
ప్రియుతములారా,
భగవాన్ శ్రీ కృష్ణుని జన్మాష్టమి జన్మోత్సవ వేడుకలను జరుపుకునే లక్షలాది మంది ప్రపంచవ్యాప్త భక్తులతో జతకూడిన మనందరికీ, ఆయన జీవితం మరియు అమర బోధల యొక్క పరిశుద్ధ మార్గం నుండి ప్రవహించే భగవంతుని ప్రేమ మరియు ఆనందం యొక్క అనిర్వచనీయమైన పిలుపుతో మన హృదయాలు పునః ఉత్తేజితమవుతాయి. భగవద్గీత దివ్య గీతం ద్వారా, మాయ-బంధిత అహం నుండి మన దృష్టిని తిరిగి మనలోని శాశ్వతమైన ఆత్మస్వేచ్ఛ, పరమానందం వైపు మళ్ళించగలిగిననాడు, జన్మజన్మల నుండి మనం అన్వేషించిన శాశ్వతమైన ఆనందం మనకు చేరువలోనే ఉంటుందని తెలుసుకొనేల శ్రీకృష్ణుడు మనకు ఎప్పుడూ ప్రేరణనిస్తాడు. అస్థిర ప్రపంచం నుండి పరిపూర్తిని వెదకడానికి మనం అలవాటు పడ్డాము, అయినా మళ్ళీ మళ్ళీ నిరాశకు గురవుతాము. కానీ గీతలో, కృష్ణుడు అర్జునుడికి, మరి అస్థిరమయ సుఖదుఃఖాల యొక్క కల్లోలాతో విసిగిపోయిన వారందరికీ, ఆ ఆవృత్తిలను ఎలా విచ్ఛిన్నం చేయాలో ఉపదేశించాడు: అహం యొక్క స్వీయ-పరిమితి, కార్యా కారణ అలవాట్లను అధిగమించడం ద్వారా మరియు మన ఆత్మ కోరుకునే సర్వ మూలాధారమైన దైవాన్ని అనుసరించడం ద్వారా.
మన చైతన్యాన్ని పునఃసమీక్షించుకోవడమే మన శ్రేయస్సుకు, పరుల శ్రేయస్సుకు, ఈ ప్రపంచ శ్రేయస్సుకు మనం చేసే గొప్ప సహయం. కృష్ణుడు అర్జునుడికి ప్రేరణ గావించినట్లుగానే,అహంకారాన్ని జయించడానికి ఈ ఐహిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ధ్యానం మరియు నిస్వార్థ కార్యకలాపాలు రెండూ అవసరం. ధ్యానం యొక్క గాఢమైన నిశ్చలతలో దేవుని పరివర్తనా ఉనికి యొక్క వాస్తవికతను అనుభూతి చెందుతాం; అలాగే మనం దైనందిన పనుల్లో నిమగ్నమైనప్పుడు భగవంతుణ్ణి సన్నిహితంగా నిలుపుకోడం ద్వారా మన అహంపూర్విక ప్రభావాన్ని నిరోధించే శక్తిని పెంపొందించుకుంటాం.
మన ఆధ్యాత్మిక మరియు ఐహిక కార్యకలాపాల యొక్క స్వేచ్ఛా శక్తికి మూలం మన అభిమతమే. అహం అధికారంలో ఉండి, మన కర్మ ఫలాల మీద ఆశతో మీరు ఉన్నంత కాలం, మనం మాయ యొక్క ఆటుపోట్లుకు గురి అవుతూ ఉంటాము. దానికి బదులుగా మన౦ భగవంతుని లోనే లంగరు వేసుకొని ఉన్నపుడు, ఆయన కోసమే పని చేసినప్పుడు, మన జీవిత౦ ఎ౦త సరళ౦గా, స౦తోష౦గా మారిపోతుందో కదా. మీరు వ్యక్తిగత లాభం కోసం లేదా ఇతరుల నుండి గుర్తింపు కోసం దేనిమీదైనా కష్టపడి పనిచేస్తే, ఫలితం గురించిన ఆందోళనలు తరచుగా మీ మనస్సును మసకబారుస్తాయి. కానీ ఏదైనా ఉదాత్తమైన భౌతిక లేదా ఆధ్యాత్మిక ప్రయత్నాన్ని భగవంతునికి బహుమతిగా మీరు భక్తితో అంతర్గతంగా సమర్పిస్తే, మీకు అంతే ఉత్సాహం సాఫల్యత కోసం ఉంటుంది; కాని అపుడు మీ ప్రయత్నాలను సమబుద్ధితో ఆయన ఆశీస్సుల ఉంటాయనే భరోసాతో, చేయవచ్చు. భగవంతుడు కృష్ణుని ద్వారా అర్జునుడికి ఇలా ఉపదేశించాడు: “అన్ని కార్యకలాపాలను నాకు విడిచిపెట్టు! అహంకారం, ఆకాంక్షలు లేకుండా, నీ దృష్టి ఆత్మపై కేంద్రీకృతముచేసి, చింతలతో పరితపించక, పోరాటములో (కార్యకలాపాలలో) నిమగ్నం కమ్ము.” అదే విధ౦గా, మీరు ఒక అలవాటును మార్చుకోవాలనుకున్నపుడు, దాని గురించే ఎక్కువ ఆలోచించటము బదులు, దాన్ని (ఆ అలవాటును) మరియు ఆ అలవాటును అధిగమి౦చే౦దుకు మీరు చేసే మనఃపూర్వకమైన ప్రయత్నాలతోపాటు దేవుని పాదాల దగ్గర విడిచిపెడితే, అప్పుడు ఆయన సహాయం పొందటానికి మీరు సన్నద్ధ౦గా ఉ౦టారు. ధ్యానంలో కూడా, ఫలితాల కోస౦ అశాంతి, ఆత్రుతతో కలతచెందకు౦డా మీ ప్రయత్నాలను దేవునికి అర్పిస్తే, అప్పుడు మీరు ఈశ్వరుని ప్రతిస్పందనా ఆశీస్సులకు మరింత గ్రహణశీలంగా ఉంటారు.
శ్రీ కృష్ణభగవానుడు ఉపదేశించిన విధముగా పరమాత్ముడిలో మీ దైనందిన ఆధ్యాత్మిక, ఐహిక కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా, మానసిక ఒత్తిడి మరియు నైరాశ్యము యొక్క చిత్త భారాలు క్షీణగతి పొందటము మీరు చూస్తారని, దాని స్థానంలో ప్రశాంతత మరియు భగవంతుడిలో స్థిరపడిన హృదయం యొక్క సానుకూల, ఆనందదాయకమైన ఆత్మను మీరు కనుగొనాలని, ఎల్లప్పుడూ మీకు నా ప్రార్థనలు ఉంటాయి. ఒకప్పటి ప్రభలమైన ఐహిక చైతన్యం మీపై తన అధికారాన్ని కోల్పోతుంది, మరియు మీరు అచంచలమైన అంతర్గత శాంతి మరియు దివ్య ఆనందం అనే ఆత్మ విజయాన్ని పొందుతారు.
భగవంతుని మరియు గురువుల దివ్య ప్రేమలో,
శ్రీ శ్రీ మృణాళినీమాతకాపీరైట్ © 2017 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.