శ్రేయస్సు చైతన్యాన్ని సృష్టించడం

పరమహంస యోగానందగారి జ్ఞాన వారసత్వ సంపద నుండి ఎంపికలు
ఎస్.ఆర్.ఎఫ్. పత్రిక యొక్క స్ప్రింగ్ 2009 సంచికలోని ఒక కథనం నుండి సారాంశాలు,“శ్రేయస్సు చైతన్యాన్ని సృష్టించడం: కష్ట సమయాల్లో మరియు మంచి సమయాల్లో మీ ఆవశ్యకతలను ఆదుకోడానికి, సమృద్ధి చట్టాన్ని సక్రియం చేయడానికి తొమ్మిది ఆధ్యాత్మిక సూత్రాలు.”

ప్రపంచం కోసం దేవుని ప్రణాళిక సమృద్ధి మరియు ఆనందం అని తెలుసుకోండి
సమృద్ధి, భౌతిక మరియు ఆధ్యాత్మికం అనేది, రిత అనే విశ్వ చట్టం లేదా సహజ ధర్మం యొక్క నిర్మాణాత్మక వ్యక్తీకరణ….

వాస్తవికత యొక్క అంతర్భాగంలోకి చొచ్చుకుపోయిన ప్రతి మహాత్ముడు ఒక దివ్య సార్వత్రిక ప్రణాళిక ఉందని, అది సుందరమైనది మరియు ఆనందభరితమైనదని నిరూపించారు.

దేవుడు మరియు క్రైస్తవ సహోదరత్వం యొక్క చట్టం ప్రకారం, ఈ భూమి మొత్తం మానవాళికి ఆశ్రయం కల్పించడానికి మరియు అవసరాలకు సరఫరాను అందించడానికి ఉద్దేశించబడింది; గనుల సంపద మరియు ఇతర వనరులను సమాన శ్రమము చేసే వారికి సమానంగా పంచాలి. మరియు దేవుడు దివ్య జన్మహక్కు యొక్క చట్టాన్ని స్థాపించాడు: అందరు పురుషులు మరియు స్త్రీలు అతని స్వరూపంలో తయారుచేయబడ్డారు, అందువల్ల సహజంగా అందరూ దివ్యమైన వారు; మరియు అన్ని దేశాలు ఒకే రక్తానికి చెందినవి, మరియు ఒకే తల్లిదండ్రులు ఆడమ్ మరియు ఈవ్ యొక్క వారసులు.

మీరు ఈ ప్రాథమిక సంబంధాన్ని విశ్వసిస్తే, మీరు మీ స్వంత కుటుంబం పట్ల ప్రేమను ప్రపంచ నివాసులందరిపై కలిగి ఉంటే, బాహ్యంగా భిన్నమైన జాతీయుల మధ్య ఎటువంటి అంతర్గత వ్యత్యాసాన్ని గుర్తించకపోతే, మీరు భూమి యొక్క ధనములో మీ వాటాకు చట్టబద్ధమైన హక్కును ఏర్పరుచుకుంటున్నారు.

తమ శ్రేయస్సును మాత్రమే కోరుకునే వారు చివరికి పేదలుగా మారడం లేదా మానసిక అశాంతికి గురవుతారు; అయితే మొత్తం ప్రపంచాన్ని తమ నివాసంగా భావించేవారు మరియు సమూహం లేదా ప్రపంచ శ్రేయస్సు కోసం నిజంగా శ్రద్ధ వహించే మరియు పని చేసేవారు, సూక్ష్మ శక్తులను సక్రియం చేస్తారు, చివరికి వారిని చట్టబద్ధంగా తమకు చెందిన వ్యక్తిగత శ్రేయస్సును కనుగొనే ప్రదేశానికి దారి తీస్తారు. ఇది ఖచ్చితంగా రహస్య చట్టం.

ఒకరు అభివృద్ధి చెందడం అనేది ఒకరి సృజనాత్మక సామర్థ్యంపై మాత్రమే ఆధారపడి ఉండదు, అతని గత చర్యలు మరియు కర్మ సిద్ధాంతాన్ని సక్రియం చేయడానికి అతని ప్రస్తుత కృషిపై కూడా ఆధారపడి ఉంటుంది. మానవజాతి మొత్తం నిస్వార్థంగా ప్రవర్తిస్తే, ఆ సిద్ధాంతం యొక్క శక్తి, మినహాయింపు లేకుండా పురుషులందరికీ సమానంగా శ్రేయస్సును పంచుతుంది. శక్తివంతమైన మంచి ఆలోచనలు మరియు చర్యల ద్వారా, సానుకూల శ్రేయస్సును సృష్టించడానికి ఈ సూక్ష్మ శక్తిని ప్రేరేపించే వారు, సంపన్నమైన లేదా పేదరికంతో బాధపడుతున్న వాతావరణంలోనైనా, వారు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తారు.

శ్రేయస్సు సృష్టించడానికి కారణం మరియు ప్రభావం యొక్క చట్టాన్ని ఉపయోగించండి
శ్రేయస్సు అంతా మనిషికి కారణం మరియు ప్రభావం (కర్మ) యొక్క చట్టం ప్రకారం వెలకట్టబడుతుంది, ఇది ఈ జీవితాన్ని మాత్రమే కాకుండా గత జీవితాలను కూడా శాసిస్తుంది. అందుకే బుద్ధిమంతులు పేదవారిగా లేదా అనారోగ్యంగా పుట్టవచ్చు, సామాన్య మేధస్సు ఉన్నవాడు ఆరోగ్యంగా మరియు ధనవంతుడుగా పుట్టవచ్చు. మానవులందరూ దైవాంశతో చేయబడినవారు కనుక ప్రథమంగా దైవ సంతానం, స్వేచ్ఛా మరియు సమానమైన సాఫల్య శక్తిని కలిగి ఉండేవారు. కానీ దేవుడు తనకిచ్చిన హేతు బుద్ధి మరియు సంకల్ప శక్తిని దుర్వినియోగం చేయడం ద్వారా, మనిషి సృష్టి నియమము అయిన కారణం మరియు చర్య యొక్క ప్రభావం (కర్మ) నియంత్రణలో పడిపోయాడు తద్ద్వారా జీవితాన్ని విజయవంతం చేసుకునే స్వేచ్ఛను పరిమితం చేసుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క విజయం అతని తెలివితేటలు మరియు సమర్థతపై మాత్రమే కాకుండా అతని గత చర్యల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

అయితే, గత చర్యల యొక్క అననుకూల ఫలితాలను అధిగమించడానికి ఒక మార్గం ఉంది. వైఫల్యానికి గల కారణాలను నాశనం చేయాలి మరియు విజయానికి కొత్త కారణాన్ని ప్రారంభించాలి.

విజయం మరియు శ్రేయస్సు యొక్క అధిచేతనా మూలాన్ని సంప్రదించండి
చేతన మనస్సు మాత్రమే ఏ దిశలోనైనా సానుకూల విజయాన్ని తెచ్చే కొత్త కారణాన్ని ప్రారంభించదు; కానీ మానవ మనస్సు తనను తాను భగవంతునితో ఏకాత్మికమైనప్పుడు (attune), అధిచేతనా స్థితిలో, అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది; ఎందుకంటే అధిచేతనా మనస్సు భగవంతుని అపరిమిత శక్తికి అనుగుణంగా ఉంటుంది తద్ద్వారా విజయానికి కొత్త కారణాన్ని సృష్టించగలదు.

సంపూర్ణ విజయం “మీ అపరిమిత అధిచేతనా శక్తిని (superconscious power) అభివృద్ధి చేయడం ద్వారా మీకు అవసరమైన వాటిని ఇష్టానుసారంగా సృష్టించే శక్తి”ని సూచిస్తుంది. భారతదేశం యొక్క భగవత్ సాక్షాత్కారం పొందిన గురువులు బోధించినట్లుగా, ధ్యానం యొక్క ఖచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకోవడం వలన ఈ అతీంద్రియ శక్తిని మేల్కొల్పవచ్చు. శ్రేయస్సు, ఆరోగ్యం, విజయం, జ్ఞానం, మరియు భగవత్సంసర్గాన్ని, ఏ సమయంలోనైనా, ఇష్టానుసారం మరియు అపరిమితంగా ఉత్పత్తి చేయడానికి మనస్సు కర్మాగారం యొక్క మానసిక యంత్రాంగాన్ని నియంత్రించే కళలో భారతదేశం ప్రత్యేకతను పొందింది.

పాశ్చాత్య సోదరులు మరియు సోదరీమణులు మనస్సు దాని ఆవిష్కరణల కంటే మనస్సే గొప్పదని తెలుసుకోవాలి. శాస్త్రీయమైన సర్వతోముఖ విజయాన్ని సాధించడానికి మనస్సును నియంత్రించే కళకు ఎక్కువ సమయం ఇవ్వాలి. సర్వం సాధించగలిగే, సర్వ-శక్తివంతమైన మనస్సు యొక్క పురోగతి నిర్లక్ష్యం చేయకుండా మనస్సు యొక్క ఉత్పత్తులను సంపాదించడానికి తక్కువ సమయం ఇవ్వాలి….

ఆరోగ్యం మరియు శాంతి లేని సంపద విజయం కాదని ధ్యానం ద్వారా తెలుసుకో, మరియు అవసరాలకు డబ్బు లేకుండా శాంతి మరియు ఆరోగ్యం సంపూర్ణమైన లేదా విజయవంతమైన జీవితాన్ని పొందలేవని తెలుసుకోండి. భారతదేశం బోధించిన మార్గాన్ని అనుసరించండి: మనస్సుపై అధిచేతనను మరియు సంపూర్ణ నియంత్రణను పొందండి; అప్పుడు మీరు మీకు కావలసిన వాటిని ఇష్టానుసారం సృష్టించవచ్చు.

ప్రతిజ్ఞ యొక్క సాక్షాత్కార శక్తిని అభ్యసించండి
అన్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక బహుమతులు [దేవుని] అనంతమైన సమృద్ధి నుండి ప్రవహిస్తాయి. అతని బహుమతులను పొందాలంటే, మీరు మీ మనస్సు నుండి పరిమితి మరియు పేదరికం యొక్క అన్ని ఆలోచనలను నిర్మూలించాలి. విశ్వజనీనమైన మనస్సు పరిపూర్ణమైనది మరియు లోటు తెలియనిది; ఎప్పుడూ విఫలం కాని అనుగ్రహాన్ని చేరుకోవడానికి మీరు సమృద్ధి చైతన్యాన్ని కలిగి ఉండాలి. తదుపరి రూపాయి ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలియనప్పుడు కూడా, మీరు భయపడటానికి నిరాకరించాలి. మీరు మీ వంతు చేసి, దేవునిపై ఆధారపడినప్పుడు, నిగూఢ శక్తులు మీ సహాయానికి వస్తాయని మరియు మీ నిర్మాణాత్మక కోరికలు త్వరలో కార్యరూపం దాల్చుతాయని మీరు కనుగొంటారు. ఈ విశ్వాసం మరియు సమృద్ధి యొక్క చైతన్యం ధ్యానం ద్వారా సాధించబడతాయి.

ప్రతిజ్ఞ: “భగవంతుడు నా స్వంత తరగని దివ్య నిధి. నేను విశ్వ భాండాగారమునకు ప్రాప్యత కలిగి ఉన్నందున, నేను ఎల్లప్పుడూ ధనవంతుడినే. నాకు అవసరమైన సమయంలో, నాకు అవసరమైనది తీసుకురావడానికి, సర్వవ్యాప్తమైన – మేలు అనే శక్తిపై పరిపూర్ణ విశ్వాసంతో నేను ముందుకు వెళ్తాను.”

ఇతరులతో షేర్ చేయండి