ఫిబ్రవరి 1న స్వామి చిదానంద గిరి గారి చేత వై.ఎస్.ఎస్. పాఠాలను ప్రారంభించే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం

15 జనవరి, 2019

ఫిబ్రవరి 1, శుక్రవారం ఉదయం 8:00 గంటలకు, యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల యొక్క కొత్త ఎడిషన్ ప్రారంభోత్సవం, మా వెబ్‌సైట్‌లో స్వామి చిదానంద గిరి గారు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక అధిపతి ద్వారా అందించబడుతుందని తెలియచేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఆయన మొదటిసారిగా పరిచయం చేయబోయే అనేక ఉత్తేజకరమైన ప్రయోజనముల గురించిన వివరాలను, అలాగే ఎలా నమోదు చేసుకోవాలనే దాని గురించిన సమాచారాన్ని కూడా తెలియజేస్తారు.

మా వెబ్‌సైట్ నుండి ప్రసారమయ్యే ఈ ప్రత్యక్ష ప్రసారంలో మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాము. మా అనేక ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండలీలు వారి ప్రాంగణంలో ప్రారంభ కార్యక్రమాన్ని సమూహ వీక్షణలను నిర్వహిస్తాయి, మీరు ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్నట్లయితే ఈ ఉత్తేజకరమైన కార్యక్రమంలో వారితో పాటు పాల్గొనాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మీరు ఈ ప్రత్యక్ష ప్రసారంలో చేరలేకపోతే, వీడియో త్వరలో మా వెబ్‌సైట్‌లో మరియు ఎస్.ఆర్.ఎఫ్. యూట్యూబ్ (YouTube) ఛానెల్‌లో అందుబాటులో ఉంటుంది, తద్ద్వారా మీరు దీన్ని మీ సౌలభ్యం మేరకు చూడవచ్చు.

అలాగే, మీ నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి మీ ఆన్‌లైన్ సభ్యత్వ ఖాతాను ధృవీకరించమని, మరియు మీకు ప్రస్తుతము ఖాతా లేకుంటే ఖాతాను తెరవాలని ప్రోత్సహిస్తున్నాము.

యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాల యొక్క కొత్త ప్రచురణ విడుదల మన ప్రియతమ గురువు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి, ఆధ్యాత్మిక పనిలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది, ఈ సందర్భాన్ని మీ అందరితో పంచుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము.

ఈ కార్యక్రమాన్ని నా క్యాలెండర్‌కి జోడించండి

ప్రత్యక్ష ప్రసారం: వై.ఎస్.ఎస్. పాఠాల కొత్త ఎడిషన్ కార్యక్రమం
స్వామి చిదానంద గిరి గారిచే ప్రారంభోత్సవం
ఫిబ్రవరి 1, 2019

ఇతరులతో షేర్ చేయండి