ఒక యోగి ఆత్మకథ ఎం‌పి3 (MP3) సంచిక

సంపూర్ణ ఆడియో పుస్తకము ఎం‌పి3 సంచిక

ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక నిధిగా అభినందించబడిన, అత్యధికంగా విక్రయించబడుతున్న ఈ గ్రంథం, ఒక కొత్త మరియు అత్యంత సఫలమైన జీవన విధానాన్ని పరివర్తన దిశలో వ్యక్తిగత ప్రయాణం ప్రారంభించేందుకు లక్షలాది ప్రజలకు ప్రేరణనిచ్చింది. పరమహంస యోగానందగారి అసాధారణమైన జీవిత చరిత, జ్ఞానము, హాస్యము మరియు స్ఫూర్తితో వాడుక భాషలో అద్భుతముగా తెలియజేయబడింది.

ఈ పుస్తకమును కొత్తగా చదివినవారు, అలాగే ఈ పుస్తకాన్ని సుదీర్ఘకాల సహవాసిగా చేసుకుని విలువైన నిధిగా భావించేవారు, వృత్తిపరమైన వ్యాఖ్యాత చదివిన ఈ సున్నితమైన మరియు నిర్భంధింపజేయు పఠనమును తప్పకుండా స్వాగతిస్తారు. ఆయన సరళమైన నాటకీయతతో శ్రీ యోగానందగారి అనేకమైన మనోరంజక వృత్తాంతముల శోభను సంగ్రహించారు, రచయిత కళ్ళకు కట్టినట్లుగా వివరించిన మనుషుల ఘనమైన అనుభవాలకు, సంఘటనలకు, మరియు ఆయన ప్రకాశవంతమైన అన్వేషణలకు, జీవితము యొక్క నిగూఢమైన మర్మములకు జీవము పోసి స్పష్టముగా తెలియచేశారు.

వివిధ రూపాలలో కూడా లభిస్తుంది:

ఇతరులతో షేర్ చేయండి