యోగదా సత్సంగ శాఖ ఆశ్రమం, నోయిడా

నోయిడా ఆశ్రమం

యోగదా సత్సంగ శాఖ ఆశ్రమం, నోయిడా, పరమహంస యోగానంద మార్గ్
B – 4, సెక్టార్ 62, నోయిడా 201307
జిల్లా గౌతమబుద్ధ నగర్, ఉత్తర ప్రదేశ్
మొబైల్: +91 9899811808 , +91 9899811909
ఇమెయిల్: [email protected]

వెబ్‌సైట్ లింక్http://noida.ysskendra.org/

యోగదా సత్సంగ శాఖ ఆశ్రమం – నోయిడా మొదటి దశ నిర్మాణం పూర్తయిన తర్వాత జనవరి 2010లో ప్రారంభించబడింది. ఢిల్లీ-యు.పి. సరిహద్దు నుండి కేవలం 4 కి.మీ. దూరంలో, 5 ఎకరాల స్థలంలో కట్టబడి, ఈ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మరియు రెండు రిట్రీట్ బ్లాక్‌లు ఉంటాయి.

అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనేది పూర్తిస్థాయి బేస్‌మెంట్‌తో కూడిన 3 అంతస్థుల భవనం. ఇందులో ధ్యాన మందిరం, రిసెప్షన్, పుస్తకాలు/లైబ్రరీ, కౌన్సిలింగ్ రూమ్‌లు, కిచెన్/డైనింగ్, ఆఫీసులు, సన్యాసుల మరియు జాతీయ రాజధాని ప్రాంతం గుండా వెళ్తున్న భక్తుల కోసం గదులు (3 రోజుల వరకు – అడ్వాన్స్ బుకింగ్‌ అవసరం) ఉన్నాయి.

రెండు రిట్రీట్ బ్లాక్స్, పురుషులు మరియు మహిళలకు విడివిడిగా, మరియు ఒక్కొక్కటీ 30 సింగిల్ గదులు కలిగిన, వ్యక్తిగత మరియు నిర్వహించబడిన ఆధ్యాత్మిక రిట్రీట్స్ మీద దృష్టితో నిర్మించబడిన ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత. భక్తులు మౌనం, అధ్యయనం మరియు సాధనతో, అలాగే నివాస సన్యాసులచే కౌన్సెలింగ్‌ తో కూడిన వ్యక్తిగత రిట్రీట్స్ కు 3-6 రోజుల పాటు ఉండటానికి ఆహ్వానితులు. అదనంగా, చాలా వరకు వారాంతాల్లో సన్యాసులచే నిర్వహించబడే రెగ్యులర్ రిట్రీట్స్ ఉన్నాయి. ఇవి 3-5 రోజుల వ్యవధి కలిగి ఉంటాయి. మరియు మన దివ్య గురువుల బోధనలు, జీవించటం ఎలా అనే సూత్రాలు మరియు ఏకాగ్రత మరియు ధ్యానం యొక్క ప్రక్రియలు వంటి నిర్దిష్ట అంశాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. రెండు సందర్భాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్‌ అవసరం.

ఆశ్రమంలో పెద్ద మరియు చిన్న సంగమాలు కూడా జరుగుతున్నాయి.

Share this on

This site is registered on Toolset.com as a development site.