దృష్టాంతాలు

ప్రార్థనా మండలికి వచ్చిన ఉత్తరాలల్లో కొన్నింటి నుంచి

“మీ ప్రేమపూర్వక ప్రార్థనలు అద్భుతాలు చేయడానికి సహాయపడ్డాయి.... నేను వేగంగా కోలుకుంటున్నాను, ఇంకా నా విశ్వాసం చాలా గాఢంగా మారింది, ఎందుకంటే నా చుట్టూ ఉన్న దేవుని ప్రేమపూర్వక, స్వస్థత చేకూర్చే ఉనికిని నేను అనుభవించాను.”

— డి. బి., తోపంగా, కాలిఫోర్నియా

“నేను ఎంత గాఢంగా చలించిపోయానో, ప్రార్థనా మండలికి ఎంత కృతజ్ఞతతో ఉన్నానో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రార్థన చేసే ప్రతి ఒక్క సందర్భంలోనూ మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో, ఆ వ్యక్తి జీవితంలో ప్రయోజనకరమైన మార్పు ఉన్నట్టు నేను గుర్తించాను. మొదట నేను దీనిని చూసి ఆశ్చర్యపోయాను; ఇప్పుడు దేవుడిలో మరియు ప్రార్థనలో నా విశ్వాసం చాలా గాఢవంతమైంది. గాఢంగా మరియు మనఃపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించే అందరికీ ఆయన సహాయం చేస్తాడని నాకు తెలుసు.”

— ఆర్. హెచ్., పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా

“మా స్థానిక ఎస్.ఆర్.ఎఫ్. భక్తులలో ఒకరి తండ్రి ఇటీవల తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు, నేను అతనికి చికిత్స చేసిన వైద్యులలో ఒకడిని. మేము స్వస్థత ప్రక్రియ చేసిన తర్వాతే అతని ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడింది. మన ద్వారా పనిచేసే ఈ ప్రక్రియ యొక్క శక్తివంతమైన బలం, మన సాంప్రదాయిక మార్గాలను మించి మంచి ఫలితాలను ఇస్తుందని నేను గుర్తించినప్పటి నుండి నేను గాఢంగా ప్రభావితం అయ్యాను.”

— డాక్టర్ జి. ఆర్., శాంటా ఫే, అర్జెంటీనా

“ఇతరుల కోసం ప్రార్థించడం అనే దాని ప్రభావం గురించి నేను చాలా సంవత్సరాలు సందేహించాను — అది వాస్తవంగా పని చేసిన ఋజువు లేవీ నాకు కనపడ లేదు. కానీ, నేను ఇప్పుడు అనుభూతి చెందే ఆత్మోన్నతి — నిస్సందేహంగా నా తరపున ప్రార్థనా మండలి వారు చేసిన గాఢమైన ప్రార్థనల ఫలితం — ప్రార్థన తప్పక పని చేస్తుందన్న దానికి నాకు తిరుగులేని ఋజువు చూపించింది. గట్టెక్కడం కష్టంగా కనిపించిన అసాధారణ అవరోధాలు క్రమంగా తొలగిపోతున్నాయి.”

— బి.ఆర్., ఆమ్ హెరెస్ట్, మసాచుసెట్స్

“ఒక సంవత్సరం క్రితం, లుకేమియా (రక్త కేన్సరు), మరియు హెపటైటిస్ (కాలేయ వ్యాధి)తో తీవ్రంగా బాధ పడుతున్న ఒక చిన్న పిల్ల కోసం మీ సహాయం అర్థించాను. ఇప్పుడా పాపకు పూర్తిగా స్వస్థత చేకూరింది. శరీరంలో ఎక్కడా కేన్సరు కణాలు లేవు. ఈ అస్తవ్యస్త ప్రపంచంలో మనిషి ఒంటరి వాడు కాదని ఈ అసాధారణ రోగనివారణ తిరుగులేని రీతిలో ఋజువు చేసింది.”

— ఇ.ఎన్., నేపోలి, ఇటలీ

ఇతరులతో షేర్ చేయండి