యోగదా సత్సంగ ఆన్‌లైన్ కుటుంబానికి స్వాగతం — శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క స్వస్థతకు అంకితమైన పత్రిక — ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం నుంచి నడుస్తున్న యోగా మ్యాగజైన్‌లలో ఇది ఒకటి. ఆధ్యాత్మిక మణిదీపం ఒక యోగి ఆత్మకథ రచయిత శ్రీ పరమహంస యోగానందచే రూపొందింపబడిన పత్రిక. యోగదా సత్సంగ ఆత్మను పరమాత్మతో ఏకం చేసి మానావాళి సమరసతకు బాటలు వేసే భారతీయ ప్రాచీన శాస్త్రమైన యోగా యొక్క కాలాతీత సార్వత్రిక సత్యాల గురించి ఉన్నత స్పృహను కోరుకునే వారిని లోకానికి పరిచయం చేస్తోంది.
యోగదా సత్సంగ 2021లో ప్రింట్ మరియు ఆన్‌లైన్ మ్యాగజైన్ ల కలయికగా రూపొందింది. ఆధునిక రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త యోగదా సత్సంగ పత్రిక ఆన్‌లైన్ మెటీరియల్ ను అందిస్తుంది. అలాగే ప్రత్యేక వార్షిక సంచిక ఉంటుంది. వీటన్నిటి డిజిటల్ సంచిక కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఆ ఆన్‌లైన్ సంచికలో ఇప్పుడు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే స్ఫూర్తిదాయకమైన మరియు సూచనాత్మక మల్టీమీడియా కంటెంట్ కూడా చోటు చేసుకుంది.
యోగదా సత్సంగ పత్రిక తన పరిణామ క్రమంలో, వేలాది మంది జీవితాలలో పరివర్తన తీసుకువచ్చి, వారి శరీరము, మనస్సు, ఆత్మలకు అత్యన్నత శక్తి సామర్థ్యాలను సాధించిపెట్టగల, పరమహంస యోగానందగారి ద్వారా వెలుగులోకి వచ్చిన, కాలపరీక్షకు నిలచిన యోగా మెళకువలను, ఆచరణాత్మకమైన “జీవించడం ఎలా” అనే ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని తాము నిరభ్యంతరంగా అభ్యసించగలమనే అవగాహనను అనేక వేల మందికి కల్పించి సహకరించే బాధ్యతను నిర్వర్తిస్తోంది.
యోగదా సత్సంగ పత్రిక ప్రివ్యూ, 2022 వార్షిక సంచిక
యోగదా సత్సంగ పత్రిక చందాదారులు కొత్త ఆన్‌లైన్ లైబ్రరీలో ప్రస్తుత సంచికను చదవగలరు.
అలాగే రాబోయే నెలల్లో, వారు మ్యాగజైన్ యొక్క గత సంచికల నుండి ఎంచుకున్న అనేక సంవత్సరాల క్రిందటి స్ఫూర్తిదాయకమైన కంటెంట్ తో కూడిన ప్రత్యేక ఆన్‌లైన్ లైబ్రరీని కూడా యాక్సెస్ చేయగలరు. శ్రీ పరమహంస యోగానంద, శ్రీ దయామాత మరియు ఇతర అభిమాన రచయితలు వెలువరించిన, గతంలో యోగదా సత్సంగ పాఠకులు ఆసక్తిగా గ్రహించిన వందలాది పేజీల అసాధారణమైన జ్ఞాన సంపద, అలాగే అరుదైన ఫోటోలు మరియు వై.ఎస్.ఎస్. వార్తలు (ఇప్పుడు వై.ఎస్.ఎస్. చరిత్ర!) వారికి అందుబాటులో ఉంటాయి.
భారతదేశం నుండి పాశ్చాత్య దేశాలకు చేరుకుని, 1920లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ని స్థాపించిన వెంటనే పరమహంస యోగానందగారు అమెరికాలోని వివిధ నగరాలకు వెళ్ళి క్రియాయోగా బోధనలపై తరగతులు నిర్వహించడం ప్రారంభించారు. ఇది ఆధునిక కాలంలో తిరిగి ప్రవేశపెట్టబడిన సెల్ఫ్-రియలైజేషన్ కి సంబంధించిన, పరమహంసగారి గురుపరంపరచే అభివృద్ధి పరచబడిన ప్రాచీన శాస్త్రం. యోగానందజీ, 1925లో తన పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. సుదూర నగరాల్లోని తన వేలాది మంది విద్యార్థులతో క్రమం తప్పకుండా సంబంధ బాంధవ్యాలను నెరపే సాధనంగా ఆయన దానిని అభివర్ణించారు. “నేను ఈ పత్రికలోని వ్యాసాల ద్వారా మీ అందరితో మాట్లాడతాను.” అని ఆయన అనేవారు.
నాటి నుంచి నేటి వరకు, ధ్యానం మరియు సమతుల్య ఆధ్యాత్మిక జీవన కళను నేర్పే యోగశాస్త్రంపై పరమహంస యోగానందగారు, ఆయన ఆధ్యాత్మిక వారసులు మరియు ఇతర సన్నిహిత శిష్యుల నుండి గతంలో ప్రచురింపబడని ప్రసంగాలు మరియు రచనలను యోగదా సత్సంగ తన పాఠకులకు అందించింది.
శీర్షికలో పేర్కొన్నట్లుగా, యోగదా సత్సంగ “శరీరము, మనస్సు మరియు ఆత్మ యొక్క స్వస్థతకు అంకితమైన పత్రిక. సరైన ఆహారం, సరైన జీవనం మరియు దేవుని సర్వ-శక్తివంతమైన విశ్వశక్తితో శరీరాన్ని రీఛార్జ్ చేయడం ద్వారా శరీరానికి స్వస్థత చేకూర్చడం, ఏకాగ్రత, నిర్మాణాత్మక ఆలోచన, ఉల్లాసాన్ని కలిగించడం ద్వారా మనస్సు నుండి అసమానతలను, అసమర్థతను తొలగించడం, ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఆత్మను ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక అజ్ఞానాంధకారం నుండి విముక్తం చెయ్యడం” ఎలాగో యోగదా సత్సంగ తెల్పుతుంది.
యోగాదా సత్సంగ ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక ఆలోచనల యొక్క విశిష్టమైన సమ్మేళనాన్ని అందజేస్తుంది. మనోహరమైన, వివరణాత్మక కథనాలతో విస్తృత శ్రేణి విషయాలపై అంతర్ దృష్టిని అందిస్తుంది. వాటితో సహా:
ఏప్రిల్-జూన్ 2020 సంచిక
“Are We Really Entering a Better Age?” by Swami Anandamoy Giri
“Courage to Face Our Fears” by Sri Sri Daya Mata
“Yoga and the Emotions: Emotional Maturity for Health, Happiness, and Self-realization” by Sri Sri Paramahansa Yogananda
“The Yoga Sadhana That Brings God’s Love and Bliss” by Sri Sri Mrinalini Mata
“Purchasing Eternity: Applying the Power of Economic Principles to Achieve Our Spiritual Goals” by Swati Mukerjee
“Practising the Divine Presence” by Swami Bhaktananda Giri
గత రెండు దశాబ్దాలలో మన ప్రపంచం, సమాచారాన్ని, సూచనలను ప్రచురించే, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు పంపిణీ చేసే విధానంలో భారీ మార్పులను చవి చూసింది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా దీని నుండి అనేక విధాలుగా అభివృద్ధి చెందింది, ప్రయోజనం పొందింది. వై.ఎస్.ఎస్. విద్యార్థులు, మొదటిసారిగా వై.ఎస్.ఎస్.ని తెలుసుకోగోరే వారు — ప్రపంచ ఆధ్యాత్మిక సంఘాన్ని, ఫెలోషిప్ ను గొప్పగా అనుభూతి చెందడానికి వీలుగా, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. కోసం పరమహంస యోగానందగారు దేనినైతే ఆకాంక్షించారో, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆన్‌లైన్ లో మల్టీమీడియా సమర్పణల విస్తృత వర్ణపటాన్ని యోగదా సత్సంగ వెబ్సైట్ అందిస్తోంది.
అదనంగా, పరమహంస యోగానందగారి క్రియాయోగా బోధనల వ్యాప్తిలో ఇటీవలి మైలురాయి ఒకటి ఉంది. 2019లో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యోగదా సత్సంగ పాఠాల యొక్క పూర్తి, మెరుగుపరచబడిన ఎడిషన్ ను ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకూ ప్రచురించబడని, అత్యంత లోతైన పరమహంసజీ యొక్క బోధనలు మరియు మెళకువల సమాచారం ఉంది. ముప్పై సంవత్సరాలకు పైగా ఆయన చేసిన రచనలు, ఉపన్యాసాలు, భక్తులకు చేసిన వ్యక్తిగత సూచనల పూర్తి సమాచారం ఇందులో విస్తృతంగా రూపొందించబడింది.
ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా, 1925లో సెల్ఫ్-రియలైజేషన్ (యోగదా సత్సంగ) పత్రిక యొక్క మొదటి సంచిక ప్రచురణతో నిరాడంబరంగా ప్రారంభమైన ప్రేరణ ప్రవాహం విపరీతంగా విస్తరించింది. పరమహంసజీ బోధనల జ్ఞానం అపూర్వమైన స్థాయిలో ఆయన పత్రికను ప్రారంభించినప్పటి కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా సాధకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ ఆఫర్‌ల ఉదాహరణల గురించి తెలుసుకోవడానికి మరియు వాటికి లింక్ లను కనుగొనడానికి మా సైట్లో స్క్రోల్ చేయండి.
2020లో, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్., గడచిన సంవత్సరాల నుండి పరమహంసజీకి ప్రియమైన సన్నిహిత శిష్యులైన శ్రీ దయామాత, శ్రీ మృణాళినీమాత, స్వామి ఆనందమోయ్ గిరి మరియు ఇతరులు, ప్రస్తుత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల మార్గదర్శక ధ్యానాలతో వారంవారం స్ఫూర్తిదాయకమైన ఆన్‌లైన్ చర్చలను అందించడం ప్రారంభించింది. ఈ వీడియోలు ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌లు మరియు యూట్యూబ్ (YouTube) ఛానెల్లో శాశ్వతంగా ఉంటాయి.
పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక వారసులు — వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల నుండి చర్చలు మరియు సందేశాలను అందించడం యోగద సత్సంగ పత్రిక యొక్క ప్రత్యేకత. మా బ్లాగులో మరియు మా పత్రిక వార్షిక ముద్రణ సంచికలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడు స్వామి చిదానంద గిరి యొక్క అంతర్ దృష్టి మరియు ప్రేరణనందించే సంప్రదాయం కొనసాగుతోంది. అదనంగా, స్వామి చిదానంద గిరి నేతృత్వంలోని మార్గదర్శక ధ్యానాల వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సంవత్సరాలుగా, అనేక మంది యోగదా సత్సంగ పత్రిక పాఠకులకు, పత్రికలోని “వై.ఎస్.ఎస్. వార్తలు” విభాగాన్ని తెలుసుకోవడంపై చాలా ఆసక్తి ఉంది. మీరు మా బ్లాగ్ వార్తల విభాగం ద్వారా — అనేక ఫోటోలు మరియు వీడియోలతో — వై.ఎస్.ఎస్. గురించి సాధారణ నవీకరణలను యాక్సెస్ చేయవచ్చు. అదనంగా, సంవత్సరంలోని ముఖ్యాంశాలు వార్షిక ముద్రణ సంచికలలో ప్రచురించబడతాయి.
2021లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వై.ఎస్.ఎస్. ఆన్‌లైన్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. బోధనల విద్యార్థులకు, అలాగే ధ్యానం చేయడానికి కొత్తగా వచ్చిన ఎవరికైనా సామూహిక ధ్యానాల యొక్క విస్తృతమైన రోజువారీ షెడ్యూల్ ను అందిస్తుంది. చాలా వరకు వీటిని ఇంగ్లీషు మరియు హిందీలలో దీర్ఘకాల వై.ఎస్.ఎస్. భక్తులు నిర్వహిస్తున్నారు. అదనంగా, వారంవారం జరిగే సామూహిక ధ్యానాలను వై.ఎస్.ఎస్. సన్యాసులు నడిపిస్తారు.
యోగదా సత్సంగ పత్రికను స్ఫూర్తిగా తీసుకుని, ఒక యోగి ఆత్మకథలోని లోతైన సత్యాలను పొందాలనుకునే వారి కోసం, వై.ఎస్.ఎస్. “జీవించడం ఎలా” అనే సూత్రాలను, ధ్యాన పద్ధతులను పూర్తిగా తమ జీవితాల్లోకి చేర్చుకోవాలనుకునే వారికోసం పరమహంస యోగానందగారు యోగదా సత్సంగ పాఠాలను రూపొందించారు. ఈ పాఠాలు, ధ్యానం మరియు సమతుల్య ఆధ్యాత్మిక జీవన కళలో సాధకునికి వ్యక్తిగత మరియు లోతైన సూచనలను అందించే సమగ్ర గృహ-అధ్యయన కోర్సు. దానిని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ కి వెళ్ళండి. ఆనందంతో నిండిన పరివర్తననందించే ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి.
మీరు డివోటీ పోర్టల్ లేదా ఆన్‌లైన్ బుక్‌స్టోర్ ద్వారా కొత్తగా విడుదల చేసిన మ్యాగజైన్ మొదటి వార్షిక సంచికకు సభ్యత్వాన్ని పొందవచ్చు.
వై.ఎస్.ఎస్. బుక్‌స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్న పత్రిక యొక్క మునుపటి సంచికలను కొనుగోలు చేయండి.
నెలవారీ వార్తా లేఖల సభ్యత్వాన్ని పొందండి
Please share your location to continue.
Check our help guide for more info.