాత్మికం — దాని ఫలంగా దైవ ఐక్యత కోరికతో నిర్వహించబడినప్పుడు అది “స్వార్థ” చర్య కాదు. బదులుగా, ఇది సృష్టిలోని దైవ ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుంది అనే అర్థంలో, ఇది పరిపూర్ణమైన చర్య.

క్రియా యోగ: చర్య యొక్క అత్యున్నత మార్గం

లోతైన ధ్యానం అనేది అత్యంత మానసిక చర్య—అత్యున్నత చర్య. క్రియా యోగా యొక్క దైవ శాస్త్రం ద్వారా, అధునాతన యోగి తన మనస్సును భౌతిక ఇంద్రియాల నుండి ఉపసంహరించుకోగలుగుతాడు మరియు వారి సూక్ష్మ శక్తులను ఆత్మ-విముక్తి కొరకు అంతర్గత కార్యకలాపాలకు మళ్ళించగలడు. అటువంటి ఆధ్యాత్మిక నిపుణుడు, భగవంతునితో నిజంగా ఏకం చేసే చర్య (కర్మ యోగమును) చేస్తాడు.

ఇది కర్మ లేదా చర్య యొక్క అత్యున్నత మార్గం.

అంతర్గత మరియు బాహ్య చర్యలు రెండూ అవసరం

ధ్యాన మార్గంలో అనంతునితో ప్రారంభ ప్రణయం భక్తుడిని ఏకపక్షంగా మార్చే అవకాశం ఉంది; అతను చర్య యొక్క మార్గాన్ని విడిచిపెట్టడానికి మొగ్గు చూపుతాడు. అయితే, విశ్వ చట్టం (కాస్మిక్ చట్టం), జీవితంలో తన ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి మానసిక సంకల్పంతో సంబంధం లేకుండా మనిషిని కార్యాచరణకు బలవంతం చేస్తుంది. ఈ సృష్టిలో భాగమైన వాడికి సృష్టి పట్ల బాధ్యతలు ఉంటాయి.

శ్రేష్ఠమైన భక్తులు కూడా పని చేయకపోతే ఆధ్యాత్మిక ఎత్తు నుండి పడిపోతారని హెచ్చరించే సందర్భాలు గ్రంథాల నిండా ఉన్నాయి…అంతిమ విముక్తి పొందే వరకు పనిచేయకపోవడం, మానసిక బద్ధకం, ఇంద్రియ అనుబంధం మరియు భగవంతుని చైతన్యమును కోల్పోవడానికి దారితీస్తుంది.

సమతుల్య జీవితం: జ్ఞానోదయానికి ఖచ్చిత మార్గం

ధ్యానం మరియు కార్యకలాపాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడమనే కష్టమైన పోరాటంలో, భగవంతుని చైతన్యంలో గొప్ప భద్రత ఉంది.

మనిషి తన దైనందిన జీవితంలో అవసరమైన విధినిర్వహణ చర్యలను చేయగలిగేలా నిరంతరం ధ్యానం ద్వారా తన మనస్సుకు శిక్షణ ఇవ్వాలి మరియు అంతర్గతంగా భగవంతుని చైతన్యమును కొనసాగించాలి. పురుషులు మరియు మహిళలు అందరూ తమ రోజువారీ జీవితానికి గాఢమైన ధ్యానాన్ని జోడిస్తే వారి ప్రాపంచిక జీవితంలోని అంతులేని శారీరక మరియు మానసిక రుగ్మతల నుండి విముక్తి పొందగలరని గుర్తుంచుకోవాలి.

ఇతరులతో షేర్ చేయండి