ఆధ్యాత్మిక పరంపర

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్) యొక్క బోధనలు భగవాన్ కృష్ణుడి అసలైన యోగా మరియు జీసస్ క్రైస్ట్ యొక్క అసలైన క్రైస్తవ మతం మీద స్థాపించబడ్డాయి. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క ఆధ్యాత్మిక పరంపరలో ఈ రెండు గొప్ప అవతారాలు మరియు సమకాలీన కాలపు ఉన్నతమైన మాస్టర్స్ ఉన్నారు: శ్రీ మహావతార్ బాబాజీ, శ్రీ లాహిరీ మహాశయులు, స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ, మరియు శ్రీ పరమహంస యోగానందజీ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురువుల వరుసలో చివరి వారు)

క్రియాయోగము అనే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆధునిక ప్రపంచానికి అందించాలనే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క కార్యములో ఈ మహాత్ములు ప్రముఖ పాత్ర పోషించారు.(మరింత చదవడానికి ఫోటోలపై క్లిక్ చేయండి.)

క్రియాయోగ పవిత్ర దీక్ష తీసుకున్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులందరూ (సన్యాసులు అలాగే సాధారణ సభ్యులు) శ్రీ పరమహంస యోగానందగారి శిష్యులు. ఆయన వారి వ్యక్తిగత గురువుగా గౌరవం మరియు భక్తిని పొందుతారు, మరియు ఆయన గురువుల పరంపరలోని అందరు వై.ఎస్.ఎస్. శిష్యులచే భక్తితో గౌరవించబడతారు. గురు-శిష్యుల సంబంధం గురించి మరింత చదవండి.

గురు-పరంపర — గురువు యొక్క ఆధ్యాత్మిక బాధ్యత

గురువుకి చెందిన వారసత్వాన్ని కొనసాగించడానికి నియమించబడిన శిష్యుడికి గురువు యొక్క ఆధ్యాత్మిక సంపదని పంపడం గురు-పరంపర అని పిలుస్తారు. ఈ విధంగా మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు స్వామి శ్రీ యుక్తేశ్వర్జి గురువుల యొక్క ప్రత్యక్ష వారసత్వం పరమహంస యోగానందగారు.

ఆయన మహాసమాధికి ముందు, పరమహంస యోగానందగారు , వై.ఎస్.ఎస్. గురు పరంపరలో తాను చివరి వారు కావాలని దేవుని కోరిక అని పేర్కొన్నారు. ఆయన సంఘంలో తరువాత వచ్చిన శిష్యుడు లేదా నాయకుడు గురు బిరుదును ఎప్పటికీ పొందడు. (ఈ దైవిక శాసనం మత చరిత్రలో ప్రత్యేకమైనది కాదు. సిక్కు మతాన్ని స్థాపించిన గొప్ప సాధువు గురు నానక్ పరమపదించిన తరువాత, గురువుల యొక్క సాధారణ వారసత్వం ఉంది. ఆ వరుసలో పదవ గురువు తాను గురువుల శ్రేణిలో ఆఖరి గురువు అని ప్రకటించాడు, ఇక నుండి బోధనల్నే గురువుగా పరిగణించాలి అని కోరారు.)

పరమహంసగారు తన మహాసమాధి తరువాత, తాను స్థాపించిన సమాజం, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా / సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇలా అన్నారు, “నేను వెళ్ళిపోయిన తరువాత నా బోధనలు గురువు అవుతాయి…. బోధనల ద్వారా మీరు నాతో మరియు నన్ను పంపిన గొప్ప గురువులతో అనుసంధానంలో ఉంటారు.”

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాయకత్వం యొక్క వారసత్వం గురించి ప్రశ్నించినప్పుడు, ఆయన ఇలా సమాధానం చెప్పారు, “ఈ సంస్థ యొక్క అధిపతిగా ఎల్లప్పుడూ, దైవ సాక్షాత్కారం పొందిన పురుషులు మరియు స్త్రీలు ఉంటారు. వారు ఇప్పటికే దేవునికి మరియు గురువులకు తెలుసు. వారు అన్ని ఆధ్యాత్మిక మరియు సంస్థాగత విషయాలలో నా ఆధ్యాత్మిక వారసునిగా మరియు ప్రతినిధిగా పనిచేస్తారు.”

గురు వారసులు

శ్రీ శ్రీ రాజర్షి జనకానంద

రాజర్షి జనకానంద 1952లో పరమహంస యోగానందగారి తరువాత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆయన జేమ్స్ జె. లిన్ అనే నామంతో మే 5, 1892న లూసియానాలోని ఆర్కిబాల్డ్ లో జన్మించారు; మరియు 1932లో కాన్సాస్ నగరంలో గురువుగారి ఉపన్యాస సరళి జరుగుతున్నప్పుడు, పరమహంస యోగానందను కలిశారు.

క్రియాయోగములో వేగంగా అభివృద్ధి చెందడం వల్ల, పరమహంసగారు ప్రేమతో ఆయనను “సెయింట్ లిన్” అని పిలిచేవారు. 1951లో యోగానందగారు ఆయనకి రాజర్షి జనకానంద (పురాతన భారతదేశపు, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి గాంచిన జనక మహారాజు గుర్తుగా) అనే సన్యాసి బిరుదును ప్రసాదించారు మరియు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పనికి మార్గ నిర్దేశం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.

రాజర్షి జనకానంద గురించి మరింత చదవండి.

గొప్ప పాశ్చాత్య యోగి అయిన రాజర్షి జనకానంద యొక్క ఆదర్శప్రాయమైన జీవితం ఫిబ్రవరి 20, 1955న ముగిసింది.

రాజర్షి జనకానందను దీవిస్తున్న యోగానంద

శ్రీ శ్రీ దయామాత

శ్రీ శ్రీ దయామాత 1955లో రాజర్షి జనకానంద తరువాత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్ష పదవిలోకి వచ్చారు.

పరమహంస యోగానందతో దయామాత

ఫేయే రైట్ గా జనవరి 31, 1914న సాల్ట్ లేక్ సిటీలో జన్మించిన ఆమె, 1931లో అక్కడ ఉపన్యాసాలు మరియు తరగతులు ఇవ్వడానికి వచ్చినప్పుడు పరమహంస యోగానందగారిని కలుసుకున్నారు. కొంతకాలం తర్వాత, ఆమె సన్యాసినిగా ఆయన ఆశ్రమంలోకి ప్రవేశించారు.

ఇరవై సంవత్సరాలకు పైగా, శ్రీ దయామాత, యోగానందగారితో నిరంతరం ఉన్న తన దగ్గరి శిష్యుల యొక్క చిన్న సమూహములో భాగమయ్యారు. సంవత్సరాలు గడిచే కొద్దీ, యోగానందగారు ఆమెకు మరింత ఎక్కువ బాధ్యతను అప్పగించారు. దయామాతను పిన్న వయసులోనే , 1930లలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో అధికారిగా నియమించారు. తన జీవితపు ముగింపు కాలంలో, యోగానందగారు ఆమెను ఎస్.ఆర్.ఎఫ్. ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ బాధ్యతలు అప్పగించారు మరియు ఆమె పోషించాల్సిన ప్రపంచవ్యాప్త పాత్ర గురించి శిష్యులతో మాట్లాడారు. యోగానందగారు మహాసమాధికి కొంతకాలం ముందు, ఆమెతో ఇలా అన్నారు: “ఇప్పుడు నా పని పూర్తయింది; నీ పని ప్రారంభమవుతుంది.”

శ్రీ దయామాత గురించి మరింత చదవండి.

1962లో భారతదేశంలో తీర్థ యాత్ర సందర్భంగా దయామాత మహావతార్ బాబాజీని ఆకస్మికంగా కలసినప్పుడు పరమహంసగారు తన ప్రపంచవ్యాప్త సమాజానికి కాబోయే నాయకురాలిగా శ్రీ దయామాతను ఎన్నుకున్నట్లు మహావతార్ బాబాజీ ధృవీకరించారు.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.కి అధ్యక్షురాలిగా 55 ఏళ్ళకు పైగా ఉన్న శ్రీ దయామాతగారు నవంబర్ 30, 2010న పరమపదించారు.

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఆగష్టు 3, 2017న, మన ప్రియమైన సంఘమాత మరియు అధ్యక్షురాలు శ్రీ శ్రీ మృణాళినీమాత, ఆత్మలో ఉన్న ఆనందం మరియు స్వేచ్ఛ యొక్క శాశ్వత రాజ్యం కోసం శాంతియుతంగా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు. పరమహంస యోగానంద బోధనల ద్వారా రూపాంతరం చెందిన వందలాది మంది సత్యాన్వేషకులకు జ్ఞానం, ప్రేమ మరియు అవగాహనల మార్గదర్శక కాంతిగా శ్రీ మృణాళినీమాత ఉన్నారు. గురుదేవుల ఆధ్యాత్మిక మరియు మానవతా సేవ చేయడానికి శ్రీ మృణాళినీమాత తనను తాను అంకితం చేసుకున్నారు.

 శ్రీ మృణాళినీమాత గురించి మరింత తెలుసుకోండి.

స్వామి చిదానంద గిరి

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా / సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు స్వామి చిదానంద గిరి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా / సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) అధ్యక్షుడిగా మరియు ఆధ్యాత్మిక అధిపతిగా ఎన్నికయ్యారు అనే వార్త మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. శ్రీ మృణాళినీమాత, జనవరి 2011 నుండి గత నెల ఆమె పరమపదించే వరకు ఆమె ఈ పదవిలో ఉన్నారు. ఆగస్టు 30, 2017 బుధవారం ఎస్‌.ఆర్‌.ఎఫ్. డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ ఓటు ద్వారా స్వామి చిదానంద గిరి గారి నియామకం జరిగింది. జై గురు.

 స్వామి చిదానంద గిరి గురించి మరింత తెలుసుకోండి.

Share this on

This site is registered on Toolset.com as a development site.