ప్రియతములారా,
31 జూలై, 2015
భారతదేశ గురువులకు నివాళులు అర్పించే భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు జరుపుకునే ఈ పవిత్రమైన గురుపూర్ణిమ రోజున, మనం మన ప్రియమైన గురుదేవులు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి హృదయపూర్వక భక్తి మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదాభివందనం చేద్దాం. మాయ అనే చీకటి నుండి ఆయనని (దేవునిని) కనుగొనటానికి కావాల్సిన వెలుగులోకి మరియు స్వేచ్ఛలోకి చేసే ప్రయాణంలో మనకు శాశ్వతమైన స్నేహితుడిగా మరియు మార్గదర్శకుడిగా (గురువు) ఉండటానికి దేవుడు తన ప్రేమ యొక్క స్వచ్ఛమైన మార్గానికి మనలను చేర్చినందుకు మనం ఎంత ధన్యులమో. మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని మరియు మనస్సును గురువు యొక్క ప్రేమ మరియు దివ్య జ్ఞానాన్ని పొందడానికి కొత్తగా తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను అపుడు, గురువు ఒక్క అత్యంత ప్రియమైన కోరిక—మీ ఆత్మను భగవంతునితో ఐక్యం చేయటము అనేది, ఆయన మీ కోసం నెరవేర్చగలడు.
జీవితకాలమంతా మీరు అహం అనే చిన్న పంజరంలో జీవించి ఉండవచ్చు—దాని పరిమితులను, అది మీ ఆనందంపై ఉంచే పరిస్థితులను మరియు ఈ ప్రపంచంలోని అనూహ్య పరిస్థితులకు దాని దుర్బలత్వాన్ని అంగీకరిస్తూ ఉండవచ్చు. ఆత్మ యొక్క వీరోచిత లక్షణాలను ప్రేరేపించడానికి గురువు వస్తాడు, దాని ద్వారా మన సహజమైన దైవత్వం యొక్క వ్యక్తీకరణకు ఆటంకం కలిగించే వాటన్నింటినీ అధిగమిస్తాము. గురూజీ తన గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గురించి ఇలా అన్నారు: “ఆయన నా నుండి పరిపూర్ణతను కోరుకున్నాడు. నేను చాలా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అదే ఆయన సంతోషం. నేను దేవుణ్ణి తెలుసుకోవాలని; నా హృదయం కోరుకునే జగన్మాతతో ఉండాలని ఆయన కోరుకున్నాడు.” మా గురువుగారి కోరిక కూడా అదే. ఆయన ఇచ్చిన సాధనను నమ్మకంగా ఆచరించినప్పుడు, తప్పకుండా ఆ లక్ష్యానికి దారితీస్తుంది మరియు “దేవుడు నిన్ను నా దగ్గరకు పంపాడు, నేను నిన్ను ఎప్పటికీ విఫలం చేయను” అని ఆయన మనకు హామీ ఇచ్చారు. ఆయన వాగ్దానంలో అంతర్లీనంగా ఉన్న షరతులు లేని ప్రేమ, స్థలం మరియు సమయం యొక్క అన్ని సరిహద్దులను అధిగమించి, మీరు భగవంతుని స్పృహను చేరుకునే వరకు మిమ్మల్ని కాపాడుతుంది. శిష్యుని యొక్క బాధ్యత ఏమిటంటే గురువు యొక్క ప్రేమను అన్ని వైఖరులలో గుర్తించడం మరియు స్వీకరించడం—గురువు యొక్క మార్గనిర్దేశక మాటలలో, ఆయన మనకు నెరవేర్చిన ప్రార్థనలలో మరియు ముఖ్యంగా శిష్యుని విశ్వాసం మరియు ఓర్పును విస్తరించి, ఎదగడానికి మరియు మారడానికి కొత్త అవకాశాలను అందించే సవాళ్లు మరియు కష్టాలలో. మనలో గురుదేవునితో ఉన్నవారు తరచుగా ఇది గమనించారు, మనం ఆధ్యాత్మిక పురోగతి యొక్క కొత్త స్థాయిని చేరుకున్నామని మనం భావించినప్పుడు, ఆయన “మనము చేరవలసిన ఆధ్యాత్మిక ప్రమాణాలు పెంచుతారని” కనుగొన్నాము. “నేను చేయలేను” అనే ఆలోచనను మా స్పృహ నుంచి తీసివేయటాని నేర్చుకున్నాము మరియు ఆయన మిమ్మల్ని అదే అడుగుతాడు—కొంచెం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మీరు ఇష్టపడటం ద్వారా, మీరు ఆయన ఆశీర్వాదాల సంపూర్ణతను పొందుతారు. మానవ స్వభావం ప్రతిఘటిస్తే, అప్పుడు నైపుణ్యంగా హేతుబద్ధీకరించే మనస్సును విస్మరించి, భగవంతుణ్ణి విశ్వసించమని మరియు శరణాగతి కోరమని మనల్ని ప్రేరేపించే హృదయపూర్వక భక్తి యొక్క నిశ్శబ్ద స్వరాన్ని వినాల్సిన సమయం అది అని గ్రహించాలి. గురువు యొక్క శుద్ధి చేయగల, పరివర్తన కలిగించగల శక్తిని పొందడానికి మన మనస్సులోని ప్రతి మూసివున్న తలుపును తెరిచే కీలకం శరణాగతి కోరడమే.
గురుదేవునికి మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మీ స్వంత మోక్షానికి ఆయనతో సహకరించడమే. ఆయన ప్రమాణాలు చాలా పెద్దవి, అయినప్పటికీ వాటిని చెరటానికి ఆయన అనంతమైన కరుణతో మీకు మార్గనిర్దేశం చేస్తారు, ఎందుకంటే ఆయన మీలోని దైవ ప్రతిమను చూస్తాడు మరియు గౌరవిస్తాడు మరియు మీరు కూడా దానిని గౌరవించాలని కోరుకుంటాడు. ఆయన బోధించిన సత్యాలను అన్వయించుకోమని మరియు మాయకు అందని ఆత్మ-నిశ్శబ్దంలో ప్రతిరోజూ ఆయనతో అనుసంధానం కావాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అక్కడ మీరు అత్యంత స్పష్టంగా ఆయన ఉనికిని అనుభూతి చెందుతారు మరియు ఆయన ద్వారా ప్రవహించే దేవుని శక్తి, స్వల్పమైన “నేను” అనే అహం యొక్క పరిమితులను తొలగించి, మీరు నిజమైన దైవ స్వరూపంగా మారతారు. జై గురూ!
భగవంతుని మరియు గురుదేవుల ప్రేమ మరియు ఎడతెగని ఆశీర్వాదాలతో,
శ్రీ శ్రీ మృణాళినీమాత
కాపీరైట్ © 2015 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.