ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి

ప్రార్థనల గురించి శ్రీ పరమహంస యోగానంద

శ్రీ శ్రీ దయామాత నుండి ఆహ్వానము:

శ్రీ దయామాత - ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్ యొక్క మూడవ అధ్యక్షురాలు.యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిని గురించి పరిచయం చేయడం ద్వారా, ప్రార్థన యొక్క క్రియాశీలక శక్తితో ఇతరులకు సేవ చేసే విధానంలో పాల్గొనమని నేను మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను.

ప్రతిరోజూ వార్తాపత్రికలలో ఏదో ఒక కొత్త వ్యాధి లేదా విధ్వంసం గురించి లేదా వేరొక అంతర్జాతీయ సంక్షోభం గురించి చదువుతున్నప్పుడు – చాలా మంది ప్రజలు వారి జీవితాల గురించి మరియు వారి ప్రియతముల గురించి లోతైన అభద్రతా భావానికి గురవుతున్నారు. “ఈ ప్రపంచంలో నేను ఆధారపడదగినది ఏమైనా ఉందా? ఈ భయాలను పోగొట్టేందుకు, నా కోసం మరియు మానవులందరి కోసం కోరుకునే శాంతి మరియు భద్రతలను కలిగించడానికి నేను తీసుకోగల చర్యలు ఏమైనా ఉన్నాయా?” అని ఆలోచించే పరిస్థితికి మనం చేరుకున్నాము.”

మన అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఎప్పుడు, ఎలా మనం ప్రార్థించాలో తెలుసుకోవడం ద్వారా మనము కోరుకున్న ఫలితాలను పొందవచ్చు. సరైన పద్ధతిని పాటించినపుడు, అది దేవుని సరైన నియమాలను అమలులోకి తెస్తుంది; ఈ నియమాలను శాస్త్రీయంగా అమలు చేయడం వల్ల ఫలితాలు కలుగుతాయి.

అలాంటి ప్రశ్నలకు మనము గాఢంగా స్పందిస్తాము – మన హృదయాలను కలవరపెట్టే ఈ సమస్యకు సమాధానం ఉంది. శారీరకమైన మరియు ఆవేశపూరిత అసామరస్యంతో మనము ఎందుకు బాధకు గురవుతాము – దేశాల మధ్య సామాజికంగా మరియు అంతర్జాతీయంగా ఘర్షణ ఎందుకు నెలకొంటుంది – తమ తప్పుడు ఆలోచనలు మరియు చర్యలతో అన్నిటికీ మూలమైన దివ్యశక్తి మరియు ఆశీస్సులతో తమను తాము దూరం చేసుకోవడం వల్ల.

ఈ రోజు బహుశా ఎప్పటి కంటే ఎక్కువగా ఆ ప్రతికూలతకు ప్రతిచర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. భూమిపై ఈ ఆందోళన కలిగించే స్థితిని మార్చాలనుకొంటే, అన్నిటికీ మూలమైన దివ్యత్వంతో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇదే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి ఉద్దేశం. ఇక్కడ ఇవ్వబడిన సందేశాన్ని లోతుగా పరిశీలించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. వివిధ మతాలకు, జాతులకు చెందిన ప్రతి పురుషుడు, స్త్రీ మరియు పిల్లలు కూడా తమ కోసం మరియు తమ ప్రియతములైనవారి స్వస్థత కోసం ప్రభావవంతమైన పని ఎలా చేయవచ్చో ఇది వివరిస్తుంది, మరియు వ్యక్తిగత ప్రయత్నాలు ప్రార్థనా శక్తి మీద కేంద్రీకరించడం వల్ల – మనలో ఉన్న దేవుడి అపరిమిత శక్తి – సమస్యల్లో ఉన్న ప్రపంచ దేశాల మధ్య గొప్ప సామరస్యం కలిగించడానికి చాలా సహాయం చేస్తుంది.

ఈ ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిలో మీరు చేరతారని ఆశిస్తున్నాను తద్వారా ప్రతిచోటా ఉన్న స్త్రీ పురుషులు గొప్ప అవగాహన ద్వారా తమలో ఉన్న దివ్యశక్తిని జాగృతం చేసుకొనెదరుగాక మరియు అది ప్రపంచ ప్రజల మధ్య శాంతి మరియు సహవాసం వ్యక్తీకరించుగాక.

— శ్రీ శ్రీ దయామాత

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మూడవ అధ్యక్షులు

స్వస్థత ప్రార్థనలు చేస్తున్న ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలిలోని వై.ఎస్.ఎస్. భక్తులు

Share this on

Share on facebook
Share on twitter
Share on whatsapp