శ్రీ శ్రీ మృణాళినీమాతగారి నూతన సంవత్సర సందేశం

“మన ప్రతి ఆలోచన మరియు సంకల్పం వెనుక అనంతమైన దేవుని ఆత్మ ఉంది. ఆయనను అన్వేషించండి, మీరు పూర్ణ విజయాన్ని సాధిస్తారు."

సెలవుదిన తరుణం యొక్క వెచ్చదనం మరియు ఆనందం అనే కాంతితో నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్నప్పుడు, గురుదేవ పరమహంస యోగానందగారి ఆశ్రమాల్లో ఉన్న మేమందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబంలోని ప్రతి సభ్యుడిని ఆ కాంతి ఆవహిస్తుంది అని దృశ్యమానం చేస్తాము. క్రిస్మస్ సందర్భంగా మీ కరుణ యొక్క అనేక వ్యక్తీకరణలకు మరియు ఏడాది పొడవునా మీరు అందిస్తున దివ్య స్నేహం మరియు మద్దతుకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నూతన ఆరంభ సమయంలో, భగవంతుడు మీ హృదయాలను మరియు మనస్సులను మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కావలసిన పునరుజ్జీవిత సంకల్పంతో నింపాలని మరియు మీ ప్రతి ఉదాత్తమైన ఆకాంక్ష మరియు ప్రయత్నం వెనుక ఉన్న పరిపూర్ణ శక్తి అయిన భగవంతుడి యొక్క చైతన్యంతో మీరు కలిసి జీవించాలని మా ప్రత్యేక ప్రార్థన.

రాబోయే స౦వత్సర౦ మన ఆత్మల దివ్య సామర్థ్యాన్ని ఆవిష్కరించే తాజా అవకాశాలతో మనల్ని ఆహ్వానిస్తు౦ది, మనకు సహాయ౦ చేయడానికి దేవుని క౦టే ఎక్కువగా ఆన౦దపడేవారు ఎవరూ ఉ౦డరు. పశ్చాత్తాపం మరియు చింతలు, గత తప్పిదాలు మరియు స్వీయ-పరాజిత అలవాట్ల సరంజామాను విడిచిపెట్టి, మీరు కొత్త సంవత్సరంలోకి తేలికగా ప్రయాణిస్తే, ఆయన ఇస్తున్న అవకాశాల ఉన్నత శిఖరాల సాధ్యతకు మీ గ్రహణశక్తి పెరుగుతుంది. మీరు మీ సహజమైన అజేయతను బయటకి తీసుకురావడానికి మిమ్మల్ని ప్రేరేపించే శక్తివంతమైన, మరియు ఉత్తేజపరిచే ఆలోచనలను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు ఎంత స్వేచ్ఛను అనుభూతి చెందుతారు. “ప్రాణశక్తిని సేవించండి మరియు భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రగతిశీల వ్యక్తుల మనస్సుల నుండి మానసిక పోషణను పొందండి. మీలో మరియు ఇతరులలోని సృజనాత్మక యోచనలపై పుష్కలంగా విందు చేయండి. ఆత్మవిశ్వాస మార్గంలో సుదీర్ఘ మానసిక విహారం చేయండి. “వివేకము, ఆత్మపరిశీలన, చొరవ అనే ఉపకరణాలతో అభ్యాస౦ చేయ౦డి: అని గురుదేవులు మనల్ని కోరారు.” గురుదేవుల ఉపదేశమును అనుసరి౦చడ౦ మీ మానసిక, ఆధ్యాత్మిక శక్తిని సంపూర్ణముగా పునరుత్తేజిత౦ చేస్తు౦ది, దానితో మీరు మీ నిత్య యవ్వన ఆత్మకు సహజమైన ఉత్సాహ౦తో, ఆత్మవిశ్వాస౦తో భవిష్యత్తును వీక్షించగలుగుతారు. సంకల్పమనే కండరాన్ని పెంచుకోవడ౦ కూడా అత్య౦త ఆవశ్యక౦, ఎ౦దుక౦టే దృఢమైన సంకల్ప౦ శరీరాన్ని, మనస్సును నియ౦త్రి౦చుకోవడానికి, కోరుకొనే అభివృద్ధిని సాకారం చేయడానికి, ఎడతెగని సహన౦తో దేవుణ్ణి అన్వేషించడానికి మీకు సహాయ౦ చేస్తు౦ది. విజయ౦ సాధి౦చే౦దుకు మీకున్న దైవ-సంపన్నమైన సామర్థ్యాన్ని పదేపదే ధృవీకరి౦చ౦డి, ప్రత్యేకి౦చి స్వీయ-సంశయము లేదా తాత్కాలిక వైఫల్య౦తో సతమతమవుతున్నప్పుడు; ఎ౦దుక౦టే, ఆయనపై ప్రేమ, విశ్వాసం ను౦డి పుట్టిన పట్టుదల మీ విజయస౦పదను సృష్టి౦చే సంకల్పాన్ని ఆయన విశ్వ-సృజన సంకల్ప౦తో అనుసంధానము చేస్తుంది.

మనస్సును సకారాత్మకంగా ఉపయోగించడం వల్ల, దేనినైనా సాధించడానికి మూలమైన సర్వ శక్తితో అనుశ్రుతి పెరుగుతుంది; కాని ధ్యానంలో మనం అర్థం చేసుకోకుండా అడ్డుపడే చంచలత్వం యొక్క ఊగులాటలను స్థిర పరిచినప్పుడు మరియు మన చైతన్యాన్ని భగవంతుడి ప్రేమ మరియు కాంతి యొక్క నిరీక్షణ కౌగిలికి అప్పగించినప్పుడు మనలో అత్యంత లోతైన మార్పులు వస్తాయి. మనం ఆయనను గాఢంగా ప్రార్థిస్తూ, మన మెదడు యొక్క కణాలలోకి స్వేచ్ఛ, సృజనాత్మక, సాధ్యతల కారణాత్మక కాంతి చొచ్చుకొని పోతుందని ఊహిస్తున్నప్పుడు, అది అవాంఛిత అలవాట్ల యొక్క స్థిరమైన “గాడులు”ను నిర్మూలించగలదు, మరియు మన చైతన్యాన్ని దివ్య సామరస్యంతో మరియు మన స్వీయ అత్యున్నత శ్రేయస్సుకోసం నవ్య సంకల్పంతో మన ఆలోచనలు మరియు ప్రవర్తన యొక్క తీర్మానాలకు అనుకూలంగా మార్ధవం చేస్తుంది. భగవంతుని ఆశీస్సులు, మీ భక్తి మరియు పరివర్తనకు మీ మనఃపూర్వకమైన సమ్మతి మీ జీవితాన్ని, మీకు మరియు ఇతరులకు సంతోషపు నూతన ఉషోదయాన్ని తీసుకువచ్చే విధంగా మార్చగలదనే అచంచలమైన విశ్వాసంతో మీరు రాబోయే సంవత్సరంలోకి ప్రవేశించండి.

మీకు, మీ ఆప్తులకు నిండు ఆశీస్సులు మరియు సఫలీకృతమగు నూతన సంవత్సర శుభాకాంక్షలు,

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఇతరులతో షేర్ చేయండి