భూమి మీద శాంతి కోసం ప్రార్థన

సంవత్సరాల క్రితం, శ్రీ పరమహంస యోగానందగారు “భూమిపై శాంతి కోసం ఈ క్రింది ప్రార్థన”ను అందించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా శాంతిని వ్యాప్తి చేయడంలో సహాయం చేయడానికి అందరూ ఉపయోగించగల మార్గదర్శక ధ్యానం. 60 సంవత్సరాల క్రితం పరమహంసగారు అందించిన భగవంతుని ఈ శక్తివంతమైన ఆశీస్సుల ఆవాహన గురించి పరిచయం చేస్తూ, శ్రీ దయామాత ఇలా వ్రాశారు: “ఈ రోజు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిలో పాల్గొనే వేలాది మంది భక్తులను పరమహంసగారి సమయానుకూలమైన మాటల స్ఫూర్తితో, ప్రజలందరి మధ్య మరియు అన్ని దేశాల మధ్య ప్రపంచ శాంతి మరియు సామరస్యం కోసం ప్రతిరోజూ చేసే ప్రార్థనల్లో చేరమని నేను కోరుతున్నాను.”

“పరమేశ్వరా, జగన్మాతా, సఖా, ప్రియదైవమా! నా భక్తి అనే గర్భగుడిలో నీ ప్రేమ సదా ప్రకాశించుగాక, అందరి హృదయాలలో నీ ప్రేమను మేల్కొల్పగలిగేదనుగాక.”

మీ కళ్ళు మూసుకొని, దివ్యచైతన్యానికి కేంద్రమైన కనుబొమ్మల మధ్య ఏకాగ్రతను గాఢంగా కేంద్రీకరించండి. భగవంతుని అనంతమైన ప్రేమను మీ హృదయంలో అనుభూతి పొందండి. మీ హృదయంతో ప్రపంచమంతా ఆ ప్రేమను ప్రసరింపజేయండి. యుద్ధ మేఘాలు మసకబారాలని గాఢంగా ప్రార్థించండి. ఆకాశములో ఎప్పుడూ సూక్ష్మంగా కంపించే మంచితనం మరియు ప్రేమ యొక్క స్వర్గపు శక్తులు, వైరుధ్యం మరియు శత్రుత్వం వంటి సాతాను సూచనల ద్వారా మనుష్యుల హృదయాలు మరియు మనస్సులలో ఆధిపత్యం చెలాయించకూడదని హృదయపూర్వకంగా మనం భగవంతుడిని ప్రార్థిద్దాం. ఎందుకంటే చెడు యొక్క శక్తులు ఆక్రమణకారులుగా ఉంటే, మంచితనం యొక్క శక్తులు వినయపూర్వకంగా మరియు నిరాడంబరంగా ఉంటాయి.

“పరమేశ్వరా,యుద్ధం యొక్క చీకటి మేఘాల క్రింద నివసిస్తున్న మా సోదరులు మరియు సోదరీమణులను, మాయ యొక్క అజ్ఞానం మరియు ద్వేషం యొక్క వ్యామోహం నుండి విముక్తి పొందేలా ఆశీర్వదించండి; మరియు ప్రేమ మరియు శాంతిని ఏకం చేసే నీ నిస్సంకోచమైన శక్తి దుష్ట శక్తులను జయించగలగాలి. మనము అందరికీ మన ప్రగాఢమైన ప్రేమను పంపుతాము, వారు నీ సోదరభావం మరియు అవగాహన యొక్క కాంతిని అందుకొని తద్ద్వారా ఒకరినొకరు నాశనం చేసుకోవడం మరియు ప్రపంచవ్యాప్తంగా నిరాశ, విపత్తు మరియు విధ్వంసం యొక్క సామూహిక కర్మలను తీసుకువచ్చే చెడు ప్రకంపనలను సృష్టించడం మానేయడానికి మార్గనిర్దేశం పొందగలరు.”

భూమిపై విధ్వంసానికి బదులుగా శాంతి మరియు అంతర్జాతీయ శ్రేయస్సును తీసుకురావాలని, నియంతలు, ప్రధానమంత్రులు మరియు అన్ని దేశాల అధినేతల హృదయాలలోకి అంతరిక్షం ద్వారా మీ ప్రేమ ఒక అదృశ్య ఎక్స్-రే లాగా ముందుకు వెళుతున్నట్లు భావించండి. ప్రపంచంలోని ప్రజలందరినీ మీ ప్రేమ యొక్క శక్తివంతమైన కిరణ ప్రసారణలో చేర్చండి. మన ప్రేమ యొక్క ఐక్య స్వస్థత కిరణాలు మన తండ్రి యొక్క అనంతమైన ప్రేమతో నింపబడి, సమస్త భూమిని పావనము చేసి, ప్రపంచంలోని నాయకులందరికీ మరియు పౌరుల హృదయాలకు ప్రసరింపజేయండి, తద్ద్వారా వారు ఆత్మల సార్వత్రిక స్నేహం మరియు సామరస్యంతో నిండి ఉంటారు—దేవుని పితృత్వం క్రింద, భూమిపై అందరి పట్ల సద్భావన మరియు శాంతిని తెస్తుంది.

“పరమేశ్వరా, భూమిపై ఉన్న దేశాలను, మా స్వంత పెద్ద కుటుంబాన్ని, అందరూ నీ పిల్లలుగా తమ శాశ్వతమైన బంధుత్వాన్ని గ్రహించగలరని ఆశీర్వదించండి. నీవే మా ఏకైక ఆధ్యాత్మిక తండ్రి, విశ్వానికి ప్రియమైనవాడివి మరియు మా హృదయాలకు ప్రియమైనవాడివి. ఈ రోజు మనం ప్రసారం చేస్తున్న ప్రేమ యొక్క బలమైన ఆలోచనలు నియంతలు మరియు సైన్యాధిపతుల యొక్క మెదడులను స్వాధీనము చేసికొని, అవి నీ జ్ఞానంతో నిండి మరియు మానవత్వం యొక్క సాధారణ వినాశనం వైపు పని చేయకుండా నిరోధించండి. వారందరినీ ఆశీర్వదించండి. భూమిపై ఉన్న పౌరులందరినీ ఆశీర్వదించండి, వారు అన్ని ఆత్మల మధ్య సహకార ఐక్యతను నెలకొల్పడానికి మరియు మీ శక్తి మరియు ప్రేమ కాంతితో మీ రాజ్యానికి మమ్మల్ని నడిపించే ఐక్య ప్రపంచంలో జీవించడానికి దీవించండి.”

ఓం. శాంతి. ఆమెన్.

మేము ఈ అదనపు వనరులను కూడా సూచిస్తాము:

ఇతరులతో షేర్ చేయండి