అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద, సీటెల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది

మన గురుదేవుల జీవితం మరియు కార్యముపై కౌంటర్‌పాయింట్ ఫిలిమ్స్ యొక్క డాక్యుమెంటరీ –  అవేక్: ది లైఫ్ ఆఫ్ యోగానంద, 2014లో ప్రణాళికాబద్ధంగా థియేటర్లలో విడుదల గురించిన ఉత్తేజకరమైన వార్తలను గత నెలలో మేము మీతో పంచుకున్నాము. ఈ నెలాఖరులో జరిగే సీటెల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎస్‌.ఐ‌.ఎఫ్‌.ఎఫ్.)లో ఈ సినిమా ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్ ప్రదర్శించబడుతుందని ఇప్పుడు మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము.

యు.ఎస్.లో అత్యధికంగా హాజరయ్యే ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఒకటైన ఎస్‌.ఐ‌.ఎఫ్‌.ఎఫ్. మే 18, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు మరియు మళ్ళీ సోమవారం, మే 19 సాయంత్రం 7 గంటలకు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుంది.

ఇది వరకు నివేదించినట్లుగా, అరిజోనాలోని సెడోనాలో జరిగిన ఇల్యూమినేట్ ఫిల్మ్ ఫెస్టివల్ – చేతన చిత్రాలకు ఒక వేదిక – దాని డాక్యుమెంటరీ ఫీచర్లలో ఒకటిగా అవేక్ ను ఎంపిక చేసింది. ఈ చిత్రం శుక్రవారం,  మే 30న ప్రదర్శించబడుతుంది. రెండవ ప్రదర్శన, ఆదివారం, జూన్ 1న కూడా ప్రదర్శన జాబితాలో ఉండవచ్చు. ప్రదర్శించబడిన తర్వాత చలనచిత్ర నిర్మాతలతో ప్రశ్న మరియు జవాబుల సమయం ఉంటుంది. మరింత సమాచారం కోసం, దయచేసి www.illuminatefilmfestival.com ను సందర్శించండి.

ఫెస్టివల్ ప్రదర్శనలలో హాజరు కావడానికి టిక్కెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. మీరు చలనచిత్రం లేదా ప్రదర్శనల గురించి మరింత సమాచారం కావాలనుకుంటే మరియు చలనచిత్ర నిర్మాతల మెయిలింగ్ జాబితాలో చేరాలనుకుంటే, దయచేసి www.AWAKEtheYoganandaMovie.com చిత్రం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

గతంలో ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన వార్తలను చూడండి.

Share this on