రాబోవు సంచికల కొరకు యోగానందగారి అభిలాషలు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రచురణలు తప్ప, వేరెవ్వరూ, ఒక యోగి ఆత్మకథ చివరి వచనం కొరకు రచయిత అభిలషలన్నింటినీ చేర్చలేరు – ఆయన 1924 నుండి 1952లో పరమపదించే వరకు ఆయనకు పనిచేసిన సంపాదకులకు వ్యక్తిగతంగా తెలియజేసినవి, మరియు తన రచనల ప్రచురణకు సంబంధించిన అన్ని విషయాలను వారికి అప్పగించారు.

ఒక యోగి ఆత్మకథ పాఠకులు కొన్నిసార్లు ప్రస్తుత సంచికకు మరియు 1946లో ప్రచురించబడిన మొదటి సంచికకు మధ్య గల వ్యత్యాసములను గురించిన వివరాలను అడుగుతారు.

పరమహంసగారి జీవితకాలంలో ఆయన ఆత్మకథ యొక్క మూడు సంచికలు విడుదలయ్యాయి. 1951లో ప్రచురించబడిన సంచికలో ఆయన గణననీయమైన మార్పులు చేశారు – మూలాన్ని చక్కగా సవరించడం, విషయములను తొలగించడం, వివిధ అంశాలను విస్తరించడం మరియు “1940-1951 మధ్యకాలం” (పుస్తకంలోని అన్నింటికన్నా దీర్ఘమైన అధ్యాయలలో ఒకటి) అనే కొత్త అధ్యాయాన్ని చివరిలో జోడించడం జరిగింది. మూడవ సంచిక తరువాత ఆయన చేసిన మరికొన్ని సవరణలు 1956లో విడుదలైన ఏడవ సంచిక ప్రచురణ వరకు చేర్చబడలేదు.

ఈ క్రింది ప్రచురణకర్త యొక్క గమనిక ఒక యోగి ఆత్మకథ ఏడవ సంచికలో ప్రచురించబడింది, ఇది పుస్తకం కోసం రచయిత అభిలాషల చరిత్రను తెలియజేస్తుంది:

“ఈ 1956 అమెరికా సంచికలో, 1949లో లండన్, ఇంగ్లాండ్ సంచిక కోసం పరమహంస యోగానందగారు చేసిన సవరణలు ఉన్నాయి; మరియు 1951లో రచయిత చేసిన అదనపు సవరణలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 25, 1949 నాటి లండన్ సంచికకు గమనికలో పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు: ‘ఈ పుస్తకం యొక్క లండన్ సంచిక ఏర్పాటు చేయడం వల్ల నాకు సవరణలకి, మరియు కొద్దిగా మూలాన్ని విస్తరించడానికి అవకాశం వచ్చింది. గత అధ్యాయంలో క్రొత్త విషయాలతో పాటు, నేను అమెరికన్ సంచిక పాఠకులు పంపిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అనేక పుటలకు అడుగున వ్రాయబడు పాదపీఠికలను జోడించాను.’

“1951లో రచయిత, తరువాత చేసిన సవరణలు నాల్గవ (1952) అమెరికా సంచికలో ప్రచురించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆ సమయంలో ఒక యోగి ఆత్మకథ ప్రచురణ హక్కులు న్యూయార్క్ ప్రచురణ హౌస్ ఆధీనంలో ఉన్నాయి. 1946లో న్యూయార్క్‌లో పుస్తకంలోని ప్రతి ఒక్క పుటను లోహపు పలకగా తయారుచేశారు. పర్యవసానంగా, ఒక కామాను చేర్చడానికి కూడా మొత్తం పుట యొక్క లోహపు పలకను, ఖండించి కావలసిన కామాతో కూడిన కొత్త పంక్తితో తిరిగి పలకకు టంకము వేయవలసి వచ్చేది. అనేక పలకలకు తిరిగి టంకము వేయడానికి చేసే ఖర్చు వల్ల, న్యూయార్క్ ప్రచురణకర్త నాల్గవ సంచికలో రచయిత 1951లో చేసిన సవరణలను చేర్చలేదు.

“1953 చివరలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్‌.ఆర్‌.ఎఫ్.) న్యూయార్క్ ప్రచురణకర్త నుండి ఒక యోగి ఆత్మకథ యొక్క అన్ని హక్కులను కొనుగోలు చేసింది. ఎస్‌.ఆర్‌.ఎఫ్. 1954 మరియు 1955లలో పుస్తకాన్ని పునర్ముద్రించింది (ఐదవ మరియు ఆరవ సంచికలు); కానీ ఆ రెండు సంవత్సరాలు ఇతర విధుల నిర్వహణ, ఎస్‌.ఆర్‌.ఎఫ్. సంపాదకీయ విభాగాన్ని లోహపు పలకలపై రచయిత యొక్క సవరణలను చేర్చడం అనే కఠినమైన కార్యమును చేపట్టకుండా నిరోధించాయి. ఏదేమైనా, ఏడవ సంచిక కోసం ఈ కార్యము తగిన సమయములో పూర్తయింది.”

1946 మరియు 1956 మధ్య చేసిన మార్పులు, చేర్పులు మరియు తొలగింపులు అన్నీ పరమహంసగారి సూచనల మేరకే జరిగాయి. తరువాత చేయబడిన ఇతర సంపాదకీయ సవరణలు – అన్ని సందర్భాల్లో చాలా చిన్నవి – ఆయనతో 25 సంవత్సరాలుగా సన్నిహితంగా పనిచేసిన, ఆయన దీర్ఘకాల సంపాదకురాలైన తారామాతకు ఆయన పరమపదించే ముందు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జరిగినవి, మరియు ఆయన పరమపదించిన తరువాత తన సూచనలకు అనుగుణంగా తన రచనల ప్రచురణ కోసం ఆమెపై ఆయన పూర్తి నమ్మకం ఉంచారు.

సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ పుస్తకం విస్తృతంగా మరియు మరింత విస్తృతంగా ప్రేక్షకులను చేరుకుంటుందని పరమహంసగారు స్పష్టంగా ముందే తెలుసుకున్నందున, ఆయన తన సంపాదకులకు – సంధర్భవశాత్తు, పుట అడుగున వ్రాయబడు పాదపీఠికలు, చిత్రాలు , శీర్షికలు మొదలైనవి – ఏవైనా సరే, పుస్తకము ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండడానికి చేర్చమని ఆదేశించారు.

1956 నుండి చేసిన మార్పులు చాలా దశాబ్దాలుగా నిరంతరం ముద్రణలో ఉన్న ఒక పుస్తకం యొక్క తరువాత సంచికలలో సంపాదకీయ సర్దుబాట్ల మార్గంలో, ఏ ప్రచురణకర్తయినా సాధారణంగా ఏమి చేస్తాడో అవే కలిగి ఉన్నాయి (ఉదా., రచయిత ఇతర పుస్తకాల జాబితాను నవీకరించడం; అదనంగా పుట అడుగున వ్రాయబడు పాదపీఠికలు, ప్రస్తుత పాఠకులకు ఉపయోగకరంగా భావించబడినవి – రచయిత చేసిన మార్పులు కాదు, ప్రచురణకర్త చేత జోడించబడినట్లు స్పష్టంగా గుర్తించబడి ఉన్నవి; రచయిత యొక్క అదనపు ఫోటోలు మరియు ఆయన కార్యకలాపాలు; ముందు మరియు గతానికి చెందిన విషయములకు అవసరమైన మార్పులు, మొదలైనవి).

ఒక యోగి ఆత్మకథ ప్రారంభ సంచికలలో రచయిత బిరుదును “పరంహంస”గా పేర్కొనబడింది, ఇది అక్షరాలు కూర్చడంలో నిశ్శబ్దంగా లేదా దాదాపు నిశ్శబ్దంగా ఉండే ‘అ’లను వదిలివేసే సాధారణ బెంగాలీ పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఈ వేద-ఆధారిత బిరుదు యొక్క పవిత్ర ప్రాముఖ్యత తెలియజేయబడుతుందని నిర్ధారించడానికి, తరువాతి సంచికలలో ప్రామాణిక సంస్కృత లిప్యంతరీకరణ ఉపయోగించబడింది: పరమ నుండి “పరమహంస”, “అత్యున్నత లేదా సర్వశ్రేష్టమైన” మరియు హన్స అనగా “హంస” – తన నిజమైన, అత్యున్నత సాక్షాత్కారమైన, దివ్యాత్మ స్థితిని చేరుకోవడాన్ని మరియు పరమాత్మతో జీవాత్మ కలయికను సూచిస్తుంది.

1946లోని మొదటి సంచికతో పోల్చితే, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రస్తుత ఆత్మకథ సంచికలలో, పరమహంస యోగానందగారి 20 అదనపు పేజీల ఛాయాచిత్రాలు మరియు పుస్తకంలో చర్చించబడిన ఇతర విషయాలు, సంస్థ యొక్క భద్రపరచబడిన పాత పత్రాల నుండి ఆసక్తిగల పాఠకుల కోసం పూర్తి సంగ్రహావలోకనం అందించడానికి రచయిత మరియు ఆయన కార్యకలాపాలు చేర్చబడ్డాయి.

ఇతరులతో షేర్ చేయండి