రచయితలు మరియు సంపాదకులు

"నేను చాలా సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారి వద్దకు అన్వేషకుడిగా కాకుండా, సానుభూతితో పాటు విశ్లేషణాత్మక మరియు విమర్శనాత్మక దృక్పథం కలిగిన రచయితగా వచ్చాను. నేను ఆయనలో ఒక అరుదైన కలయికను కనుగొన్నాను. ఆయన ప్రగాఢ విశ్వాసం, ప్రాచీన సూత్రాలలో స్థిరంగా ఉన్నప్పటికీ, ఆయన ఉదారమైన అనుసరణీయత అనే బహుమతిని కలిగి ఉన్నారు, తద్ద్వారా ఆయన హిందువుగా మరియు భారతీయుడిగా ఉండడం మాత్రమే కాకుండా క్రిస్టియన్ మరియు అమెరికన్ అయ్యారు. తన నేర్పుగల తెలివితేటలు మరియు గొప్ప స్ఫూర్తితో ఆయన, ప్రపంచంలోని మతపరమైన అన్వేషకుల మధ్య సయోధ్య మరియు సత్యాన్ని ప్రోత్సహించగల సుసంపన్నుడు. ఆయన అనేకమందికి శాంతి మరియు ఆనందాన్ని తెచ్చారు."

— డాక్టర్ వెండెల్ థామస్, రచయిత మరియు మాజీ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ న్యూయార్క్

"మానవుల సోదరభావం తరఫున మరియు ప్రపంచంలోని గొప్ప మతాల మధ్య, తూర్పు మరియు పశ్చిమాల మధ్య సన్నిహిత అవగాహన కోసం గురుదేవులు యోగానందగారు చేసిన కృషిని తెలిసిన మరియు ఆయన రచనల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆయనతో పరిచయం ఉన్నవారందరికీ తెలుసు, ఆయనది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి అని....

"మహాత్మాగాంధీ ఒకప్పుడు యోగానందగారి గురించి ఎంతో అభిమానంతో నాతో మాట్లాడినది నాకు గుర్తుంది. రాజకీయ నాయకులందరి కంటే భారతదేశం మరియు పశ్చిమ దేశాల మధ్య లోతైన అవగాహన కోసం నిజమైన ఆశను కలిగించే సందేశాన్ని యోగానందగారి వంటి ఆధ్యాత్మిక పురుషులు అందించారని ఆయన అన్నారు."

— డాక్టర్ కామిల్లె హోనిగ్, లిటరరీ ఎడిటర్, ది కాలిఫోర్నియా జ్యూయిష్ వాయిస్

"ఇప్పుడు మన మధ్య అవతరించి లేకపోయినా, భవిష్యత్తులో పరమహంస యోగానందగారు కొత్త ప్రపంచానికి, ఉన్నత సంస్కృతికి భారతదేశం యొక్క అత్యంత గొప్ప రాయబారులలో ఒకరిగా పరిగణించబడతారు. సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అనేక కేంద్రాలు,అమెరికాలోనే కాదు అన్ని ఖండాలలో, భూమిపై ఆయన కార్యము యొక్క అద్భుతమైన విజయానికి స్వీయ-స్పష్టమైన రుజువులుగా నిలుస్తాయి."

— డాక్టర్ డబల్యూ. వై. ఎవాన్స్-వెంట్జ్, ఎం.ఏ., డి. లిట్., డి.ఎస్‌సి., జీసస్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్

"ఈ తరం చూసిన, వివేకం మరియు మానవత్వం కలిగి ఉన్న అత్యుత్తమ వ్యక్తులలో పరమహంస యోగానందగారు ఒకరు."

— డాక్టర్ ఫ్రాన్సిస్ రోల్ట్-వీలర్, ఎల్'ఆస్ట్రోసోఫీ, నైస్, ఫ్రాన్స్ యొక్క మెటాఫిజికల్ స్కాలర్ సంపాదకులు

"ఆయన స్ఫూర్తి పొందారు....మహానుభావుల్లో ఒకరు. ఆయన అన్ని విధాలుగా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఏది చెప్పినా ప్రజలకు ఉపయోగపడేదే. ఆయన ప్రజలకు స్వచ్ఛమైన, నిష్కల్మషమైన విశ్వాసం మరియు విశ్వవ్యాప్త విశ్వాసం వైపు దారి చూపారు....

"సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ [ఎస్‌.ఆర్‌.ఎఫ్.] అనే పేరు ఆయన కార్యానికి చాలా వివరణాత్మకమైనదని నేను భావిస్తున్నాను — ఇది తమను తాము, వారి స్వంత సామర్థ్యాన్ని గ్రహించే వ్యక్తుల విశిష్ట సభ్యత్వం....నేను ఎస్‌.ఆర్‌.ఎఫ్. సెంటర్ కు వెళ్ళినప్పుడు, అది ఎక్కడ ఉన్నా, అది పసిఫిక్ పాలిసేడ్స్ లోని లేక్ ష్రైన్ అయినా లేదా మౌంట్ వాషింగ్టన్ [ఎస్‌.ఆర్‌.ఎఫ్. అంతర్జాతీయ కేంద్ర కార్యాలయం] అయినా లేదా మరెక్కడైనా, నన్ను బాగా ఆకర్షించిన అంశం శాంతి, వారు శాంతి గురించి మాట్లాడడమే కాదు, వారు శాంతిని ప్రకటించడమే కాదు, వాస్తవానికి వారు శాంతిని విశ్వసిస్తారు. వారు నిజానికి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.... సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థ, దాని వ్యవస్థాపకుడు యోగానందగారి ప్రతిబింబం."

— డాన్ త్రాప్, మాజీ రిలిజియన్ ఎడిటర్, లాస్ ఏంజిలిస్ టైమ్స్

"నాకు మార్గదర్శకత్వం గురించి అంతా తెలుసు, ఎందుకంటే నేనే మార్గదర్శరాలిని. ఓటు హక్కు కోసం పోరాడాల్సిన స్త్రీలమైన మేము పక్షపాతం మరియు స్థిరమైన ఆలోచనలతో పోరాడుతున్నాము....మేము కూడా అమెరికా భౌతిక పునాదులు వేసిన వారిలాగా మార్గదర్శకులము. చాలా సంవత్సరాలుగా ప్రాచ్య దేశాల ఋషుల తత్వశాస్త్ర విద్యార్థినిగా స్వామి యోగానందగారి పాదాల చెంత నా చిన్న నివాళులు అర్పిస్తున్నందుకు సంతోషిస్తున్నాను....

"ఆయన అద్భుతమైన ప్రపంచ గురువు. ఆయన బోధనల కొరకు ఈ శతాబ్దము సిద్ధముగా ఉన్నది. ఆయన ఈ దేశం యొక్క సామర్థ్యానికి మరియు తూర్పు దేశాల యొక్క ఆధ్యాత్మికతకు మధ్య అనుసంధానం కలిగించే అధికారిలా నాకు అనిపిస్తారు. ఒకదానికి మరొకటి అవసరమై ఉన్నది మరియు ప్రతి ఒక్కటీ ఈ రెండింటి కలయికగా ఉండాలి....అటువంటి నాయకుడైన స్వామి యోగానందగారు చాలా అవసరం....ఆలోచనాపరులకు, భౌతికవాదంతో తృప్తి చెందనివారికి, అస్థిరత్వంతో విసిగిపోయినవారికి ఆయన తత్వము నచ్చుతుంది. అప్పుడు అవాస్తవం, సత్యం యొక్క వెలుగు ముందు నీడలా పారిపోతుంది."

— హెస్టర్ ఎం. పూల్, రచయిత మరియు మహిళా ఓటు హక్కు ఉద్యమంలో మార్గదర్శకురాలు

"ఆయన స్థాపించిన ఫెలోషిప్ రెండు విషయాలను లక్ష్యంగా చేసుకుంది: తనను తాను భగవంతుడి అంతరాత్మగా గ్రహించడం ద్వారా భగవంతుడితో అనుసంధానం, మరియు మానవలందరితో స్నేహం కలిగి ఉండడం. వాస్తవానికి, శాస్త్రము మరియు మతంలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని సమన్వయం చేయడం ద్వారా ఆధ్యాత్మిక మరియు భౌతిక స్థాయిలలో విచారకరంగా అవసరమైన దిద్దుబాటు కోసం యోగానందగారు ప్రయత్నిస్తున్నారు. పరమహంస యోగానందగారు అద్భుతాలు చేశారు. ఆయన కళ్ళల్లోనూ మరియు సంభాషణాల్లోనూ ప్రకాశించే వారి ఆకర్షణీయ వ్యక్తిత్వం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఆయనను తూర్పు నుండి పశ్చిమానికి వచ్చిన దూత అని పిలిచాను. నిజానికి, ఆయన తన తోటి జీవులందరికీ, ఆనందానికి మార్గాన్ని చూపించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన, ప్రేమగల, విశ్వజనీనమైన దైవమానవుడిగా తన పుత్రుడిని చూసి భారతదేశం గర్విస్తుంది."

— శ్రీ భూపీంద్ర నాథ్ సర్కార్, భారతీయ విద్యావేత్త & రచయిత, కలకత్తా హిందూస్తాన్ స్టాండర్డ్

ఇతరులతో షేర్ చేయండి