శ్రీ మృణాళినీమాతగారి కృతజ్ఞతార్పిత సందేశం 2013

“మీరు అన్ని సమయాల్లో అన్నిటికీ కృతజ్ఞతతో ఉండాలి. ఆలోచించగలిగే, మాట్లాడగలిగే, పని చేసే యావత్ శక్తి భగవంతుడి నుండే వస్తోందని, ఇప్పుడు ఆయన మీతోనే ఉన్నాడని, మీకు మార్గదర్శన౦ చేస్తూ, స్ఫూర్తినిస్తున్నాడని గ్రహి౦చ౦డి.”

— పరమహంస యోగానంద

ఈ కృతజ్ఞతాపూర్వకమైన తరుణంలో పరమహంస యోగానందగారి ఆశ్రమాల్లోని మా అందరి నుండి శుభాకాంక్షలు. మన జీవితాలలోని అందమైన మరియు ఆహ్లాదకరమైన వాటన్నింటినీ ఆనందించడానికి మన కళ్ళను, హృదయాలను వికసింపచేయటానికి ఇది ఒక జ్ఞాపిక కావచ్చు — కృతజ్ఞత: మనకు దైవానికి మధ్య నిరంతర పవిత్ర బదిలీని కొనసాగించే అద్భుతమైన ఆధ్యాత్మిక అభ్యాసం యొక్క పునరుద్ధరణ. కృతజ్ఞత ద్వారా, మనల్ని నిత్యం ప్రేమించి, ప్రతీ క్షణం మనల్ని పోషిస్తున్న ఆయన, ప్రకృతి యొక్క ప్రతి అణువు, అత్యంత ప్రాభవమైన వ్యక్తీకరణల వెనుక, మహాత్ముల ఆత్మ జ్ఞానంలో, మనం పొందే ప్రతి ఉపకారములో, మరియు మన స్వీయ చైతన్యం యొక్క ఆత్మ గుసగుసలలోను వ్యక్తమవుతాడు.

కృతజ్ఞత యొక్క సామాన్య భావన ఏమిటంటే, మనం ఊహించని ఒక ఆహ్లాదకర ఆశ్చర్యం లేదా కానుకకు ప్రతిస్పందన. కానీ కృతజ్ఞతను ఆధ్యాత్మిక ఆచరణగా పాటించడ౦ ఎ౦తో గాఢమైనది. భగవంతుడు సర్వాంతర్యామి అని, అన్నింటిలో ఆయన క్రియాశీలుడనే సజీవ అవగాహనతో హృదయాన్ని పదేపదే అనుశ్రుతి చేయడమే అది. అల్పమైన వాటిని కూడా ప్రశంసాపూర్వక చేతన ద్వారా మనం ఈ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు — సర్వ శుభాలు మరియు ఆహ్లాదాలు మన “అర్హత”గా భావిస్తాము. మన జీవితాలు నిజంగా ఎంతటి ఆశీస్సులతో సుసంపన్నమైనవో గుర్తుంచుకోవడం అనేది కూడా భగవంతుని సాక్షాత్కారానికి ఒక రూపం. స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా మనల్ని ప్రేమిస్తున్నది ఆయనేనని, మన మార్గాన్ని సుగమం చేసి, మన దైనందిన అవసరాలను తీర్చడానికి సహాయపడే అన్ని స్వల్ప విషయాల ద్వారా మనను సంరక్షిస్తున్నవాడు ఆయనే అని గ్రహిస్తాము. “ధన్యవాదాలు, ప్రభూ” అని స్పందించే అలవాటుతో ఆధ్యాత్మిక ఉపేక్షను భర్తీ చేయడం ద్వారా, మనం దేవునితో సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకుంటాము, అదే మన జీవితాల్లోకి భగవంతుని నిరంతర అనుగ్రహ ప్రవాహాన్ని అనుమతిస్తుంది.

మన౦ యుక్తమైనది శోధించడానికి, మరియు సర్వప్రదాతని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆదరణ నిచ్చే ఆయన సాన్నిధ్యం మనకు ఆశ, విశ్వాసముల ఉత్తేజాన్నిస్తు౦ది, మన మార్గంలో జీవిత౦ కష్టాల రాళ్ళను రువ్వినప్పుడు మనల్ని దృఢపరుస్తు౦ది. భయంతో ప్రతిస్పందించడం లేదా పారిపోవడానికి బదులు, మనం వాటిని తీసుకొని, ఆ అనుభవాలలో అంతర్లీనంగా ఉన్న గుణపాఠాలు మరియు అనుగ్రహాలను శోధిస్తూ, శ్లాఘించగలిగితే, అవి ఆశీస్సులుగా మార్పు చెందాయని మన౦ కనుగొ౦టా౦. దేవునిపై మనకున్న విశ్వాసం వృద్ధి చెందుతున్నపుడు, మన కృతజ్ఞతా భావానికి బాహ్య హేతువు అక్కర్లేదు. ఇది మన జీవితంలోని ప్రతిదానికీ హృదయపూర్వక కృతజ్ఞత యొక్క నిరంతర అంతర్వాహిని నుండి ఉద్భవిస్తుంది, ఎందుకంటే మన ఆత్మలను వాటి స్వాభావికమైన దైవత్వం, అజేయత్వం అలాగే ఆనందం వైపు మేల్కొల్పడానికి ఆయన అన్ని పరిస్థితులలో పని చేస్తున్నాడని మనకు తెలుసు.

దివ్య శ్రేయోభిలాషి పట్ల కృతజ్ఞతాభావం సహజంగానే ఇతరుల పట్ల సానుభూతిగా, మరియు ఆయన ఔదార్యాన్ని, ప్రేమపూర్వక దయను పుష్కలంగా వారితో పంచుకునే ఆనందంలో పొంగిపొర్లుతుంది. ఆ గుణాలను చేతలలో వ్యక్తపరచడం ద్వారా, మీరు, పరుల కృతజ్ఞతలు అందుకొనే వ్యక్తి అవుతారు – ప్రతిగా వారు ఈ పరిమిత ప్రపంచంలో అనంతుని యొక్క నిజమైన దయ అయిన ఇవ్వడం, ఇవ్వడం, ఇవ్వడం అనే పవిత్ర ఆవృత్తిలోకి ప్రవేశించడానికి ప్రేరేపించబడతారు.

 

 

మీకు, మీ ఆప్తులకు కృతజ్ఞతా సమర్పణ యొక్క నిశ్చితమైన ఆనందం కలుగు గాక,

శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2013 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

ఇతరులతో షేర్ చేయండి