భారతదేశంలోని విషాదకరమైన వరదల గురించి శ్రీ శ్రీ మృణాళినీమాత నుండి సందేశం

ప్రియతములారా,

జూలై 22, 2013

గురుదేవులు పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మా అందరి ప్రార్థనలు, గాఢమైన సానుభూతి మరియు ప్రేమపూర్వక ఆలోచనలు “హిమాలయ సునామీ” అని పిలువబడే విషాద సంఘటన నుండి మన ప్రియమైన భారత మాతకు మరియు ఆమె పిల్లలకు విస్తరించాయి. ఈ విపత్తు యొక్క పరిమాణాన్ని కేవలం మాటలలో వ్యక్తీకరించలేము, కానీ ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నాము.

తమ భౌతిక దేహాలను అకస్మాత్తుగా పోగొట్టుకున్న భారతమాత ప్రియ బిడ్డల కోసం, వారు ఇప్పుడు పరమాత్మలో గొప్ప శాంతిని పొందారని తెలుసుకోవడం మాత్రమే మాకు ఓదార్పునిచ్చింది. భగవంతుని అవతారాలు, సాధువులు మరియు భక్తులచే యుగయుగాలుగా పవిత్రం చేయబడిన ఆ పవిత్ర పరిసరాలలో, సమాధి ధ్యానంలో దేవునితో వారి దివ్య సంసర్గపు ప్రకంపనలు – నివాసితులకు మరియు తీర్థయాత్రకు వెళ్ళే వారందరికీ వారు ఆశీర్వాదం కోసమే యాత్రకు వచ్చారని నిరంతరం గుర్తుచేస్తూ ఉంటాయి, గాఢమైన భక్తి మరియు విశ్వాసంతో వారి ఆలోచనలు పదే పదే దేవుని వైపుకు తిరుగుతాయి. ఆ సంఘటనతో వారి భూసంబంధమైన జీవితాలు అకస్మాత్తుగా ముగిశాయి, ఆ భక్తి ప్రకంపనలలో వారి చైతన్యపు తలుపులు అప్పటికే తెరుచుకున్నాయి, ఇది మర్త్య చీకటి నుండి వెలుతురు, ప్రశాంతతల భూమిలోకి వారి ప్రయాణాన్ని సులభతరం చేసింది. విశ్వ కాలపు కొద్ది క్షణాలలోనే, పరమాత్మ వారిని కరుణతో కూడిన ప్రశాంతత మరియు ప్రేమతో చుట్టుముట్టగా వారు భ్రాంతి అనే పీడకల నుండి అన్ని అవగాహనలను అధిగమించే శాంతిలోకి మేల్కొన్నారు.

కానీ ప్రియమైన వారిని, గృహాలను, ఉపాధిని కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న క్షతగాత్రుల కోసం మా గాఢమైన ప్రార్థనలు సాగుతూనే ఉంటాయి. భారతీయ మరియు ప్రపంచవ్యాప్త శ్రేయోభిలాషులు వారికి సహాయాన్ని అందించాలని మరియు కోలుకోవడానికి అవసరమైన అన్ని మార్గాలను అందించాలని మేము ప్రార్థిస్తున్నాము. గురుదేవుల సమాజం కూడా ఈ ప్రయత్నంలో చేరింది. దివ్య మేలుకొలుపు ద్వారా ఆ పీడకల కూడా పారద్రోలబడేటట్లు దేవుడు వారికి ధైర్యం, బలం మరియు విశ్వాసంతో ఆశీర్వదించాలని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఈ అసంపూర్ణ భౌతిక సృష్టిలో భాగమైన వెలుగు మరియు చీకటి, మంచి మరియు చెడుల మధ్య యుద్ధం తాలూకు విషాదాలు తరచుగా మన దివ్య గురుదేవుని కరుణాపూరిత హృదయంలో లోతైన గాయాలను మిగిల్చాయి, సర్వవ్యాపకత్వం నుండి ఆయన సహాయం మరియు ఆశీర్వాదాలు ఇప్పుడూ కొనసాగుతున్నాయని నాకు తెలుసు. ఆమె పిల్లల జీవితాలు ఆమె ప్రేమ మరియు ఆశీర్వాదాలతో నిండటానికి మరియు అవసరమైన సమయాల్లో వారికి సహాయం చేయడానికి జగన్మాతతో మధ్యవర్తిత్వం వహించడంలో ఆయన తన జీవితాన్ని గడిపారు. మాయా బంధాల నుండి తమను తాము ఇంకా విడిపించుకోని వారందరినీ బాధించే వారి దుఃఖాల వాస్తవికత ఆయనకు తెలుసు మరియు అనుభవించారు.

అదే సమయంలో ఆయన మాకు ఈ విధంగా గుర్తు చేశారు, “ఈ భూమి మన ఇల్లు కాదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మన ఇల్లు భగవంతునిలో ఉంది”. మీ జీవితం చాలా భయాందోళనలతో సందర్శింపబడుతుంది, మీరు ఈ ప్రపంచాన్ని సఫలత మరియు శాంతి కోసం చూస్తే అవి మీకు అర్థం కావు. బదులుగా, విషాదాలు కేవలం మీ మర్త్య జీవితమనే కలలో భాగంకావాలంటే లోతైన ఆధ్యాత్మిక ప్రయత్నం ద్వారా ధ్యానంలో, మీరు దేవునిలో ఎంతగా కుదురుకోవాలంటే మీరు “ముక్కలైపోతున్న ప్రపంచ వినాశం మధ్య స్థిరంగా” నిలబడగలిగేటంతగా. ప్రభువు మనకు గుర్తుచేస్తున్నాడు: “మార్పులేని దానిలో కుదురుకోండి.” “దాని” అనేది దేవుని యొక్క ఎడతెగని ప్రేమ, మరియు ప్రభువు యొక్క సర్వవ్యాపకత్వం ఆయన పిల్లల నుండి ఒక ఆలోచన కంటే ఎప్పుడూ ఎక్కువ దూరం కాదు. తన ప్రేమ, భద్రత మరియు ఎప్పటికీ విఫలం కాని ఆయన దివ్య సంరక్షణ యొక్క మధురమైన సంగ్రహావలోకనంతో మనలను ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాడు.

మా రోజువారీ ధ్యానాలలో, జన్మ జన్మలుగా మనల్ని కాచుకున్న, మరియు భ్రాంతిమయ స్వప్నం నుండి ముడుచుకొని ఆయన కాంతిమయ ఉనికిలోకి మనల్ని మేల్కొలపడానికి ఆరాటపడే వ్యక్తిలో ఆశ్రయం, శాంతి మరియు స్వస్థత పొందగలరని ఈ కల్లోల ప్రపంచంలో బాధలు పడుతున్న వారందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటాము.

దేవుడు మరియు గురుదేవుల ప్రేమ మరియు ఎడతెగని ఆశీర్వాదాలతో.

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఇతరులతో షేర్ చేయండి