క్రియాయోగం యొక్క 150వ వార్షికోత్సవం

2011వ సంవత్సరం క్రియాయోగ ప్రాచీన శాస్త్రాన్ని తిరిగి ఆధునిక ప్రపంచానికి పునఃపరిచయం చేసిన 150వ వార్షికోత్సవంగా గుర్తింపు పొందింది. 1861లో లాహిరీ మహాశయులు హిమాలయాలలో అమర గురువులు మహావతార్ బాబాజీని కలుసుకుని, పవిత్ర ఆత్మ శాస్త్రంలో దీక్ష పొందారు. పరమహంస యోగానందగారు ఇలా వ్రాశారు: “ఈ శుభ సంఘటన లాహిరీ మహాశయులకొక్కరికి మాత్రమే జరగలేదు; ఇది మానవ జాతి మొత్తానికి ఒక అదృష్ట ఘడియ. వాడుకలో లేని, లేదా దీర్ఘ కాలంగా అదృశ్యమైన, అత్యున్నతమైన యోగ శాస్త్ర కళ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.”

ఈ వార్షికోత్సవాన్ని గౌరవించడం కోసం 2011లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు ఆత్మ-విముక్తి నొసగే క్రియా ప్రక్రియను మరింతగా వ్యాప్తి చేయడంలో సహాయపడింది:

  • యోగదా సత్సంగ పత్రిక యొక్క ఒక సంచిక మొత్తం క్రియాయోగ శాస్త్రానికి అంకితం చేయబడింది.
kriyapage
  • ఆత్మ విముక్తి కలుగజేసే ఈ పవిత్ర ప్రక్రియ యొక్క చరిత్ర మరియు ప్రయోజనాలను ప్రధానాంశంగా చేస్తూ వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లో ఒక కొత్త విభాగము జోడించబడింది.
  • వై.ఎస్.ఎస్. కేంద్రాలలో మరియు మండళ్లలో క్రియాయోగంపై పరమహంస యోగానందగారి రచనల ఆధారంగా కార్యక్రమాలను నిర్వహించారు, ఈ సందర్భంగా వై.ఎస్.ఎస్./ఎస్.అర్.ఎఫ్. అధ్యక్షురాలు శ్రీ మృణాళినీమాత నుండి వచ్చిన ప్రత్యేక సందేశాన్ని భక్తులతో పంచుకోవడం జరిగింది.
  • 2011 శరద్ సంగం సందర్భంగా, క్రియా శాస్త్రంలోని అనేక ముఖ్య అంశాలపై అన్ని తరగతులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి.
kriyamagzine
  • యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) వారి పత్రికలో, మరియు వారి వెబ్‌సైట్‌లో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక వ్యాసాలను పొందుపరిచింది. ప్రత్యేక కార్యక్రమాలలో పాద యాత్రలు, లేదా సంచార తీర్థయాత్రలు ఉన్నాయి, లాహిరీ మహాశయులు తన గురువు బాబాజీ నుండి క్రియాయోగ దీక్షను స్వీకరించిన ప్రదేశం — రాణిఖేత్ నుండి బాబాజీ గుహ వరకు 1861లో లాహిరీ మహాశయులు చేసిన యాత్రను తిరిగి చేయడానికి, రెండు సమూహాలుగా వై.ఎస్.ఎస్. సభ్యులు, వై.ఎస్.ఎస్. సన్యాసులు వేర్వేరు తరుణాల్లో పదకొండు గంటల పాదయాత్రగా హిమాలయ పర్వతారోహణలో పాల్గొన్నారు. పాల్గొన్న ఒక భక్తుడు ఇలా వ్రాశాడు:

“మా ప్రయాణం ఉదయం 6:00 గంటలకు ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. అది ఒక అందమైన చురుకైన ఉదయం, మరియు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం మా ప్రయత్నాన్ని ప్రోత్సహించింది. అదనపు బహుమతిగా, స్వామి నిర్వాణానంద, బ్రహ్మచారులు సదానంద మరియు అచ్యుతానంద, మరియు ప్రవేశార్థి దివ్యాంశు మాకు ప్రేరణ కలిగించి, జ్ఞాన ముత్యాలను దారి పొడుగునా మాకు అందించారు. మేము చిన్న పట్టణాలు మరియు గ్రామాలను దాటుతున్నప్పుడు, స్థానికులు మమ్మల్ని అభినందించి, ఉత్సాహపరిచారు. ఆరు గంటల్లోనే మేము బింటా అనే చిన్న గ్రామానికి చేరుకున్నాము. ఇక్కడ మేము సాదా భోజనం చేశాము. గంభీరమైన పర్వతాలు, మనోహరమైన దృశ్యాలు, అంతులేని ఆకాశం, ఉల్లాసభరితమైన సూర్యుడు మరియు తేలియాడే మేఘాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి, మాకు అధిరోహణం ఇబ్బంది అనిపించలేదు. మేము అందమైన ప్రవాహాలను మరియు అందమైన అడవులను దాటాము, ప్రకృతి మాత యొక్క శాంతిని ఆస్వాదించాము ఇంకా భగవంతుని మరియు గురుదేవుల ప్రేమను అనుభూతి చెందాము.”

“బింటా నుండి ఐదు గంటల అధిరోహణం తరువాత మేము బాబాజీ గుహకు చేరుకున్నప్పుడు, రాణిఖేత్ నుండి మేము పదకొండు గంటలపాటు అధిరోహణం చేసినట్లు మేము ఊహించలేకపోయాము. ఖచ్చితంగా బాబాజీ ఆశీస్సులు ఈ అనుభవం వెనుక ఉండాలి. గుహలో ధ్యానం చేస్తున్నప్పుడు బాబాజీ మాపై కురిపిస్తున్న ప్రేమను మేము అనుభవించాము, ప్రపంచం మా చైతన్యంలో స్తంభించిపోయింది, మరియు మేము నిత్య నవీన ఆనందంలో మునిగిపోయాము. అదొక సుసంపన్నమైన అనుభవ౦, మాలో ప్రతి ఒక్కరూ మరుపురాని జ్ఞాపకాలను తిరిగి తీసుకువెళ్ళాము.”

క్రియా వార్షికోత్సవ ప్రత్యేకవ్యాసం అసంఖ్యాక ముద్రణలు మరియు ఆన్‌లైన్ ప్రచురణలలో పొందుపరచబడింది, వీటిలో:

ప్రకటనలు

ఇతరులతో షేర్ చేయండి