భారతదేశానికి తిరిగి రాక (1935-36)

1935లో కలకత్తాలో స్వామి శ్రీయుక్తేశ్వర్ మరియు యోగానందగారు.

1935లో తన గురువు శ్రీయుక్తేశ్వర్ గారిని (ఎడమ) ఆఖరిసారి దర్శించుడానికి శ్రీ యోగానందగారు భారతదేశానికి తిరిగి వచ్చారు. (శ్రీయుక్తేశ్వర్ గారు 1936 మార్చి 9న మహాసమాధి చెందారు.) ఐరోపా, పాలస్తీనా మరియు ఈజిప్టు మీదుగా, ఓడలో మరియు కారులో ప్రయాణించి 1935 వేసవిలో ఆయన బొంబాయి చేరుకున్నారు.

వార్ధాలో మహాత్మాగాంధీ మరియు యోగానందగారు.

తన స్వదేశంలో ఒక సంవత్సరం పాటు శ్రీ యోగానందగారు నివసించిన ఆ సమయంలో, ఉపఖండంలోని వివిధ నగరాలలో ఎన్నో తరగతులు మరియు క్రియాయోగ దీక్షలను నిర్వహించారు. అంతేకాకుండా ఆ సమయంలో వారు ఎందరో ప్రముఖులను కలుసుకుని ఆనందించారు. శ్రీ యోగానంద కలుసుకున్న ముఖ్యులలో, ఆయన నుండి క్రియాయోగా దీక్షను అభ్యర్ధించిన మహాత్మాగాంధీ, నోబెల్ పురస్కారగ్రహీత సర్ సి.వి.రామన్, మరియు భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక వ్యక్తులైన శ్రీ రమణ మహర్షి, ఆనందమయీ మాత కూడా ఉన్నారు.

ఆ సంవత్సరంలోనే శ్రీయుక్తేశ్వర్ గారు ఆయనకి సర్వోన్నత పరివ్రాజక బిరుదు “పరమహంస” ను ప్రదానం చేశారు. ‘పరమ’ అనగా అత్యున్నత, ‘హంస’ ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక, ఈ బిరుదు భగవంతునితో ఐక్యత యొక్క అంతిమ స్థితిలో స్థిరపడిన వ్యక్తిని సూచిస్తుంది.

భారతదేశంలో ఉండగా శ్రీ యోగానందగారు తన జీవితకాల రచనలకు శాశ్వతమైన పునాదిని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పరిచారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయమైన (దిగువ ఎడమ) కలకత్తాలోని దక్షిణేశ్వరం (కలకత్తా దగ్గర గంగానది ఒడ్డున) మరియు రాంచీలోని అసలైన ఆశ్రమాల స్థాయి నుండి, ఈ సంస్థ ఎన్నో ఆశ్రమాలు, పాఠశాలలు, ధ్యాన కేంద్రాలు, ధార్మిక సేవా కార్యక్రమాలతో దేశమంతటా వృద్ధి చెందుతున్నది.

గంగానది ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర ఆశ్రమం

శ్రీ యోగానందగారు 1936 చివరిలో అమెరికా తిరిగి వచ్చారు, అక్కడ ఆయన తన జీవితాంతం ఉండిపోయారు.

పరమహంస యోగానంద మరియు రమణ మహర్షి
ఆనందమోయి మా, భోలానాథ్ మరియు యోగానంద కోల్కత్త లో
యోగానంద, సి రిచర్డ్ రైట్  మరియు మదన్ మోహన్ మాల్వియా

ఇతరులతో షేర్ చేయండి