థాంక్స్ గివింగ్ 2011

“మీకు ఇప్పుడు ఉన్న అదృష్టాని చూడండి; అతని దయ యొక్క ప్రతి కొత్త వ్యక్తీకరణ పట్ల అప్రమత్తంగా మరియు సజీవంగా ఉండండి.” — శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు

థాంక్స్ గివింగ్‌ లో — ప్రతి మంచి బహుమతిని ఇచ్చే భగవంతుడు నుండి మనము అందుకున్నదంతా ప్రేమపూర్వక ప్రశంసలతో పండుగ జరుపుకోవడానికి కుటుంబం మరియు స్నేహితులను ఒకచోట చేర్చే సమయం — శ్రీ పరమహంస యోగానందగారి ఆశ్రమాలలో ఉన్న మేము దేవునికి మీతో పాటు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుచున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఆధ్యాత్మిక కుటుంబం కోసం ప్రార్థనలను మరియు మీకు మా ప్రత్యేక జ్ఞాపకాలను మరియు ప్రేమను పంపుతున్నాము, మీ ఆధ్యాత్మిక స్నేహం మాకు అత్యంత ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము.

దేవుని అనుగ్రహాన్ని గురించి ఆలోచించటానికి ఒక జాతీయ దినోత్సవాన్ని పెట్టే సంప్రదాయాన్ని గురుదేవులు చాలా మెచ్చుకున్నారు; మరియు ప్రతిరోజూ కృతజ్ఞతా భావంతో జీవించమని ఆయన మమ్మల్ని ప్రోత్సహించారు. మనం దైవాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా మనల్ని ఆయన ఆదరిస్తాడు. కానీ ఆయన ఉనికి మన జీవితాల్లో వ్యాపించి ఉన్న లెక్కలేనన్ని మార్గాల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఆ సంబంధం ఎంత మధురమైనదో మరియు మనల్ని ఎంత మార్చుతుందో మనకు తెలుస్తుంది. ఆయన సృష్టిలోని అద్భుతాలను మనం కళ్ళతో చూసి, భగవంతునితో అనుసంధానమైన ఆత్మల ద్వారా వెల్లడి చేయబడిన ప్రతి ఉత్తేజకరమైన సత్యం ద్వారా మరియు అవసరమైన సమయాల్లో ప్రతి ఓదార్పునిచ్చే అంతర్దృష్టి ద్వారా ఆయన ప్రేమ యొక్క స్పర్శను అనుభవించినప్పుడు, అతను మన క్షేమం కోసం ఎంత లోతుగా శ్రద్ధ వహిస్తున్నాడో మనం గ్రహించడం ప్రారంభిస్తాము. హృదయపూర్వక కృతజ్ఞతతో మన స్పృహ యొక్క గ్రహణశక్తిని మెరుగుపరచడం వలన, భగవంతునితో మన సంబంధం బలపడుతుంది. తద్ద్వారా ఈ ప్రపంచంలోని ద్వంద్వత్వాల యొక్క ప్రతికూల వ్యక్తీకరణలు మనకు తక్కువ హాని కలిగిస్తాయి.

“మన ఆశీర్వాదాలను లెక్కించడం” అనే అభ్యాసం మనలోను, ఇతరులలోను మరియు జీవితంలోని వివిధ పరిస్థితుల్లోను — దేవునిపై మన విశ్వాసాన్ని పరీక్షించే వాటిలో కూడా, మంచిని వెతకడానికి మరియు దృష్టి పెట్టడానికి మన మనస్సులకు శిక్షణ ఇస్తుంది. ఆయన అనుగ్రహం సమాధానమిచ్చిన ప్రార్థనగా వచ్చినా లేదా మన సామర్థ్యాలను విస్తరించడానికి మరియు ఆధ్యాత్మిక పటుత్వం మరియు అవగాహన వృద్ధి చెందడానికి అవకాశంగా వచ్చినా, మనం అతని మార్గదర్శకత్వం మరియు ప్రేమకు మరింత గ్రహీత అవుతాము. మనం సానుకూల దృక్పథం వైపు చూసినప్పుడు మరియు దాని వెనుక దేవుని హస్తాన్ని చూసినప్పుడు, ఆయనపై మన నమ్మకాన్ని బలపరచడానికి మనం ఉపయోగించుకోగలిగే ఆయన సహాయం యొక్క విలువైన జ్ఞాపకాలను మనం భద్రపరుచుకుంటాము. ఆయన మీద విశ్వాసం మరియు అనుసంధానము పెరిగేకొద్దీ, ఆయన మన పట్ల ఎప్పుడూ ఉదాసీనంగా లేడని మనం అర్థం చేసుకుంటాము. “మీరు ఆయనను మరియు ఆయన ప్రతిస్పందించే అనేక మార్గాలను గమనిస్తూ ఉంటే, వాస్తవానికి ఆయన మీకు అన్ని సమయాలలో సమాధానం ఇస్తాడని మీకు తెలుస్తుంది” అని గురూజీ అన్నారు. భగవంతునితో అంతర్గత అనుసంధానం యొక్క నిశ్చలతలో, భౌతిక ప్రపంచం యొక్క పరధ్యానం తొలగిపోయి, ఆయన కాంతి మరియు ప్రేమతో మనం తడుపబడినప్పుడు, భగవంతుడు మనల్ని ఎప్పుడూ పోషిస్తాడని, రక్షిస్తాడని గొప్ప హామీ వస్తుంది. ఆయన అపరిమితమైన జీవితం మరియు అస్తిత్వం యొక్క సాగరమంత సహాయాన్ని మన స్పృహలో అనుభవిస్తూ, మనకు తెలియనప్పటికీ, ఆయన మనకు అత్యున్నతమైన నిధిని — తన అస్ధిత్వం అనే శాశ్వతమైన బహుమతిని ప్రసాదించాడని మనం గుర్తిస్తాము.

ఈ జ్ఞాన-అవగాహనను పెంపొందించుకోవడం వలన హృదయం దైవానికి కృతజ్ఞతతో నిండిపోతుంది. ఇది కేవలం కృతజ్ఞతతో కూడిన మాటల్లోనే కాకుండా, ఇవ్వాలనే కోరికగా పొంగిపొర్లుతుంది — ఆయనను తెలుసుకోవడం మరియు ప్రేమించడం కోసం మన ప్రయత్నాలను బేషరతుగా ఆయనకు అందించడం; మరియు భౌతికంగా లేదా ఇతరత్రా, అవసరమైన వారికి సేవ చేయడం. నా హృదయం నుండి, థాంక్స్ గివింగ్ సమయంలో “మీరు ఇవ్వడం యొక్క స్వచ్ఛమైన ఆనందాన్ని కనుగొనమని” నేను ప్రార్థిస్తున్నాను — అనంతంగా ఉన్న భగవంతుని ప్రేమను మన అంతర్గత మరియు బయటి జీవితాలలోకి, మరియు మన ద్వారా అందరికీ కూడా స్వేచ్ఛగా ప్రవహించేలా మనం అనుమతించినప్పుడు, ఆత్మ విమోచనము మరియు రక్షణ లభిస్తుంది.

మీకు మరియు మీ ప్రియమైన వారికి థాంక్స్ గివింగ్ సందర్భంగా ఆశీర్వచనాలతో,

శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2011 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

 

 

ఇతరులతో షేర్ చేయండి